ప్రధాన మంత్రి కార్యాలయం
వియత్నాం ప్రధానమంత్రిని కలిసిన , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
Posted On:
20 MAY 2023 12:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధానమంత్రి , హిజ్ ఎక్సలెన్సి ఫామ్ మిన్హ్ చిన్హ్ ను 2023 మే 20 వ తేదీన
జి–7 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా హిరోషిమాలో కలుసుకున్నారు.
ఇరువురు నాయకులూ ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన క్రమమైన వృద్ధిని ప్రస్తావించారు.
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన సంబంధాలను మరింత పెంపొందించాలని, ఉన్నతస్థాయి సంప్రదింపులు
విస్తృతం చేయాలని నిర్ణయించారు.
రక్షణ, విపత్తులను తట్టుకునేలా భవన నిర్మాణ సరఫరా చెయిన్ల రంగంలో , ఇంధన, శాస్త్ర సాంకేతిక , మానవ వనరులు అభివృద్ధి,
సాంస్కృతిక రంగాలు, ప్రజలకు –ప్రజలకు మధ్య సంబంధాల విషయంలో గల అవకాశాలను ఇరువురు నాయకులు చర్చించారు.
ప్రాంతీయ పరిణామాలపై ఇరువురు నాయకులు సానుకూల అభిప్రాయాలను పంచుకున్నారు. ఏసియాన్ కు సంబంధించి,
ఇండొ – పసిఫిక్లో సహకారం గురించి కూడా వారు చర్చించారు.
ఇండియా జి–20కి అధ్యక్షత వహిస్తుండడం గురించి, గ్లోబల్ సౌత్ దృక్పథాన్ని,దాని ఆందోళనలను ప్రముఖంగా ప్రస్తావించడానికి ఇండియా ప్రాధాన్యతనిస్తున్నట్టు
ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆయనకు తెలిపారు.
***
(Release ID: 1926069)
Visitor Counter : 163
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam