హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మణిపూర్ గవర్నర్ అధ్యక్షతన మణిపూర్‌లో శాంతి కమిటీ ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం

Posted On: 10 JUN 2023 1:04PM by PIB Hyderabad

మణిపూర్ గవర్నర్ అధ్యక్షతన మణిపూర్‌లో శాంతి కమిటీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సభ్యులుగా ఉంటారు. విశ్రాంత ప్రభుత్వాధికార్లు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

రాష్ట్రంలోని శాంతి పునఃస్థాపన ప్రక్రియను ఆ కమిటీ చేపడుతుంది. ఇందుకోసం, ఘర్షణ పడుతున్న పార్టీలు/ వర్గాల మధ్య శాంతియుత చర్చలు సహా వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది. సామాజిక ఐక్యత, పరస్పర అవగాహనను బలోపేతం చేయడం, జాతుల మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగేలా చేస్తుంది.

కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా 29 మే 2023 నుంచి జూన్ 1, 2023 వరకు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించిన తర్వాత శాంతి కమిటీని ఏర్పాటు చేశారు.

*****


(Release ID: 1931334) Visitor Counter : 238