ప్రధాన మంత్రి కార్యాలయం

ఉడాన్ పథకాని కి ఆరు సంవత్సరాలు అయినసందర్భం లో ఆ పథకం కార్యసాధనల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి 

Posted On: 28 APR 2023 10:18AM by PIB Hyderabad

‘ఆరు సంవత్సరాల క్రితం శిమ్ లా ను దిల్లీ తో కలుపుతూ రీజినల్ కనెక్టివిటీ స్కిమ్ (ఆర్ సిఎస్) ‘ఉడాన్’ రెక్కలు తొడుక్కొంది’ అంటూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు. ప్రస్తుతం 473 మార్గాలు మరియు 74 విమానాశ్రయాలు, హెలిపోర్టు లు మరియు వాటర్ ఎయర్ డ్రోమ్ లు భారతదేశం యొక్క పౌర విమానయాన రంగాని కి మేలు మలుపు గా మారాయి.

ట్వీట్ కు శ్రీ నరేంద్ర మోదీ జవాబిస్తూ, గడచిన తొమ్మిది సంవత్సరాలు భారతదేశం యొక్క విమానయాన రంగం లో మార్పు ను తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. అప్పటికే పని చేస్తున్న విమానాశ్రయాల ను ఆధునికీకరించడమైందని, క్రొత్త గా విమానాశ్రయాల ను త్వరిత గతి న నిర్మించడమైందని, మరి ప్రజలు రికార్డు సంఖ్య లో విమాన ప్రయాణాలు చేస్తున్నారని కూడా శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘గత తొమ్మిది సంవత్సరాలు భారతదేశం యొక్క విమానయాన రంగాని కి పరివర్తనకారి గా మారాయి. అప్పటికే కార్యకలాపాల ను నిర్వహిస్తున్న విమానాశ్రయాల ను ఆధునికీకరించడమైంది, క్రొత్త గా విమానాశ్రయాల ను శీఘ్ర గతి న నిర్మించడం జరిగింది; మరి ప్రజలు రికార్డు సంఖ్య లో విమానాల లో ప్రయాణిస్తున్నారు. వృద్ధి చెందినటువంటి ఈ కనెక్టివిటీ వాణిజ్యాని కి మరియు పర్యటన రంగాని కి పెద్ద ప్రేరణ ను ప్రసాదించింది. #UDANat6’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST



(Release ID: 1920600) Visitor Counter : 168