ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటు యొక్క నూతన భవనం మనందరినీ గర్వం తో మరియుఅపేక్షలతో నింపివేయనుంది: ప్రధాన మంత్రి

Posted On: 28 MAY 2023 12:02PM by PIB Hyderabad

పార్లమెంటు యొక్క క్రొత్త భవనం మన అందరి ని గర్వం తో మరియు అంచనాల తో నింపివేయగలదు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ఒక శిలా ఫలకాన్ని స్వయం గా ఆవిష్కరించి పార్లమెంటు నూతన భవనాన్ని దేశ ప్రజల కు అంకితం చేశారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నేటి రోజు మన దేశ ప్రజలు అందరి కి మరపు రానటువంటి రోజు అని చెప్పాలి. పార్లమెంటు యొక్క నూతన భవనం మనందరి లోను గర్వాన్ని మరియు అపేక్షల ను నింపి వేసేస్తుంది. ఈ దివ్యమైనటువంటి మరియు భవ్యమైనటువంటి భవంతి ప్రజలు అందరి కి సశక్తీకరణతో పాటు దేశం యొక్క సమృద్ధి కి మరియు సామర్థ్యాని కి కొత్త గతి ని, ఇంకా శక్తి ని ప్రసాదిస్తుందన్న పూర్తి నమ్మకం నాలో ఉంది.’’

‘‘భారతదేశం పార్లమెంటు యొక్క నూతన భవనాన్ని ప్రారంభం అవడం తో, మన హృదయాలు మరియు మనస్సులు గర్వం తోను, ఆశ తోను మరియు సంకల్పాల తోను నిండిపోయి ఉన్నాయి.  ఈ ప్రతిష్ఠిత భవనం సశక్తీకరణ కు నిలయం గా ఉంటూ, కలల ను ప్రోది చేసి మరి వాటికి వాస్తవ రూపాన్ని కల్పించే స్థలం అగుగాక.  ఈ భవనం మన మహా దేశాన్ని ప్రగతి యొక్క సరిక్రొత్త శిఖరాల కు చేర్చుగాక.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1928371) Visitor Counter : 126