ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిడ్నీలో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి

Posted On: 24 MAY 2023 3:28PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సిడ్నీలో అగ్రశ్రేణి ఆస్ట్రేలియన్ కంపెనీల సిఇఒలతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు.

 

స్టీల్, బ్యాంకింగ్, ఎనర్జీ, మైనింగ్, ఐటీ సహా వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ కంపెనీల సి ఇ ఒ లు హాజరయ్యారు. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు కూడా రౌండ్ టేబుల్ లో పాల్గొన్నారు.

 

సులభ వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కోసం, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన అనేక ఆర్థిక సంస్కరణలు, కార్యక్రమాలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. వీటిలో, మౌలిక సదుపాయాల కనెక్టివిటీ ప్రాజెక్టులకు సమీకృత విధానం కోసం మిషన్ గతి శక్తి; జన్ ధన్-ఆధార్-మొబైల్ ట్రినిటీ; జాతీయ విద్యావిధానం; హైడ్రోజన్ మిషన్ 2050; పీఎల్ఐ పథకం; అంతరిక్షం, జియోస్పేషియల్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను తెరవడం; వైద్య పరికరాల తయారీలో కొత్త విధానం; ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం మొదలైనవి

ఉన్నాయి.

 

డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఫిన్ టెక్, టెలికాం, సెమీకండక్టర్స్, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్ సహా పునరుత్పాదక ఇంధనం, విద్య, ఫార్మా,హెల్త్కేర్,మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్, మైనింగ్, కీలకమైన ఖనిజాలు, టెక్స్ టైల్ , అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి మౌలిక రంగాల్లో భారత్ అందిస్తున్న పెట్టుబడుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సి ఇ ఒ లకు ప్రధాని పిలుపునిచ్చారు.

 

భారతీయ సహచర సంస్థలతో పరస్పర ప్రయోజన  భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని ప్రధాన మంత్రి సి ఇ ఒ  లను ప్రోత్సహించారు.

 

రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ క్రింది సి ఇ ఒ  లు పాల్గొన్నారు.

 

 

వరుస నెం.

కంపెనీ

ఎగ్జిక్యూటివ్

1.

కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా

మిస్టర్ మాట్ కోమిన్, ప్రెసిడెంట్ , సి ఇ ఒ

2.

రియో టింటో

కెల్లీ పార్కర్, సి ఇ ఒ

3.

నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్

ఫిలిప్ క్రానికన్, ఛైర్మన్ , నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

4.

ఆస్ట్రేలియన్ ఇండస్ట్రీ బ్యాంక్

ఇన్నెస్ విల్లోక్స్, సి ఇ ఒ

5.

బి హెచ్ పి

శ్రీమతి జెరాల్డిన్ స్లాటెరీ, ప్రెసిడెంట్,ఆస్ట్రేలియా

6.

అట్లాస్సియన్

స్కాట్ ఫర్ఖర్, కో-సి ఇ ఒ, కో ఫౌండర్

7.

యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ

ప్రొఫెసర్ మార్క్ స్కాట్ ఎఓ, వైస్ ఛాన్సలర్ అండ్ ప్రెసిడెంట్

8.

ఒరికా

సంజీవ్ గాంధీ, మేనేజింగ్ డైరెక్టర్ , సి ఇ ఒ

9.

కొచ్లియార్

డిగ్ హోవిట్, ఛైర్

10.

బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా

జెన్నిఫర్ వెస్టాకాట్, సి ఇ ఒ

11.

వైస్ టెక్

రిచర్డ్ వైట్, సి ఇ ఒ అండ్ ఫౌండర్

12.

ఎయిర్ ట్రంక్

రాబిన్ ఖుదా, వ్యవస్థాపకుడు , సి ఇ ఒ

13.

ఎంటురా

టామీ చు, మేనేజింగ్ డైరెక్టర్

14.

క్వింటిస్ శాండిల్ వుడ్

రిచర్డ్ హెన్ఫ్రీ, సి ఇ ఒ

15.

యు ఎన్ ఎస్ డబ్ల్యూ

ప్రొఫెసర్ అటిలా బ్రంగ్స్, వైస్ ఛాన్సలర్,  సిఇఒ

16.

రీఛార్జ్ ఇండస్ట్రీస్

రాబర్ట్ ఫిట్జ్ ప్యాట్రిక్, సి ఇ ఒ

17.

యూనివర్శిటీస్ ఆస్ట్రేలియా

కాట్రియోనా జాక్సన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్

18.

సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా-ఇండియా రిలేషన్స్

స్వాతి దవే, చైర్ పర్సన్, అడ్వైజరీ బోర్డు

19.

నవితాస్ గ్రూప్

స్కాట్ జోన్స్, సి ఇ ఒ

 

********


(Release ID: 1927143) Visitor Counter : 140