సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్ర‌భుత్వం 9 సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌డంపై జాతీయ కాంక్లేవ్ ముగింపు స‌మావేశానికి ముఖ్య అతిధిగా హాజ‌రై అధ్య‌క్ష‌త వ‌హించిన ఆర్థిక మంత్రి


త‌మ భ‌విష్య‌త్తుపై యువ‌త వైఖ‌రి మెరుగుప‌డ‌డానికి కేవ‌లం స‌మ‌ర్థ నాయ‌క‌త్వం, మంచి విధాన నిర్ణ‌యాలే కార‌ణం : కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల శాఖ మంత్రి

పిఎం గ‌తిశ‌క్తి “గ‌తి”, “ప్ర‌గ‌తి” రెండింటికీ హామీ ఇస్తూ భార‌త‌దేశానికి పునాది వంటి మౌలిక వ‌స‌తులు అందిస్తోంది : శ్రీ అనురాగ్ ఠాకూర్

ఈ ఏడాది ఖేలో ఇండియా క్రీడ‌ల్లో 25 కొత్త జాతీయ రికార్డులు న‌మోద‌య్యాయి. వాటిలో 21 రికార్డుల‌ను భార‌త‌దేశ పుత్రిక‌లే న‌మోదు చేశారు : శ్రీ అనురాగ్ ఠాకూర్‌

గ‌త 9 సంవ‌త్స‌రాల్లో స్పంద‌నాత్మ‌క ప్ర‌భుత్వానికి ఒక ఉదాహ‌ర‌ణగా నిల‌వ‌డం ద్వారా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణిని మార్చింది : ఆర్థిక మంత్రి శ్రీమ‌తి నిర్మ‌లా సీతారామ‌న్‌

జీఎస్ టి, కాలం చెల్లిపోయిన చ‌ట్టాల ర‌ద్దు, దివాలా కోడ్‌, మ‌హిళా సాధికార‌త‌, స్టార్ట‌ప్ లు, కోవిడ్‌-19 కాలంలో చేప‌ట్టిన ఇత‌ర సంస్క‌ర‌ణ‌ల గురించి ప్ర‌సంగించిన ఆర్థిక మంత్రి

Posted On: 27 MAY 2023 9:24PM by PIB Hyderabad

కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయిన సందర్భగా విజ్ఞాన్ భవన్  లోని ప్లీనరీ హాలులో జరిగిన జాతీయ కాంక్లేవ్  ముగింపు సమావేశానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం ఉదయం కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్  ఈ గోష్ఠిని ప్రారంభించారు. మూడు థీమ్  లపై జరిగిన  కార్యక్రమంలో విభిన్న రంగాలకు చెందిన ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలు ప్రకటించడంతో పాటు ‘‘యువశక్తి’’తో ముఖాముఖి సంభాషించారు.

ముగింపు సమావేశానికి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్  ఠాకూర్, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎల్.మురుగన్, ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ప్రసార భారతి  సిఇఓ శ్రీ గౌరవ్  ద్వివేది హాజరయ్యారు.

ముఖ్య అతిథిని, ఇతర ప్రముఖులకు శ్రీ అనురాగ్ ఠాకూర్ స్వాగతం పలుకుతూ గత దశాబ్ది కాలంలో భారతదేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వం, ప్రభుత్వం తీసుకున్న మంచి విధాన నిర్ణయాల కారణంగానే యువతలో తమ భవిష్యత్తుపై విశ్వాసం మెరుగుపడిందన్నారు. 9 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లను ఆయన అందరి దృష్టికి తెచ్చారు. ‘‘9 సంవత్సరాల అనంతరం నేడు భారతదేశం బలవంతంగా లాగుతున్న ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం కాదు. ప్రపంచంలో వేగవంతంగా వృద్ధిని  సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. బ్రిటిష్  ఆర్థిక వ్యవస్థను కూడా పక్కకు నెట్టి ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది’’ అన్నారు.

ప్రధానమంత్రి నిర్దేశించిన ‘జాన్  హైతో జహాన్  హై’, ‘జాన్ భీ, జహాన్ భీ’ మంత్రంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారిని ఎంత దీటుగా ఎదుర్కొన్నది మంత్రి గుర్తు చేశారు. ‘‘శాస్ర్తవేత్తలు కోవిడ్  వ్యాక్సిన్ల అభివృద్ధిలో తల మునకలయ్యారు. ఒకటి కాదు రెండు వ్యాక్సిన్లు అభివృద్ధి చేశారు. 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఉచితంగా ప్రజలకు అందించారు’’ అని చెప్పారు.

ప్రత్యేకించి కోవిడ్-19 క్లిష్ట కాలంలో ఆహార భద్రత అందించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ 28 నెలల పాటు 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించారని, ఇందుకోసం ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. మహమ్మారి కాలంలో వ్యాపారాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు అత్యవసర రుణ హామీ పథకం వంటి ఎన్నో  పథకాలు ప్రారంభించిందని తెలిపారు. వ్యాపార వర్గాల కోసం ప్రకటించిన ఈసీఎల్ జీఎస్ పథకం కారణంగా వ్యాపారాలు బతికి బట్టకట్టడమే కాదు, నేడు మంచి వెలుగు వెలుగుతున్నాయి అన్నారు. స్టార్టప్  వ్యవస్థకు ఉత్తేజం కలిగించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా నేడు భారత్ 100 యునికార్న్  లు  సహా మొత్తం 1 లక్ష స్టార్టప్  లతో ప్రపంచంలోనే మూడో పెద్ద స్టార్టప్  వ్యవస్థ గల దేశంగా నిలిచిందని తెలిపారు.

గత 9 సంవత్సరాలుగా ప్రభుత్వం సాధించిన రికార్డు విజయాల గురించి కూడా శ్రీ అనురాగ్  ఠాకూర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీ ద్వారా పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత ధోరణిని తీసుకురావడంతో పాటు 3.5 కోట్ల మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్లు, 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించిందని, 11.7 కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా మంచినీటి కనెక్షన్లు, 9.6 కోట్ల మంది మహిళలకు ఉజ్వల గ్యాస్  కనెక్షన్లు, 100 కోట్లకు పైబడిన ఎల్ఇడి బల్బులు అందించిందని తెలిపారు. గత 9 సంవత్సరాల కాలంలో రోడ్డు నిర్మాణం వేగం నాలుగు రెట్లయిందని, అన్ని గ్రామాల విద్యుదీకరణ పూర్తయిందని చెప్పారు. పిఎం గతిశక్తి పథకం ‘గతి’ని, ‘ప్రగతి’ని హామీ ఇవ్వడం ద్వారా పునాది వంటి కీలక మౌలిక వసతులు అందించిందన్నారు.

గత 9 సంవత్సరాల కాలంలో క్రీడల బడ్జెట్  మూడు రెట్లు పెరిగి రూ.864 కోట్ల నుంచి రూ.2700 కోట్లకు చేరిందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియా, యువజన  క్రీడోత్సవాలు, విశ్వవిద్యాలయ క్రీడోత్సవాలు, శీతాకాల క్రీడోత్సవాలు నిర్వహించారని, సుమారు 15,000 మంది క్రీడాకారులు ఈ క్రీడోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన ఖేలో ఇండియా క్రీడల్లో 25 కొత్త జాతీయ రికార్డులు నెలకొల్పగా 21 రికార్డులను భారత  పుత్రికలే నెలకొల్పారని చెప్పారు.

భారత డిజిటల్  చెల్లింపుల మౌలిక వసతుల శక్తి గురించి తెలియచేస్తూ దాన్ని గూగుల్  సిఇఓ సుందర్  పిచాయ్  తో పాటు ప్రపంచం యావత్తు ప్రశంసించిదని తెలిపారు. డిజిటల్  మౌలిక వసతుల శక్తి కారణంగానే 21 కోట్ల మంది మహిళలకు బ్యాంకు ఖాతాల్లోకి రూ.31,000 కోట్లు బదిలీ అయిందని చెప్పారు.

‘‘ప్రభుత్వం అందించిన 3.5 కోట్ల పక్కా ఇళ్లలో 75 శాతం మహిళల పేరు మీదనే రిజిస్టర్  అయ్యాయి’’ అన్నారు. హవాయి చెప్పులతో తిరిగే సగటు ప్రజలకు కూడా హవాయి జహాజ్  ప్రయాణ యోగ్యత ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. రోడ్ల నిర్మాణంలో వేగం పెంచడం వల్ల వివిధ నగరాల మధ్య ప్రయాణ కాలం గణనీయంగా తగ్గిందని చెప్పారు.

ప్రపంచం భారతదేశాన్ని ఆశావహంగా వీక్షిస్తున్నదంటూ ప్రభుత్వం చేసిన కృషి కారణంగా 2047 నాటికి విక్సిత్ (అభివృద్ధి చెందిన) భారత్  అయ్యే లక్ష్యం వైపు వేగంగా  సాగుతున్నదన్నారు.

ప్రభుత్వ ధ్యేయం సేవ,  సుహాసన్, గరీబ్  కల్యాణ్ అన్న విషయం ప్రముఖంగా  ప్రస్తావిస్తూ ఆర్థికమంత్రి తన  ప్రసంగం ప్రారంభించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం గురించి తెలియచేస్తూ ఆయన కేవలం కఠిన శ్రమ ద్వారానే ప్రజల విశ్వాసం, నమ్మకం సాధించారని చెప్పారు. ప్రజల్లో ఆయన పొందిన ప్రాచుర్యమే ఇందుకు నిదర్శనమని తెలియచేస్తూ ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచనా ధోరణి మారిందని ఆమె అన్నారు.

‘‘మనం కోవిడ్ పేరుతో ఎలాంటి పన్నులు విధించవద్దు. వ్యాక్సిన్ల నుంచి ఆహార ధాన్యాల పంపిణీ వరకు  దేనికీ ప్రజల నుంచి పన్నుల రూపంలో ధనం వసూలు చేయవద్దు’’ అని ప్రధానమంత్రి తనకు సలహా ఇచ్చారని ప్రధానమంత్రితో జరిగిన  సమావేశం తీర్మానాల గురించి తెలియచేస్తూ ఆమె చెప్పారు. అంతే కాదు, కోవిడ్-19 మహమ్మారి తర్వాత కూడా మేం పన్నులు పెంచలేదు అని ఆమె అన్నారు.

సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ కాలం చెల్లిపోయిన చట్టాలు పౌరులను వేధించే  సాధనాలు గాని, అవినీతికి గాని కాకూడదని తెలియచేస్తూ అలాంటి 1500 చట్టాలను రద్దు చేయడానికి ప్రధానమంత్రి తమను  ప్రోత్సహించారని శ్రీమతి సీతారామన్ తెలిపారు.

వస్తు సేవల పన్ను (జిఎస్ టి) పేరిట ప్రవేశపెట్టిన ఒక జాతి, ఒకే పన్ను ఉదాహరణ ప్రస్తావిస్తూ అన్ని రాష్ర్ర్టాలను విశ్వాసంలోకి తీసుకుని ప్రభుత్వం శక్తివంతమైన చట్టం రూపొందించిందని; అలాగే సగటు ప్రజలు, వ్యాపార వర్గాల ప్రజల జీవనం సరళం చేసేందుకు శక్తివంతమైన జిఎస్  టి వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఆమె వివరించారు.

మహిళల భద్రత గురించి  ప్రస్తావిస్తూ ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ సందేశం సందర్భంగా ప్రధానమంత్రి మహిళల భద్రత అంశం ప్రకటించారని గుర్తు చేశారు. ‘‘శానిటరీ ప్యాడ్  లు అందుబాటులో లేని కారణంగా   అనారోగ్యకరమైన విధానాలు అనుసరిస్తున్న ఎందరో బాలికల గురించి మాత్రం మాట్లాడడమే కాదు, కేవలం రూపాయి ధరకే వారికి అవి అందుబాటులోకి వచ్చేలా ప్రధానమంత్రి చేశారు. ఇవి ఆలోచనా ధోరణి మార్పు కోణంలో చిన్న అంశాలేమీ కాదు’’ అని ఆర్థికమంత్రి అన్నారు.

స్టార్టప్  వ్యవస్థ గురించి కూడా ప్రస్తావిస్తూ గతంలో ఒక వ్యాపారం గౌరవనీయంగా మూసి వేయడం అంటే తీవ్ర వ్యధగా ఉండేది, కాని ఇన్ సాల్వెన్సీ, దివాలా కోడ్ (ఐబిసి) ప్రవేశపెట్టడంతో ఎందరో యువకులు వ్యాపారాలు ప్రారంభించేందుకు ముందుకు రావడమే కాదు, వైఫల్యం ఎదురైతే వ్యాపారాలు గౌరవంగా మూసివేసుకోగలుగుతున్నారని చెప్పారు.

సాయుధ దళాల్లో కూడా ఎంతో మార్పు వచ్చిందని శ్రీమతి సీతారామన్  అన్నారు. గతంలో సైన్యంలోని పురుషులకు మాత్రమే శాశ్వత కమిషన్ ఉండేది...కాని ప్రధానమంత్రి ఆదేశాలతో రక్షణ రంగాన్ని మహిళల ప్రవేశానికి కూడా తెరవడం జరిగింది. తద్వారా సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, తీర గస్తీదళాలకు కూడా శాశ్వత కమిషన్  కావాలనే ఆకాంక్షలుసాకారం అయ్యాయి అని ఆమె తెలిపారు.

ఈ ఉదాహరణలన్నీ దేశంలో వచ్చిన ప్రధాన మార్పును తెలియచేస్తున్నాయి. ‘‘ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తేవడానికి నాయకత్వం విభిన్న వర్గాలతో కలిసి  పని చేసినప్పుడే ఈ తరహా మార్పు సాధ్యం. భారతదేశం అత్యంత సంక్లిష్టమైన దేశం. విభిన్న స్థాయిల్లో, విభిన్న అంచెల్లో నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది’’ అని శ్రీమతి సీతారామన్ తెలిపారు.

ఉక్రెయిన్, యెమెన్, సూడాన్  దేశాల నుంచి విద్యార్థుల తరలింపు ఉదాహరణ ప్రస్తావిస్తూ ఈ ప్రభుత్వం దేశం వెలుపల ఉన్న వారి ఆలోచనా ధోరణి కూడా మార్చుతోంది. భారతదేశ ప్రయోజనాలే ప్రథమం లక్ష్యంతో కట్టుబాటు, అంకిత భావం గల ప్రభుత్వం అందించింది అని శ్రీమతి సీతారామన్ తెలిపారు. ‘‘ప్రధానమంత్రి ప్రతీ ఒక్క పౌరునికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతీ ఒక్క పౌరుని మాట వింటున్నారు. ప్రతీ ఒక్క  పౌరునికి స్పందిస్తున్నారు’’ అని ఈ ఉదాహరణలు తెలియచేస్తున్నాయని ఆర్థికమంత్రి అన్నారు. 

 

***



(Release ID: 1928055) Visitor Counter : 145