ప్రధాన మంత్రి కార్యాలయం
‘‘భారతదేశం మరియు యుఎస్ఎ: భవిష్యత్తు కోసం నైపుణ్యాల ను వృద్ధి చెందింపచేయడం ’’ కార్యక్రమం లో యుఎస్ఎ ప్రథమ మహిళ తో పాటుపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
22 JUN 2023 10:57AM by PIB Hyderabad
‘‘భారతదేశం మరియు యుఎస్ఎ: భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని నైపుణ్యాల ను వృద్ధి చెందింపచేయడం ’’ అనే అంశం పై వాశింగ్ టన్ డిసి లోని నేశనల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటైన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు పాల్గొన్నారు.
సమాజం లో అందరికీ నాణ్యత తో కూడిన విద్య ను అందుబాటు లోకి తీసుకు రావడం కోసం ఉన్నత విద్య సంస్థల లో సిబ్బంది కి అవసరపడ్డ శిక్షణ ను ఇచ్చే అంశం పై ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడాని కి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించడమైంది.
విద్య బోధన ను, నైపుణ్యాల సాధన ను మరియు నూతన ఆవిష్కరణ లను ప్రోత్సహించడం కోసం భారతదేశం తీసుకొన్న అనేక చర్యల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. భారతదేశం మరియు యుఎస్ ల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక విద్య సంబంధి ఆదాన ప్రదానాల తో పాటు సహకార ప్రధానమైనటువంటి విద్య మరియు పరిశోధన కార్యక్రమాల ను ఆయన ప్రశంసించారు. విద్య బోధన మరియు పరిశోధన ల రంగం లో భారతదేశం-యుఎస్ఎ సహకారాన్ని పటిష్టపరచడం కోసం అయిదు సూత్రాల ప్రతిపాదన ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో సమర్పించారు. ఆ ఐదు సూత్రాలు ఏవేవంటే -
• ప్రభుత్వం, పరిశ్రమ మరియు విద్య జగతి ని ఒక చోటు కు తీసుకు వచ్చేటటువంటి ఒక ఏకీకృత దృష్టికోణం
- గురువు లు మరియు విద్యార్థుల ఆదాన ప్రదానాన్ని ప్రోత్సహించడం
రెండు దేశాల మధ్య వేరు వేరు విషయాల పై హ్యాకథన్ లను ఏర్పాటు చేయడం
- వృత్తిపరమైనటువంటి నైపుణ్య యోగ్యతల కు పరస్పరం గుర్తింపు ను మంజూరు చేయడం
- విద్య మరియు పరిశోధన ల కై ప్రజల యాత్రల ను ప్రోత్సహించడం అన్నమాట.
ఈ కార్యక్రమం లో నార్దర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజి ప్రెసిడెంటు, అసోసియేశన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీజ్ ప్రెసిడెంటు, మైక్రోన్ టెక్నాలజీ యొక్క ప్రెసిడెంటు మరియు సిఇఒ లతో పాటు విద్యార్థులు పాలుపంచుకొన్నారు.
***
(Release ID: 1934607)
Visitor Counter : 161
Read this release in:
Kannada
,
Malayalam
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil