వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సన్నకారు రైతులపై దృష్టి సారించి స్థిరమైన, సమ్మిళిత ఆహార వ్యవస్థలను రూపొందించడానికి కృషి జరగాలి.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
'లక్ష్య సాధన, అధ్యక్షుని సారాంశం' పై తొలిసారిగా పత్రాన్ని అమోదించిన జీ-20 దేశాలు
వివిధ అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చి మరో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశం
Posted On:
17 JUN 2023 3:29PM by PIB Hyderabad
జూన్ 15 నుంచి 17 వరకు జరిగిన జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశం ' లక్ష్య సాధన, అధ్యక్షుని సారాంశం' పై రూపొందించిన పత్రాన్ని ఆమోదించింది. వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సమావేశం ఈ పత్రాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జీ-20 నాయకత్వంలో అమలు చేయడానికి అవకాశం ఉన్న అంశాలను పత్రంలో పొందుపరిచారు.
జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశం 2023 జూన్ 16న ప్రారంభమయ్యింది. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా స్వాగత ఉపన్యాసం తో సదస్సు ప్రారంభమయింది. వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశానికి హాజరైన అతిథులు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. మానవ నాగరికతలో వ్యవసాయ రంగం ప్రాధాన్యతను శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. మానవాళి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని జీ-20 వ్యవసాయ మంత్రులకు శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
నాలుగు అంశాలపై దృష్టి సారించి చర్చలు జరగాలని శ్రీ నరేంద్ర మోదీ సూచించారు. (ఎ ) వైవిధ్యభరిత వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి ఆహార భద్రత కల్పించి పోషకాహారాన్ని అందించడానికి సామాజిక భద్రతా వ్యవస్థను మెరుగుపరచడం (బి) పర్యావరణ అనుకూల సాంకేతికతలకు ఆర్థిక సహాయం అందించి స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తి కోసం వ్యవసాయ వ్యవస్థల అభివృద్ధి (సి) చిన్న, సన్నకారు రైతులు, మహిళలు , యువత కోసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి సమ్మిళిత వ్యవసాయ విధానాలు ప్రోత్సహించడానికి విలువ ఆధారిత వ్యవస్థ , ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడం ద్వారా పెరుగుతున్న ఆర్థిక అవకాశాలను ఉపయోగించుకోవడం. (డి) వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి డిజిటలైజేషన్‌ను ప్రాధాన్యత ఇచ్చి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, వ్యవసాయ సమాచారం ప్రామాణీకరణ అంశాలపై చర్చలు జరగాలి అని ప్రధానమంత్రి సూచించారు.
2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటిస్తున్న అంశాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. చిరుధాన్యాలు/ శ్రీ అన్న/ సూపర్‌ఫుడ్‌లు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా రైతుల ఆదాయం పెంచడానికి, రైతులకు స్థిరమైన జీవనోపాధి కల్పించడానికి, పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తాయని అన్నారు. పురాతన ధాన్యాలు, తృణ ధాన్యాల సాగులో అనుసరిస్తున్న అత్యుత్తమ పద్ధతులు, పరిశోధన ,సాంకేతికతలను పంచుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ప్రపంచ సరఫరా వ్యవస్థ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , వాతావరణ మార్పుల ప్రభావం తో మరింత దిగజారింది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భూసార పరిరక్షణ, పంట ఆరోగ్యం రక్షణకు సహకరించే వ్యవసాయ పద్ధతులను గుర్తించడానికి కృషి చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ-20 సభ్య దేశాలను కోరారు. ఆవిష్కరణలు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దిగుబడి ఎక్కువ చేసి రైతులకు సాధికారత కల్పించడానికి కృషి జరగాలి అని ప్రధానమంత్రి సూచించారు.
కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ సదస్సుకు హాజరైన ప్రతినిధులు, మంత్రులకు స్వాగతం పలికారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేష్ చంద్ "ప్రపంచ ఆహార భద్రత, పోషకాహారం" అనే అంశంపై సవాళ్లు , సాధ్యమైన పరిష్కారాలను సూచిస్తూ ఒక ప్రదర్శనను అందించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు శ్రీ కైలాష్ చౌదరి, శ్రీమతి శోభా కరంద్లాజే, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ , వ్యవసాయ పరిశోధన,విద్య శాఖ కార్యదర్శి డాక్టర్ హిమాన్షు పాఠక్, మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ స్వైన్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు మరియు జీ -20 దేశాల ఉన్నత స్థాయి అధికారులు, ఆహ్వానిత సంస్థల అధిపతులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
2023 జనవరి 12-13 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 2023 ని వాస్తవంగా నిర్వహించిందని వ్యవసాయ మంత్రి సమావేశానికి తెలిపారు. “యూనిటీ ఆఫ్ వాయిస్, యూనిటీ ఆఫ్ పర్పస్”.నినాదంతో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 2023 జరిగిందన్నారు.జీ-20 లో సభ్యత్వం లేని అభివృద్ధి చెందుతున్న దేశాలతో సంప్రదింపులు జరిపి వారి అభివృద్ధి ప్రాధాన్యతలు తెలుసుకుని, జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం సాధించాల్సిన లక్ష్యాలను తెలుసుకోవడానికి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 2023 జరిగింది. జీ-20 తో అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పనిచేసి "మానవ-కేంద్రీకృత అభివృద్ధి"ని ప్రోత్సహించడం లక్ష్యంగా సదస్సు జరిగింది.
వ్యవసాయ రంగంలో భారతదేశం సాధించిన విజయాలను వ్యవసాయ మంత్రి వివరించారు. ఆహార భద్రత కల్పించి పోషకాహారం సరఫరా చేయడానికి భారతదేశం "ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు" విధానాన్ని అమలు చేస్తుందన్నారు. జీ -20 కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు.. ఆకలిని అంతం చేయడం, ఆహారం,పోషకాహార భద్రత కల్పించడానికి అమలు చేస్తున్న చర్యలను మంత్రి వివరించారు. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC COP-26) సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన "లైఫ్ (పర్యావరణహిత జీవనశైలి) "" ప్రాధాన్యతను మంత్రి వివరించారు. సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం,ఉద్గారాలను తగ్గించడానికి లైఫ్ ఉపయోగపడుతుందన్నారు.
వ్యవసాయ కార్యవర్గ కార్యకలాపాలను విజయవంతం చేయడానికి జీ-20 సభ్య దేశాలు అందిస్తున్న సహకారం,కృషిని వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో మంత్రి ప్రశంసించారు, సభ్య దేశాల మధ్య అవగాహన కుదరడంతో సమావేశంలో "ఫలితం పత్రం మరియు చైర్ సారాంశం"లో (ఎ) డెక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలు (బి) అంతర్జాతీయ చిరుధాన్యాలు, ఇతర ప్రాచీన ధాన్యాల పరిశోధన అంశాలకు ఆమోదం లభించింది.
వ్యవసాయ కార్యాచరణ అమలు చేయడానికి భారతదేశం చేస్తున్న కృషిని జీ-సభ్య దేశాలు అభినందించాయి.
డెక్కన్ ఉన్నత-స్థాయి సూత్రాలు ప్రపంచ ఆహార భద్రత సంక్షోభాలను ఎదుర్కోవడానికి మానవతా దృక్పధంతో ప్రపంచవ్యాప్తంగా జీ-20 అనుసరిస్తున్న విధానాలను ప్రతిబింబిస్తాయి. ఆహార ధాన్యాల లభ్యత ,పౌష్టికాహారం లభించేలా చేయడం, ఆహార భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, వాతావరణాన్ని తట్టుకుని స్థిరమైన వ్యవసాయం సాగేలా చేయడం, ఆహార వ్యవస్థ అభివృద్ధి కోసంవిధానాలు మరియు సహకార చర్యలు బలోపేతం చేయడం, వ్యవసాయం, ఆహార విలువ గొలుసుల అభివృద్ధి, స్థితిస్థాపకత చేరికను బలోపేతం చేయడం, ఆరోగ్య విధానాన్ని ప్రచారం చేయడం ఆవిష్కరణలను వేగవంతం చేయడం, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, వ్యవసాయంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వ మరియు ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించడం లక్ష్యంగా డెక్కన్ ఉన్నత-స్థాయి సూత్రాలు అమలు జరుగుతాయి.
దీనికి ముందు ఇండోర్, చండీగఢ్, వారణాసిలో మరో మూడు ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. వారణాసిలో జరిగిన జీ- 20 MACS సమావేశంలో “అంతర్జాతీయ చిరుధాన్యాలు,ఇతర ప్రాచీన ధాన్యాల పరిశోధన కార్యక్రమం (మహరిషి)” ప్రారంభమయ్యింది.
జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం వ్యవసాయంలో 'ఒక భూమి' 'ఒక కుటుంబం' లో సామరస్యాన్ని పెంపొందించడం, ప్రకాశవంతమైన 'ఒక భవిష్యత్తు' కోసం ఆశను కల్పించే అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది.
***
(Release ID: 1933083)
Visitor Counter : 185