రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒడిషాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాలు/ స్నేహితులు/ బంధువులు, చిక్కుకుపోయిన ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్ధం 139 హెల్ప్‌లైన్ నెంబ‌ర్ ద్వారా భార‌తీయ రైల్వే ప్ర‌త్యేక ఏర్పాట్లు


139 ఫోన్ కాల్స్‌కు 24x7 స‌మాధానం చెప్పేందుకు సీనియ‌ర్ అధికారుల‌ను నియ‌మించ‌న రైల్వేలు

ఈ క్లిష్ట స‌మ‌యంలో బాధిత ప్ర‌యాణీకుల‌కు, వారి బంధువుల‌కు స‌రైన‌, సంతృప్తిక‌ర‌మైన స‌మాచారాన్ని ఇచ్చి తోడ్ప‌డ‌డం రైల్వే హెల్ప్ లైన్ 139 ల‌క్ష్యం

Posted On: 04 JUN 2023 4:08PM by PIB Hyderabad

ఒడిషాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాలు/  స్నేహితులు/ బంధువులు, చిక్కుకుపోయిన ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్ధం  139 హెల్ప్‌లైన్ నెంబ‌ర్ ద్వారా భార‌తీయ రైల్వే ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. సీనియర్ అధికారుల బృందం ఒక‌టి  24X7 హెల్ప్‌లైన్ ను నిర్వ‌హిస్తోంది. జోన‌ల్ రైల్వేలు, రాష్ట్ర ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యం చేసుకుని కాల‌ర్ల‌కు సంబంధిత వివ‌రాల‌ను అందిస్తోంది. ఈ సేవ‌లునిరంత‌రాయంగా న‌డ‌వ‌డ‌మే కాక‌, రైల్వే మంత్రి ప్ర‌క‌టించిన మెరుగైన న‌ష్ట‌ప‌రిహారం - మృతి చెందిన‌వారి కుటుంబానికి రూ. 10ల‌క్ష‌లు, తీవ్ర గాయాలైన వారికి రూ. 2 ల‌క్ష‌లు, స్వ‌ల్ప గాయాలు అయిన వారికి రూ. 50,000 
స‌త్వ‌ర పంపిణీని నిర్ధారిస్తోంది. . 
ఈ క్లిష్ట స‌మ‌యంలో బాధిత ప్ర‌యాణీకుల‌కు, వారి బంధువుల‌కు స‌రైన‌, సంతృప్తిక‌ర‌మైన స‌మాచారాన్ని ఇవ్వ‌డంలో తోడ్ప‌డ‌డం రైల్వే హెల్ప్ లైన్ 139 ల‌క్ష్యం. 
ఇప్ప‌టివ‌ర‌కూ రైల్వేలు 285 కేసుల్లో ( 11 మ‌ర‌ణాల కేసులు, 50 తీవ్రంగా గాయ‌ప‌డిన‌వారి కేసులు, 222 సాధార‌ణ గాయాల కేసులు) రూ. 3.22 కోట్ల న‌ష్ట‌ప‌రిహారాన్ని అందించింది. న‌ష్ట‌ప‌రిహారాన్ని 7 ప్ర‌దేశాల‌లో (సోరో, ఖ‌ర‌గ్‌పూర్‌, బాలాసోర్‌, ఖంతాపార‌, భ‌ద్ర‌క్‌, క‌ట‌క్‌, భుబ‌నేశ్వ‌ర్‌)ల‌లో భార‌తీయ రైల్వేలు చెల్లిస్తోంది. 


***


(Release ID: 1929774) Visitor Counter : 152