ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖాదీ ప్రతి నిత్యం నవీన రికార్డుల నునెలకొల్పుతోంది: ప్రధాన మంత్రి

Posted On: 09 MAY 2023 9:59PM by PIB Hyderabad

ఖాదీ తో దేశ ప్రజల అనుబంధం అనునిత్యం కొత్త కొత్త రికార్డుల ను నెలకొల్పుతోందని, అంతేకాకుండా దీని ద్వారా ఉద్యోగ కల్పన కు కూడా ప్రోత్సాహం లభిస్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

చేతివృత్తి కళాకారుల నైపుణ్యాల ను పెంచివేసి వారి ఆదాయాన్ని పెంచడం లో ఖాదీ గ్రామీణ పరిశ్రమ ఒక ప్రధానమైన పాత్ర ను పోషిస్తున్నట్లు సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వ్యాపార సంస్థ ల (ఎమ్ఎస్ఎమ్ఇ) శాఖ కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఒక ట్వీట్ లో తెలియ జేశారు.

అంతేకాకుండా, కెవిఐసి 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నాటి నుండి 2023 జనవరి 31 వ తేదీ వరకు చూస్తే ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిశన్ (కెవిఐసి) 77887.97 కోట్ల రూపాయల ఉత్పాదన లు మరియు 108571.84 కోట్ల రూపాయల విలువైన విక్రయాల ను నమోదు చేసిందని, అంతేకాకుండా 1.72 కోట్ల ఉపాధి అవకాశాల ను కల్పించిందని కూడా ఆయన వెల్లడించారు.

ఎమ్ఎస్ఎమ్ఇ శాఖ మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ఈ కార్యసాధన లు ప్రోత్సాహకరం గా ఉన్నాయి. ఖాదీ తో దేశ ప్రజల ఈ అనుబంధం ఉపాధి కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తో పాటుగా అనునిత్యం సరిక్రొత్త రికార్డుల ను నెలకొల్పుతోంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/ST


(Release ID: 1923080) Visitor Counter : 155