ప్రధాన మంత్రి కార్యాలయం

క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ వ్యాఖ్యల తెలుగు అనువాదం

Posted On: 21 MAY 2023 1:30PM by PIB Hyderabad

యువర్ ఎక్సలెన్సీ ,

ప్రధాన మంత్రి అల్బన్సే, ప్రధాన మంత్రి కిషిడా, అధ్యక్షుడు బైడెన్..

ఈ రోజు నా స్నేహితులతో కలిసి ఈ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకు భరోసా కల్పించడానికి క్వాడ్ గ్రూప్ ఒక ముఖ్యమైన వేదికగా స్థిరపడింది. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వాణిజ్యం, ఆవిష్కరణలు, వృద్ధికి చోదకశక్తి అనడంలో సందేహం లేదు. ఇండో-పసిఫిక్ భద్రత, విజయం ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికి చాలా ముఖ్యం. నిర్మాణాత్మక ఎజెండాతో, భాగస్వామ్య ప్రజాస్వామిక విలువల ఆధారంగా ముందుకు సాగుతున్నాం.

స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత ఇండో-పసిఫిక్ దార్శనికతకు ఆచరణాత్మక కోణాలను ఇస్తున్నాం. వాతావరణ చర్యలు, విపత్తు నిర్వహణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, విశ్వసనీయ సరఫరా గొలుసులు, ఆరోగ్య భద్రత, సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం వంటి రంగాల్లో సానుకూల సహకారం పెరుగుతోంది.

పలు దేశాలు, గ్రూపులు తమ ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని, దార్శనికతను ప్రకటిస్తున్నాయి. ఈ రోజు జరిగే మన  సమావేశం, ఈ మొత్తం ప్రాంత సమ్మిళిత, ప్రజా కేంద్రీకృత అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది.

ప్రపంచ శ్రేయస్సు, మానవ సంక్షేమం, శాంతి, సౌభాగ్యం  కోసం క్వాడ్ నిరంతరం పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ సమ్మిట్ కు విజయవంతంగా అధ్యక్షత వహించినందుకు ప్రధాన మంత్రి అల్బనీస్ ను నేను అభినందిస్తున్నాను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 2024లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ను భారత్ లో నిర్వహించబోతున్నందుకు  సంతోషంగా ఉంది.

ధన్యవాదాలు

డిస్ క్లెయిమర్  -: ఇది ప్రధాని ప్రకటనకు వ్యాఖ్యలకు సుమారు అనువాదం. ప్రధానమంత్రి అసలు ప్రకటన హిందీలో ఇచ్చారు.

 

*****

 



(Release ID: 1926124) Visitor Counter : 160