ప్రధాన మంత్రి కార్యాలయం

‘ప్రధాన మంత్రిమాతృ వందన యోజన’ ను రాజస్థాన్ లోని దౌసా లో  'గోద్ భరాయి' వేడుక గా జరుపుకొనే కొత్త కార్యక్రమాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి

Posted On: 12 JUN 2023 6:45PM by PIB Hyderabad

‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ ను రాజస్థాన్ లోని దౌసాలో 'గోద్ భరాయి’ వేడుక గా జరుపుకొనేటటువంటి కొత్త కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

రాజస్థాన్ లోని దౌసా నుండి పార్లమెంట్ సభ్యురాలు గా ఉన్నటువంటి శ్రీమతి జస్ కౌర్ మీనా కొన్ని ట్వీట్ లలో తాము ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ ను'గోద్ భరాయి’ వేడుక గా జరుపుకొంటామని, ఆ ఉత్సవం లో గర్భిణి మహిళలంతా ఒక చోటు లో గుమికూడుతారని, అక్కడ వారి కి వారి యొక్క సంతానం స్వస్థత నిమిత్తం ‘పోషణ్ కిట్’ లను అందించడం జరుగుతుందని తెలిపారు.

 

ఒక్క రాజస్థాన్ లోనే 2022-23 లో దాదాపు గా 3.5 లక్షల మంది మహిళ లు ఈ పథకం వల్ల లాభపడ్డారని కూడా ఆమె వెల్లడించారు.

 

దౌసా ఎమ్ పి ట్వీట్ ల కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘దౌసా లో నిర్వహిస్తున్నటువంటి ఈ అపూర్వమైన కార్యక్రమం ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ కు క్రొత్త శక్తి ని ఇచ్చేది గా ఉన్నది. దీని ద్వారా మాతృ మూర్తుల తో పాటు గా శిశువుల యొక్క ఆరోగ్య సంరక్షణ సైతం సమకూరుతున్నది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

दौसा की यह अनूठी पहल प्रधानमंत्री मातृ वंदना योजना को नई ऊर्जा देने वाली है। इससे माताओं के साथ-साथ शिशुओं की स्वास्थ्य सुरक्षा भी सुनिश्चित हो रही है। https://t.co/A6uxbh7o60

— Narendra Modi (@narendramodi) June 12, 2023

*******

DS/ST



(Release ID: 1931837) Visitor Counter : 218