ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి యుఎస్ఎ కు మరియు ఈజిప్టు కు తనయాత్రార్థం బయలుదేరి వెళ్ళే కంటే ముందుగా జారీ చేసిన ప్రకటన

Posted On: 20 JUN 2023 7:15AM by PIB Hyderabad

అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ మరియు ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు ఆహ్వానించిన మీదట నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల కు ఆధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరి వెళుతున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం మన ఉభయ ప్రజాస్వామ్య దేశాల మధ్య నెలకొన్న భాగస్వామ్యం యొక్క శక్తి కి మరియు కీలకత్వాని కి అద్దం పడుతున్నది.

 


నేను నా యొక్క పర్యటన ను న్యూ యార్క్ నుండి మొదలు పెట్టబోతున్నాను. అక్కడ జూన్ 21 వ తేదీ నాడు యోగ అంతర్జాతీయ దినాన్నినేను ఐక్య రాజ్య సమితి (ఐ.రా.స.) ప్రధాన కేంద్రం లో ఐరాస నాయకత్వం లో మరియు అంతర్జాతీయ సముదాయాని కి చెందిన సభ్యుల తో ఒక ఉత్సవం వలె జరుపుకోబోతున్నాను. యోగ కు ఒక అంతర్జాతీయ దినాన్ని ప్రకటించాలి అంటూ 2014 వ సంవత్సరం డిసెంబర్ లో భారతదేశం ఒక ప్రతిపాదన కు తీసుకు రాగా ఆ ప్రతిపాదన కు సమర్థన లభించిన ప్రదేశం లో జరుగనున్నటువంటి ఈ ప్రత్యేకమైన వేడుక లో పాలుపంచుకోవాలని నేను ఆశ పడుతున్నాను.

 


ఆ తరువాత నేను వాశింగ్ టన్ డిసి కి వెళ్తాను. 2021 వ సంవత్సరం సెప్టెంబర్ లో నేను కడపటి ఆధికారిక సందర్శన ను జరిపింది మొదలు అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ తో పాటు అనేక పర్యాయాలు భేటీ అయ్యే అవకాశాల ను నేను దక్కించుకొన్నాను. ఈ సందర్శన మా భాగస్వామ్యం తాలూకు గాఢత్వాన్ని మరియు వివిధత్వాన్ని మరింత గా పెంపొందింప చేసుకోవడాని కి లభించినటువంటి ఒక అవకాశం అని చెప్పాలి.

 


భారతదేశం-యుఎస్ సంబంధాలు అనేక విధాలైనటువంటివి. వాటి లో అన్ని రంగాల లోను గాఢమైనటువంటి సంబంధం నెలకొంది. వస్తువులు మరియు సేవల లో భారతదేశాని కి అతి పెద్దదైన వ్యాపార భాగస్వామి గా యుఎస్ఎ ఉంది. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, విద్య, ఆరోగ్యం, రక్షణ మరియు భద్రత రంగాల లో మేం సన్నిహిత సహకారాన్ని కలిగివున్నాం. క్రిటికల్ ఎండ్ ఇమర్జింగ్ టెక్నాలజీస్ సంబంధి కార్యక్రమం రక్షణ పరిశ్రమల పరమైనటువంటి సహకారాన్ని, అలాగే అంతరిక్ష రంగం, టెలికం, క్వాంటమ్, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ మరియు బాయోటెక్ రంగాల లో సహకారాన్ని విస్తృత పరచడమే కాకుండా సరిక్రొత్త పార్శ్వాల ను కూడా జత పరచింది. మన రెండు దేశాలు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, దాపరికాని కి తావు ఉండనటువంటి మరియు సంబంధి వర్గాలు అన్నింటి ని కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ ప్రాంత పరమైన ఉమ్మడి దార్శనికత ను పెంపొందింప చేయడం కోసం కూడాను కలసి పని చేస్తున్నాయి.

 



అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో మరియు యుఎస్ లో ఇతర సీనియర్ నేతల తో నేను జరపనున్న చర్చ లు మా ద్వైపాక్షిక సహకారం తో పాటు జి20, క్వాడ్, ఇంకా ఐపిఇఎఫ్ ల వంటి బహుళ పక్షీయ వేదిక లలో పరస్పర సహకారాన్ని బలపరచుకొనే అవకాశాన్ని సైతం ప్రసాదించ గలవు.



అనేక మంది ప్రముఖుల తో కలసి అధ్యక్షుడు శ్రీ బైడెన్ మరియు ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ల ఆతిథ్యం లో జరుగనున్న ఆదికారిక విందు కార్యక్రమం లో పాటు పాల్గొనడం తాలూకు ఆనందం సైతం నాకు దక్కనున్నది.

 


అమెరికా లో దిగువ సభ (కాంగ్రెస్) ఎల్లవేళ ల భారతదేశం-యుఎస్ సంబంధాల కు దృఢమైన ద్విపక్షీయ సమర్థన ను అందిస్తూ వచ్చింది. నా పర్యటన కాలం లో, నేను కాంగ్రెస్ నాయకత్వం ఆహ్వానించిన మీదట అమెరికా కాంగ్రెస్ యొక్క సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నాను.

 


ఉభయ దేశాల ప్రజల మధ్య నెలకొన్న బలమైన పరస్పర సంబంధాలు మన దేశాల మధ్య విశ్వాసాన్ని అభివృద్ధి పరచడం లో వాటి వంతు పాత్ర ను పోషిస్తూ వచ్చాయి. మన సమాజాల లో సర్వోత్తమమైన దాని కి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి చైతన్యశీలమైన భారతదేశం-అమెరికా సముదాయం తో భేటీ ఘడియ ల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మన వ్యాపారం మరియు పెట్టుబడి సంబంధి అనుబంధాన్ని ఉన్నతీకరించడానికి, మరి అలాగే ఆటుపోటుల కు తట్టుకొని నిలచేటటువంటి ప్రపంచ సరఫరా వ్యవస్థ నిర్మాణానికి గల అవకాశాల గురించి చర్చించడం కోసం కొందరు ప్రముఖ సిఇఒ లతో కూడా నేను సమావేశం నిర్వహిస్తాను.

 


ప్రజాస్వామ్యం, వివిధత్వం మరియు స్వేచ్ఛ అనే ఉమ్మడి విలువల మీద ఆధారపడ్డ మన సంబంధాలను యుఎస్ కు నేను జరపబోయే యాత్ర బలోపేతం చేస్తుందన్న నమ్మకం నాలో ఉంది. ప్రపంచం లోని ఉమ్మడి సవాళ్ళ కు ఎదురొడ్డడానికి మేం కలసికట్టు గా దృ ఢం గా నిలచాం.

 


ఈజిప్టు అధ్యక్షుడు శ్రీ అబ్దెల్ ఫతహ్ అల్-సిసీ ఆహ్వానం మేరకు నేను వాశింగ్ టన్ డిసి నుండి కాహిరా కు వెళ్తాను. ఒక సన్నిహిత మరియు మైత్రీపూర్ణ దేశం అయినటువంటి ఈజిప్టు కు మొట్ట మొదటి సారి గా ఆధికారిక పర్యటన కని నేను వెళ్తుండడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది.

 


ఈ సంవత్సరం లో జరిగిన మా గణతంత్ర దినోత్సవాల కు ముఖ్య అతిథి గా వచ్చిన అధ్యక్షుడు శ్రీ సిసీ కి స్వాగతం పలికిన భాగ్యం నాకు ప్రాప్తించింది. కొద్ది నెలల వ్యవధి లో చోటు చేసుకొన్న ఈ రెండు యాత్ర లు ఈజిప్టు తో శరవేగం గా రూపుదాల్చుతున్న మన భాగస్వామ్యాని కి అద్రదం పడుతున్నాయి. అధ్యక్షుడు శ్రీ సిసీ యాత్ర కాలం లో ఈజిప్టు తో భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంస్థాయి కి పెంపు చేయడమైంది.

 

 

 

రెండు దేశాల మధ్య నాగరకత పరం గాను, బహుముఖీనమైంది గాను ఉన్న టువంటి భాగస్వామ్యాని కి మరింత వేగాన్ని జోడించడం కోసం అధ్యక్షుడు శ్రీ సిసీ తో మరియు ఈజిప్టు ప్రభుత్వం లోని సీనియర్ సభ్యుల తో కలసి జరపబోయే చర్చల విషయం లో నేను ఉత్సుకత తో ఉన్నాను. ఈజిప్టు లో చైతన్యవంతమైన భారతీయ ప్రవాసి సముదాయం తో మమేకం అయ్యే అవకాశం కూడా నాకు దక్కనుంది.

 

 

 

**


(Release ID: 1933640) Visitor Counter : 173