ప్రధాన మంత్రి కార్యాలయం

బ్రెజిల్ అధ్యక్షునితో భారత ప్రధానమంత్రి సమావేశం

Posted On: 21 MAY 2023 9:29AM by PIB Hyderabad

హిరోషిమాలో  జి7 దేశాల శిఖరాగ్ర సభ వేదిక వద్ద  ఆదివారం బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ ఇనాకియో లులా డా సిల్వాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.  

ఇద్దరు నేతల మధ్య ఇది మొదటి సమావేశం.   రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 వసంతాలు పూర్తయిన విషయాన్ని ఇద్దరు నాయకులు తమ చర్చలలో ప్రస్తావించారు.  

రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షిస్తూ దానిని మరింత వృద్ధి చేయడానికి గల మార్గాలను గురించి చర్చించారు.   ముఖ్యంగా రక్షణ ఉత్పత్తి, వాణిజ్యం, ఔషధాలు, వ్యవసాయం,  పాడి పరిశ్రమ & పశుగణాభివృధి మరియు జీవ ఇంధనాలు & నిర్మల ఇంధనం రంగాలలో భాగస్వామ్యం పెంపొందాలని అభిప్రాయపడ్డారు.  రెండు దేశాలకు చెందిన వ్యాపార ప్రముఖుల ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు ఆవశ్యకతను ఇరువురు నేతలు ఉద్ఘాటించారు.  

 ప్రాంతీయ పరిణామాలపై నాయకులు తమ అభిప్రాయాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.  బహుళ వేదికలపై సహకారం మరింత కొనసాగడం,  దానికి గల ప్రాముఖ్యతను గట్టిగా నొక్కి చెప్పారు.  బహుముఖ సంస్థల సంస్కరణ జరపాల్సిన ఆవశ్యకత చాలా కాలంగా ఉందని అన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే జి-20 శిఖరాగ్ర సభలో పాల్గొనడానికి అధ్యక్షుడు లులా ఇండియా వస్తారని ఆశిస్తున్నట్లు, తన రాకకై ఎదురుచూస్తున్నట్లు  ప్రధానమంత్రి తెలిపారు.  



 

*****
 



(Release ID: 1926128) Visitor Counter : 140