ప్రధాన మంత్రి కార్యాలయం
‘బాస్టిల్ డే’ వేడుకలకు గౌరవ అతిథిగా రావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆహ్వానించడంపై ప్రధానమంత్రి కృతజ్ఞతలు
Posted On:
05 MAY 2023 8:31PM by PIB Hyderabad
ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం ‘బాస్టిల్ డే’ నేపథ్యంలో జూలై 14న నిర్వహించే వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు.
ఈ మేరకు తనకు ఆహ్వానం పంపుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాననీయ ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ట్వీట్ చేయడంపై స్పందిస్తూ (ఫ్రెంచి భాషలో) పంపిన సందేశంలో:
“నా మిత్రుడైన @ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌కు ధన్యవాదాలు! జూలై 14న ‘బాస్టిల్ డే’ సంతోషాన్ని మీతోపాటు ఫ్రాన్స్ ప్రజలతో పంచుకునేందుకు, మన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ఫలించే దిశగా వేడుకల్లో పాల్గొనేందుకు నేనెంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1922260)
Visitor Counter : 219
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam