వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జాతీయ స్టార్టప్ అవార్డులు 2023కు దరఖాస్తులను సమర్పించేందుకు ఆఖరు తేదీ 15 జూన్ 2023 వరకు పొడిగింపు
Posted On:
01 JUN 2023 1:08PM by PIB Hyderabad
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) 2020లో జాతీయ స్టార్టప్ అవార్డులను (ఎన్ఎస్ఎ) ప్రారంభించింది. జాతీయ స్టార్టప్ అవార్డులు 2023కు దరఖాస్తుల స్వీకరణను 1 ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభించారు. కాగా, దరఖాస్తులను సమర్పించేందుకు ఆఖరు తేదీని ప్రస్తుతం 15 జూన్ 2023 వరకు పొడిగించారు.
ఔత్సాహిక వ్యవస్థాపకులు, వారి వినూత్న పరిష్కారాలను వాటి విస్తారమైన సామాజిక ప్రభావాన్ని ప్రదర్శించేందుకు జాతీయ స్టార్టప్ అవార్డులు 2023 దరఖాస్తుల చివరి తేదీ పొడిగింపు అదనపు సమయాన్ని ఇస్తుంది.
కీలక ఇతివృత్తాల వ్యాప్తంగా అమృత కాలం స్ఫూర్తితో భారత్ అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థగా మార్గమైన విజన్ ఇండియా @2047కు అనుగుణంగా దేశం నలుమూలలో జరుగుతున్న ఆవిష్కరణలను జాతీయ స్టార్టప్ అవార్డులు 2023 గుర్తించి, కొనియాడుతుంది.
ప్రతి వర్గం నుంచి గెలుపొందిన ప్రతి స్టార్టప్‌కు రూ. 10 లక్షల నగదు బహుమతిని డిపిఐఐటి అందిస్తుంది. అంతేకాకుండా, జాతీయ స్టార్టప్ అవార్డు 2023 విజేతలు, ఫైనలిస్టులకు పెట్టిబడుదారుల, ప్రభుత్వ నెట్‌వర్క్‌ల అందుబాటు, మార్గదర్శక కార్య్రమాలు, అంతర్జాతీయ మార్కెట్ల పరిచయం, కార్పొరేట్లు, యూనికార్న్‌లతో సంబంధాలు, వివిధ ఇతర విలువైన వనరులు సహా ప్రత్యేకమైన హ్యాండ్‌హోల్డింగ్ (మార్గదర్శనం, సహాయం) తోడ్పాటును అందిస్తారు.
భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను విప్లవీకరించిన దార్శనికుల అమూల్య తోడ్పాటును మూడు విజయవంతమైన ఎడిషన్ల ద్వారా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు పట్టి చూపాయి.
స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలోని ఎనేబ్లర్లను, అసాధారణమైన స్టార్టప్‌లను గుర్తించి, బహుమానం ఇచ్చే లక్ష్యంతో ఎన్ఎస్ఎ ప్రారంభమైంది. ఈ వ్యవస్థలు ఆవిష్కరణలను పోషించి, అపూర్వమైన ఉత్పత్తులను సృష్టించి, ప్రత్యక్ష సామాజిక ప్రభావాన్ని ప్రదర్శించడంలో సాధనంగా ఉన్నాయి.
ఆసక్తికలిగిన వారు అధికారిక జాతీయ స్టార్టప్ అవార్డుల వెబ్‌సైట్‌ను సందర్శించి, సవరించిన గడువు అయిన 15 జూన్ 2023 నాటికల్లా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
మరిన్ని వివరాల కోసం https://www.startupindia.gov.in/ను సందర్శించండి.
***
(Release ID: 1929027)
Visitor Counter : 173