ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడిశాలోని బాలాసోర్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 03 JUN 2023 7:03PM by PIB Hyderabad

 

ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో వివిధ రాష్ట్రాల ప్రజలు ఏదో ఒకటి  కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఇది చాలా బాధాకరమని, ఊహకు అందని విధంగా కలవరపెడుతోందన్నారు.



క్షతగాత్రులు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మేము కోల్పోయిన వారి ప్రియమైన సభ్యులను తిరిగి తీసుకురాలేము, కానీ వారి దుఃఖంలో ప్రభుత్వం కుటుంబాలకు అండగా ఉంటుంది. ఈ ఘటన ప్రభుత్వానికి అత్యంత బాధాకరమన్నారు. అన్ని రకాల దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశామని, దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అతడిని వదిలిపెట్టేది లేదు.



ఈ పరిస్థితిలో ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి ప్రయత్నించిన ఒడిశా ప్రభుత్వానికి, ఇక్కడి పరిపాలన అధికారులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విపత్కర సమయంలో సాధ్యమైనదంతా చేయడానికి ప్రయత్నించిన ఇక్కడి నివాసితులకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను; అది రక్తదానం కావచ్చు లేదా సహాయక చర్యలలో సహాయపడవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంత యువత రాత్రంతా కష్టపడి పనిచేశారు.


ఈ ప్రాంత ప్రజలకు కూడా నేను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఎందుకంటే వారి సహకారం వల్ల, సహాయక చర్యలను వేగంగా ముందుకు తీసుకెళ్లగలిగారు. రైల్వే శాఖ తన శక్తినంతా సమీకరించి సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయడానికి, వీలైనంత త్వరగా ట్రాక్ ను పునరుద్ధరించడానికి, వేగంగా ట్రాఫిక్ ను పునరుద్ధరించడానికి పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ మూడు అంశాల పరంగా బాగా ఆలోచించి ప్రయత్నాలు చేశారు.



ఈ విషాద సమయంలో ఈ రోజు నేను ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించాను. ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులతో కూడా మాట్లాడాను. ఈ బాధను చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. కానీ ఈ దురదృష్టకర సమయం నుండి వీలైనంత త్వరగా బయటపడే శక్తిని భగవంతుడు మనకు ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. ఈ సంఘటనల నుండి మనం చాలా నేర్చుకుంటామని, పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మా వ్యవస్థలను సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది దుఃఖ సమయం; మనమందరం ఈ కుటుంబాల కోసం ప్రార్థిద్దాం.

 



(Release ID: 1930818) Visitor Counter : 99