సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్పు
Posted On:
16 JUN 2023 11:54AM by PIB Hyderabad
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చుతూ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం తీర్మానం ఆమోదించింది. సొసైటీ ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారు.
న్యూ ఢిల్లీలోని తీన్ మూర్తి ప్రాంగణంలో భారతదేశ ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారి పేరిట ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016లో ప్రతిపాదించారు.
25-11-2016 న జరిగిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 162 వ సమావేశంలో తీన్ మూర్తి ఎస్టేట్‌లో ప్రధాన మంత్రుల మ్యూజియం నిర్మాణం చేపట్టడానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి సంగ్రహాలయం పేరిట నిర్మించిన మ్యూజియంను దర్శించడానికి ప్రజలకు 2022 ఏప్రిల్ 21 నుంచి అనుమతి ఇస్తున్నారు.
ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలకు అనుగుణంగా మ్యూజియం పేరు ఉండాలని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ కార్యవర్గం అభిప్రాయపడింది. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం విలువల పరిరక్షణ కోసం సాగిన కృషి, దేశాభివృద్ధికి ప్రధానమంత్రిగా పనిచేసిన వారు అందించిన సహకారాన్ని గుర్తు చేసే విధంగా సంగ్రహాలయ రూపుదిద్దుకుంది. పూర్తిగా నవీకరించబడిన మ్యూజియం కొత్తగా నిర్మించిన భవనం లో పనిచేస్తుంది. శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ జీవితం , దేశాభివృద్ధికి నెహ్రు అందించిన సహకారంపై సాంకేతికంగా అధునాతన ప్రదర్శనలతో ఇప్పుడు మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. దేశ ప్రధాన మంత్రులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు. మన ప్రధానులు వివిధ సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని ఈ విధంగా అభివృద్ధి పథంలో నడిపించారు అనే అంశాలు మ్యూజియం ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాయి. ప్రధాన మంత్రులందరినీ గుర్తించి గౌరవించే విధంగా ఏర్పాటైన మ్యూజియం సందర్శకులకు ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం కల్పిస్తుంది.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ నృపేంద్ర మిశ్రా పేరు మార్చాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రధాన మంత్రుల మ్యూజియం ప్రజాస్వామ్య విలువలకు దేశం కట్టుబడి ఉందని తెలియజేస్తుందని అన్నారు.
సొసైటీ ఉపాధ్యక్షుడు, రక్షణ శాఖ మంత్రి, శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేరు మార్పు ప్రతిపాదనను స్వాగతించారు. శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి శ్రీ నరేంద్ర మోదీ వరకు దేశాభివృద్ధికి ప్రధాన మిత్రులందరి సహకారం వారి ప్రతిస్పందనలను మ్యూజియం ప్రదర్శిస్తుంది అని అన్నారు. వివిధ సవాళ్లు ఎదుర్కొని ప్రతి ఒక్క ప్రధాని దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రిని ఒక వ్యవస్థగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. వివిధ ప్రధాన మంత్రుల ప్రయాణాన్ని ఇంద్రధనస్సు తో పోల్చిన మంత్రి ఇంద్రధనస్సు అందాన్ని రంగులు ఎక్కువ చేస్తాయన్నారు. కొత్త పేరుతో మ్యూజియం దేశ ప్రధాన మంత్రులందరికీ గౌరవం కల్పిస్తుందన్నారు.
*****
(Release ID: 1932862)
Visitor Counter : 176
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada