ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశం లో రేడియో కనెక్టివిటీ ని అభివృద్ధిపరచేప్రయాస లో భాగం గా, 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ లను ఏప్రిల్ 28 వ తేదీ నాడుప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ఈ ట్రాన్స్ మిటర్ లు 18 రాష్ట్రాల తో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాల లో ఏర్పాటయ్యాయి


మహత్వాకాంక్ష యుక్త జిల్లాల లో మరియు సరిహద్దు ప్రాంతాల లో కనెక్టివిటీ ని పెంచడంపై  ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతున్నది

ప్రసార సేవ లు లభించే ప్రాంతం లో ఇంచుమించు 35,000 చ.కి.మీ. ల మేర విస్తరించడం తో అదనం గా రెండు కోట్ల మంది ప్రజలురేడియో ప్రసారాల సేవల ను అందుకోగలుగుతారు

ఈ విస్తరణ ‘మన్ కీ బాత్’ యొక్క చరిత్రాత్మకమైన వందో భాగాని కి రెండు రోజులు ముందు గా చోటు చేసుకొంటోంది

Posted On: 27 APR 2023 12:51PM by PIB Hyderabad

వంద వాట్ సామర్థ్యాన్ని కలిగివుండేటటువంటి 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 28 వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ప్రారంభించనున్నారు. దీనితో దేశం లో రేడియో కనెక్టివిటీ కి మరింత గా దన్ను లభించనుంది.

 

దేశం లో ఎఫ్ఎమ్ కనెక్టివిటీ ని పెంచడాని కి ప్రభుత్వం కంకణం కట్టుకొంది. దేశం లోని 18 రాష్ట్రాల లో మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాల లో 84 జిల్లాల లో ఒక్కొక్కటీ 100 వాట్ సామర్థ్యం కలిగిన 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ ల ను కొత్త గా స్థాపించడమైంది. మహత్వాకాంక్ష యుక్త జిల్లాల లో మరియు సరిహద్దు ప్రాంతాల లో సేవల ను పెంచడం పై ఈ విస్తరణ కార్యక్రమం లో ప్రధానం గా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎఫ్ఎమ్ ప్రసారాల కవరేజీ ని బిహార్, ఝార్ ఖండ్, ఒడిశా, పశ్చిమ బంగాల్, అసమ్, మేఘాలయ, నాగాలాండ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర లు, కేంద్రపాలిత ప్రాంతాలు లద్దాఖ్, ఇంకా అండమాన్ మరియు నికోబార్ దీవులలో విస్తరించడమైంది. ఆకాశవాణి ఎఫ్ఎమ్ సేవ ల పరం గా ఈ విస్తరణ తో ఇంతవరకు రేడియో మాధ్యం లభ్యం కాకుండా ఉన్నటువంటి రెండు కోట్ల మంది కి ఈ తరహా సేవ అందుబాటు లోకి రానుంది. ఇది దాదాపు గా 35,000 చదరపు కిలో మీటర్ ల కు పైగా ప్రాంతం లో ఈ విధమైనటువంటి సేవల ను విస్తరింప చేయనుంది.

 

సామాన్య ప్రజానీకం చెంతకు చేరుకోవడం లో రేడియో ప్రముఖ పాత్ర ను పోషిస్తుంది అని ప్రధాన మంత్రి గట్టి గా నమ్ముతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది శ్రోత ల వద్ద కు చేరుకోవడానికి ఈ మాధ్యం యొక్క విశిష్టమైన బలాన్ని వినియోగించుకోవడానికని ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని ఆరంభించారు. మనసు లో మాట కార్యక్రమం ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైనటువంటి వందో ఎపిసోడ్ కు చేరువ లో ఉంది.

 

**


(Release ID: 1920237) Visitor Counter : 212