ప్రధాన మంత్రి కార్యాలయం

జపాన్ ప్రధానమంత్రిని కలుసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 20 MAY 2023 8:16AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2023 మే 20 న హిరోషిమాలో జరుగుతున్న జి–7 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా,
జపాన్ ప్రధానమంత్రి హిజ్ ఎక్సలెన్సి, ఫుమియో కిషిడతో  ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
జపాన్ ప్రధానమంత్రిని , భారత ప్రధానమంత్రి కలుసుకోవడం 2023లో ఇది రెండవసారి. ఈ ఏడాది మార్చిలో జపాన్ ప్రధానమంత్రి కిషిడ భారత్ సందర్శించినపుడు కూడా ప్రధానమంత్రి ఆయనను కలుసుకున్నారు.
2023 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , కిషడకు బహుకరించిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటించినందుకు ఆయనకు ప్రధానమంత్రి కృతజ్ఙతలు తెలిపారు.
భారత పార్లమెంటు ప్రతి ఏడాది హిరోషిమా దినాన్నిగుర్తు చేసుకుంటుందని, ఈ సందర్బంగా జపాన్ దౌత్యవేత్తలు  హాజరౌతుంటారని ప్రధానమంత్రి ఆ జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
ఇరువురు నాయకులు, తామా నాయకత్వం వహిస్తునన జి 20, జి 7 అధ్యక్షతల కృషిని సమ్మిళితం చేసే మార్గాల గురించి చర్చించారు.
గ్లోబల్ సౌత్ ఆందోళనలను, ప్రాధాన్యతలను ప్రముఖంగా  ప్రస్తావించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
ఇరువురు నాయకులు సమకాలీన ప్రాంతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండో– పసిఫిక్
సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయే అంశాన్ని కూడా వారు చర్చించారు.

ద్వైపాక్షిక ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం గురించిన మార్గాలను మరింత బలోపేతం చేయడం గురించి
ఇరువురు నాయకులు చర్చించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పర్యావరణానికి అనుగుణమైన జీవనవిధానం(ఎల్.ఐ.ఎఫ్.ఇ), హరిత హైడ్రోజన్,
అత్యున్నత సాంకేతికత, సెమి కండక్టర్లు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , ఉగ్రవాదంపై పోరు,
ఐక్యరాజ్య సమితిలో తీసుకురావలసిన సంస్కరణలు వంటి అంశాలపై పై కూడా వారు తమ చర్చలలో దృష్టిపెట్టారు.

***



(Release ID: 1926070) Visitor Counter : 168