ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగా ప్రాధాన్యంపై ఐరాస ప్రధాన కార్యదర్శి.. ప్రధానమంత్రి సందేశం

प्रविष्टि तिथि: 21 JUN 2023 8:43PM by PIB Hyderabad

   మానవ జీవన శ్రేయస్సులో యోగాభ్యాసానికిగల ప్రాముఖ్యంపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెజ్‌ అభిప్రాయంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏకీభవించారు. యోగా దినోత్సవం మనందర్నీ మరింత సన్నిహితం చేయడంతోపాటు భూగోళం చక్కగా వర్ధిల్లేలా నడచుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించేలా స్ఫూర్తినివ్వాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో- ప్రస్తుత విభజిత ప్రపంచంలో లక్షలాది ప్రజానీకాన్ని యోగాభ్యాసం ఒకే వేదికపైకి తెస్తుందని, ఇది సమష్టి సామర్థ్యం, సామరస్యం, శాంతికి బలమైన మూలస్తంభమని పేర్కొన్నారు.

ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ట్వీట్‌కు స్పందనగా ప్రధానమంత్రి ఇచ్చిన సందేశంలో:

“యోగా ప్రాముఖ్యంపై ఐరాస ప్రధాన కార్యదర్శి @antonioguterres అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. యోగాభ్యాసం మనందర్నీ మరింత దగ్గర చేయడంతోపాటు భూగోళం ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

*****


(रिलीज़ आईडी: 1934601) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam