ప్రధాన మంత్రి కార్యాలయం

గువాహాటీ ని న్యూ జల్ పాయిగుడి తో కలిపే అసమ్ యొక్క తొలివందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక జెండా ను చూపెట్టిన ప్రధాన మంత్రి


క్రొత్త గా విద్యుతీకరణ జరిగిన సెక్శన్ లను మరియునూతనం గా నిర్మించిన  డిఇఎమ్ యు/ఎమ్ఇఎమ్ యు షెడ్డు ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు

‘‘ఈశాన్య ప్రాంతాల తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ పర్యటన కు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు కనెక్టివిటీ ని వృద్ధి చెందింప చేస్తుంది’’

‘‘ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించడం కోసం గడచిన 9 సంవత్సరాల లో అపూర్వమైనకార్యసాధనలు సాగాయి’’

‘‘పేద ప్రజలసంక్షేమాని కి మా ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఇచ్చింది’’

‘‘మౌలిక సదుపాయాలు ప్రతిఒక్కరి కోసం మరి అది ఎటువంటి వివక్ష కు తావు ఇవ్వదు; మౌలిక సదుపాయాల అభివృద్ధి అంటే అది సిసలైన సామాజిక న్యాయమూ, వాస్తవ మతాతీతవాదమూనుఅని చెప్పాలి’’

‘‘మౌలిక సదుపాయాలకల్పన పై వహించిన శ్రద్ధ తాలూకు అతి ప్రధాన లబ్ధిదారులు గా  దేశం లోని తూర్పు రాష్ట్రాలు మరియు ఈశాన్యప్రాంతం ఉన్నాయి’’

‘‘భారతీయ రేల్ వే హృదయాల ను, సమాజాల ను జత పరచేటటువంటి ఒక మాధ్యం గా మారింది;  అంతేకాదు, వేగాని కి తోడు ప్రజల కు అవకాశాల ను ఇవ్వడం లో కూడాను దానికి పాత్ర ఉంది’’ 

Posted On: 29 MAY 2023 1:16PM by PIB Hyderabad

అసమ్ లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక ఆకుపచ్చ జెండా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా చూపెట్టారు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ గువాహాటీ ని న్యూ జల్ పాయిగుడి తో కలుపుతుంది. మరి ఈ యాత్ర కు అయిదు గంటల ముప్పై నిమిషాలు పడుతుంది. ప్రధాన మంత్రి 182 రూట్ కిలో మీటర్ ల మేర కు నూతనం గా విద్యుదీకరణ జరిగిన సెక్శన్ లను కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు. అసమ్ లోని లుమ్ డింగ్ లో నూతనం గా నిర్మాణం జరిగిన డిఇఎమ్ యు/ఎమ్ఇఎమ్ యు షెడ్డు ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు ఈశాన్య ప్రాంతం లో కనెక్టివిటీ పరం గా ఒక ప్రధానమైనటువంటి రోజు ఎలాగంటే మూడు అభివృద్ధి పనులు కలిసికట్టు గా పూర్తి కావడం జరిగింది అన్నారు. వాటి లో ఒకటోది, ఈశాన్య ప్రాంతం తన తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ రోజు న అందుకొంటోంది. ఈ రైలు పశ్చిమ బంగాల్ ను జోడించేటటువంటి మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కూడాను. రెండోది ఏమిటి అంటే అసమ్ లో మరియు మేఘాలయ లో సుమారు 425 కిలో మీటర్ ల మేర రైలు మార్గాల కు విద్యుతీకరణ ను పూర్తి చేయడమైంది. ఇక, మూడోది అసమ్ లోని లుమ్ డింగ్ లో ఒక డిఇఎమ్ యు/ఎమ్ఇఎమ్ యు షెడ్డు ను ప్రారంభించడం జరిగింది అని ప్రధాన మంత్రి వివరించారు. ఈ మహత్తరమైనటువంటి సందర్భం లో ప్రధాన మంత్రి అసమ్, మేఘాలయ, ఇంకా పశ్చిమ బంగాల్ సహా యావత్తు ఈశాన్య ప్రాంతం యొక్క పౌరుల కు అభినందనల ను తెలియ జేశారు.

 

అసమ్ కు మరియు పశ్చిమ బంగాల్ కు మధ్య శతాబ్దాల నుండి ఉన్న బంధాల ను గువాహాటీ-న్యూ జల్ పాయిగుడి వందే భారత్ రైలు పటిష్ట పరుస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది ప్రయాణించడం లో సౌలభ్యాన్ని పెంచుతుంది; విద్యార్థుల కు అనేక ప్రయోజనాల ను అందిస్తుంది. పర్యటన మరియు వ్యాపారం.. ఈ రంగాల లో ఉత్పన్నం అయ్యే ఉద్యోగ అవకాశాల ను అధికం చేస్తుందని ఆయన వివరించారు. వందే భారత్ రైలు మాత కామాఖ్య ఆలయం, కాజీరంగ, మానస్ నేశనల్ పార్క్ మరియు పొడితర అభయారణ్యం లకు కనెక్టివిటీ ని అందిస్తుంది. ఇంకా, ఇది శిలాంగ్, మేఘాలయ లోని చిరపుంజి మరియు తవాంగ్ లతో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ లలో ప్రయాణాలను మరియు పర్యటన ను వృద్ధి చెందింప చేస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఎన్ డిఎ ప్రభుత్వం అధికారం లో 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ కాలం లో దేశం అనేక కార్యసాధనల కు సాక్షి గా నిలచింది; ఒక న్యూ ఇండియాఆవిష్కారం దిశ లో మునుపు ఎరుగని విధం గా అభివృద్ధి ని చూసింది అన్నారు. తాజా గా ప్రారంభం అయిన స్వాతంత్య్ర భారతదేశం యొక్క భవ్య దివ్య పార్లమెంటు భవనాన్ని గురించి ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, అది భారతదేశం యొక్క వేయి సంవత్సరాల నాటి ప్రజాస్వామ్య చరిత్ర ను భారతదేశం యొక్క సమృద్ధి యుక్త భావి ప్రజాస్వామ్యం తో జోడిస్తుంది అని పేర్కొన్నారు. ఇదివరకటి ప్రభుత్వాల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, 2014 వ సంవత్సరాని కంటే పూర్వపు కాలం లో జరిగిన కుంభకోణాలు అన్ని రికార్డుల ను బద్దలు చేశాయి. అప్పట్లో గరిష్ఠ ప్రభావాన్ని పేదలు మరియు అభివృద్ధి లో వెనుకబడిపోయిన రాష్ట్రాలు అనుభవించవలసి వచ్చింది అన్నారు. ‘‘మా ప్రభుత్వం పేదల సంక్షేమాని కి ప్రాధాన్యాన్ని కట్టబెట్టింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో ఆయన ఇళ్ళు, టాయిలెట్ లు, నల్లా నీటి కనెక్శన్ లు, విద్యుత్తు, గ్యాస్ సరఫరా కు గొట్టపు మార్గాల ఏర్పాటు, ఎఐఐఎమ్ఎస్ ను అభివృద్ధి పరచడం, మౌలిక సదుపాయాల కల్పన పరంగా రహదారుల ను, రైలు మార్గాల ను, వాయు మార్గాల ను, జల మార్గాల ను, నౌకాశ్రయాల ను అభివృద్ధి పరచడం, అలాగే మొబైల్ కనెక్టివిటీ ని గురించిన ఉదాహరణల ను పేర్కొన్నారు. ఈ లక్ష్యాల ను సాధించడం కోసం ప్రభుత్వం పూర్తి శక్తి తో పాటుపడింది అని ఆయన నొక్కి చెప్పారు. మౌలిక సదుపాయాలు అనేవి ప్రజల జీవితాల ను సులభతరం చేస్తాయి, ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తాయి, మరి అలాగే అభివృద్ధి కి ఒక ప్రాతిపదిక గా మారుతాయి అన్నారు. భారతదేశం లో మౌలిక సదుపాయాల కల్పన తాలూకు వేగాన్ని గురించి ప్రపంచం అంతటా చర్చ జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన పేదల ను, వెనుకబడిన వర్గాల ను, దళితుల ను, ఆదివాసీల ను, ఇంకా సమాజం లోని నిరాదరణ కు గురి అయిన ఇతర వర్గాల వారి ని బలపరచి సాధికారిత ను కల్పిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మౌలిక సదుపాయాలు అనేవి ప్రతి ఒక్కరి కోసం, మరి అది ఎటువంటి వివక్ష కు తావు ఇవ్వదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విధమైన అభివృద్ధి సామాజిక న్యాయం, ఇంకా మతాతీత వాదం ల తాలూకు శుద్ధమైన రూపం గా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

మౌలిక సదుపాయాల కల్పన కు ఇచ్చిన ప్రోత్సాహం తాలూకు అతి పెద్ద లబ్ధిదారులు గా భారతదేం లోని తూర్పు రాష్ట్రాలు మరియు ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇంతకు ముందు, ఈశాన్య ప్రాంత ప్రజానీకం దశాబ్దాల తరబడి కనీస సౌకర్యాల కైనా నోచుకోలేదు అని ఆయన అన్నారు. విద్యుత్తు, టెలిఫోన్, లేదా చక్కటి రైలు, రోడ్డు, వాయు సంధానం.. ఇవేవీ 9 సంవత్సరాల క్రితం లేని అటువంటి గ్రామాలు మరియు కుటుంబాలు చాలా వరకు ఈశాన్య ప్రాంతాల కు చెందినవే అని ఆయన అన్నారు.

 

ఈ ప్రాంతం లో రైలు కనెక్టివిటీ ని గురించి ఆయన ప్రస్తావించి, అది సేవా భావన తో జరిగిన పని కి ఒక ఉదాహరణ గా ఉందన్నారు. ఈశాన్య ప్రాంతం లో రైలు కనెక్టివిటీ అనేది ప్రభుత్వం యొక్క వేగాని కి, విస్తృతి కి మరియు అభిలాష కు ఒక నిదర్శనం గా ఉంది అని ఆయన అన్నారు. వలస పాలన కాలం లో సైతం అసమ్, త్రిపుర మరియు బంగాల్ లు రైలు మార్గాల తో జోడింపబడి ఉన్నాయి, అయితే వాటి ఉద్దేశ్యం ఆ ప్రాంతం లో ప్రాకృతిక వనరుల ను దోచుకోవాలనేదే అని ప్రధాన మంత్రి అన్నారు. ఏమైనా, స్వాతంత్య్రం తరువాతి కాలం లోనూ ఆ ప్రాంతం లో రైలు మార్గాల విస్తరణ ను అలక్ష్యం చేయడమైంది. మరి చివరకు ఆ బాధ్యత 2014 వ సంవత్సరం తరువాత నుండి వర్తమాన ప్రభుత్వం భుజాల పైన పడింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఈశాన్య రాష్ట్రాల ప్రజల సున్నితత్వానికి, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని శ్రీ మోదీ చెప్పారు. ఈ మార్పు విస్తృతంగా కనిపిస్తోందని చెప్పారు.

2014కు ముందు ఈశాన్య రాష్ట్రాల సగటు రైల్వే బడ్జెట్ రూ.2500 కోట్లు కాగా, ఈ ఏడాది నాలుగు రెట్లు పెరిగి రూ.10 వేల కోట్లకు చేరుకుందని తెలిపారు. ఇప్పుడు మణిపూర్, మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం రాజధానులను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చేస్తున్నామని, త్వరలోనే ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని రాజధాని నగరాలను బ్రాడ్ గేజ్ నెట్వర్క్ తో అనుసంధానం చేయబోతున్నామని, ఈ ప్రాజెక్టుల కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. "ప్రభుత్వ అభివృద్ధి పనుల పరిమాణం , వేగం అపూర్వమైనది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు, ఈశాన్యంలో మునుపటి కంటే మూడు రెట్లు వేగంతో కొత్త రైలు మార్గాల నిర్మాణం జరుగుతోందని, రైలు మార్గాల డబ్లింగ్ మునుపటి కంటే 9 రెట్లు వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

రైలు మార్గాల డబ్లింగ్ పనులు గత తొమ్మిదేళ్లలో ప్రారంభమయ్యాయని, వాటి పూర్తి కి ప్రభుత్వం శరవేగంగా పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

ఈశాన్యంలోని అనేక మారుమూల ప్రాంతాలను రైల్వేలతో అనుసంధానం చేయడానికి దారితీసిన అభివృద్ధి వేగాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత నాగాలాండ్ కు రెండో రైల్వే స్టేషన్ లభించిందని తెలిపారు.

ఇప్పుడు వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు, తేజస్ ఎక్స్ ప్రెస్ లు ఒకప్పుడు తక్కువ వేగంతో నడిచే నేరో గేజ్ లైన్ ఉన్న మార్గంలోనే ఇప్పుడు నడుస్తున్నాయని ప్రధాని చెప్పారు. పర్యాటకులకు ఆకర్షణగా మారిన భారతీయ రైల్వేకు చెందిన విస్టా డోమ్ కోచ్ లను కూడా ఆయన ప్రస్తావించారు.

 

గువాహటి రైల్వే స్టేషన్ లో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ టీ స్టాల్ ను గురించి ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి "భారతీయ రైల్వే హృదయాలను, సమాజాలను , అవకాశాలను ప్రజలతో వేగంగా అనుసంధానించే మాధ్యమంగా మారింది" అని వ్యాఖ్యానించారు. ఇది సమాజం నుంచి మంచి నడవడికను ఆశించే వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. 'వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్' పథకం కింద ఈశాన్య రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఇవి స్థానిక ఉత్పత్తుల (వోకల్ ఫర్ లోకల్ ) కు ప్రాధాన్యమిస్తాయని, తద్వారా స్థానిక చేతి వృత్తుల వారు, కళాకారులు, హస్తకళాకారులకు కొత్త మార్కెట్ లభిస్తుందని ప్రధాని వివరించారు.

 

ఈశాన్య రాష్ట్రాల్లోని వందలాది స్టేషన్లలో వై-ఫై సౌకర్యాలను ఆయన ఉదహరించారు. ఈ సున్నితత్వం, వేగం కలయికతోనే ఈశాన్య రాష్ట్రాలు ప్రగతి పథంలో ముందుకు సాగి అభివృద్ధి చెందిన భారత్ కు బాటలు వేస్తాయని అన్నారు.

 

నేపథ్యం

 

అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఈ ప్రాంత ప్రజలకు వేగంతో, సౌకర్యవంతంగా ప్రయాణించే మార్గాలను అందిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది. పెంచుతుంది.

గౌహతిని న్యూ జల్పాయిగురితో కలిపే ఈ రైలు రెండు ప్రదేశాలను కలిపే ప్రస్తుత వేగవంతమైన రైలుతో పోలిస్తే సుమారు ఒక గంట ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుంది. వందే భారత్ రైలు 5 గంటల 30 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది, ప్రస్తుత వేగవంతమైన రైలు అదే ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతోంది.

 

ప్ర ధాన మంత్రి 182 కిలోమీటర్ల కొత్తగా విద్యుదీకరించిన రైలు మార్గాలను అంకితం చేశారు. ఇది అధిక వేగంతో నడిచే రైళ్లతో కాలుష్య రహిత రవాణాను అందించడానికి , రైళ్ల ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎలక్ట్రిక్ ట్రాక్షన్ పై నడిచే రైళ్లు మేఘాలయలోకి ప్రవేశించడానికి కూడా ఇది దోహద పడుతుంది.

 

అస్సాంలోని లుండింగ్ లో నూతనంగా నిర్మించిన డెము/మెము షెడ్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న డెము ర్యాక్ లను నిర్వహించడానికి ఈ కొత్త సదుపాయం సహాయపడుతుంది, ఇది మెరుగైన సాధ్యాసాధ్య నిర్వహణకు దారితీస్తుంది.

*****

DS/TS



(Release ID: 1928114) Visitor Counter : 172