చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
కొత్త మైలురాయిని సాధించిన టెలి లా కార్యక్రమంః వ్యాజ్యానికి ముందు సలహాతో 40 లక్షల మంది లబ్ధిదారులకు సాధికారత
Posted On:
30 MAY 2023 2:02PM by PIB Hyderabad
చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలి-లా కార్యక్రమం దేశవ్యాప్తంగా 40 లక్షల మంది లబ్ధిదారులకు వ్యాజ్యానికి ముందు సలహాతో సాధికారతను అందించడం ద్వారా కొత్త మైలు రాయిని సాధించింది.
టెలి-లా గురించిః చేరుకోవడం సాధ్యం కాని వారిని చేరుకోవడం అన్నది వ్యాజ్యానికి ముందు దశలో న్యాయ సలహా, సంప్రదింపులు పొందడానికి ఒక ఇ-ఇంటర్ఫేస్ మెకానిజం ( మధ్యవర్తి ఏర్పాటు). ఇది పంచాయతీ స్థాయిలో గల కామన్ సర్వీస్ సెంటర్స్ (సిఎస్‌సిలు - సామాన్య సేవా కేంద్రాలు)లో అందుబాటులో ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్ / టెలిఫోనిక్ సౌకర్యాల ద్వారా న్యాయ సహాయం అవసరమైన అట్టడుగు వర్గాలను, పేదలను ప్యానెల్ లాయర్లతో అనుసంధానం చేస్తుంది. 2017లో ప్రారంభించిన టెలి-లా సేవ ప్రస్తుతం నేరుగా టెలి-లా మొబైల్ ఆప్ (ఆండ్రాయిడ్ & ఐఒఎస్)ల ద్వారా నేరుగా అందుబాటులో ఉంది.
***
(Release ID: 1928348)
Visitor Counter : 171