ప్రధాన మంత్రి కార్యాలయం

సౌరాష్ట్ర తమిళ సంగమం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏప్రిల్ 26 న ప్రసంగించనున్నప్రధాన మంత్రి


ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన ను ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాన్ని ముందుకు తీసుకుపోతోంది

ఇది సౌరాష్ట్ర ప్రాంత తమిళుల కు వారిమూలాల తో తిరిగి జత పడేందుకు ఒక అవకాశాన్ని అందిస్తోంది

Posted On: 25 APR 2023 7:53PM by PIB Hyderabad

సౌరాష్ట్ర తమిళ్ సంగమం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 26వ తేదీ న ఉదయం పూట 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమం ఆరంభం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన ను ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణం లో భాగం గా ఉంది. దేశం లోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య తరాల నాటి నుండి ఉన్న సంబంధాల ను పునరన్వేషించడం , వాటిని తిరిగి తెర మీద కు తీసుకు రావడం లో ఈ కార్యక్రమం సహాయపడనుంది. ఇదే ఆలోచన ను దృష్టి లో పెట్టుకొని ఇంతకు ముందు ‘‘కాశీ తమిళ్ సంగమం’’ ను నిర్వహించడమైంది. అలాగే, ‘సౌరాష్ట్ర తమిళ్ సంగమం’ కార్యక్రమం గుజరాత్ కు, తమిళ నాడు కు మధ్య గల ఉమ్మడి వారసత్వాన్ని మురియు ఉమ్మడి సంస్కృతి ని ఒక ఉత్సవం వలే జరుపుదూ ఆ ఆలోచన ను ముందుకు తీసుకుపోతున్నది.

వందల ఏళ్ళ క్రితం, పెద్ద ఖ్య లో ప్రజలు సౌరాష్ట్ర ప్రాంతం నుండి తమిళ నాడు కు తరలివెళ్ళారు. సౌరాష్ట్ర ప్రాంత తమిళులు వారి మూలాల తో తిరిగి సంపర్కం పెట్టుకొనే అవకాశాన్ని సౌరాష్ట్ర తమిళ్ సంగమం ప్రసాదించింది. 10 రోజుల ఈ సమ్మేళనం సందర్భం లో 3,000 కు పైచిలుకు సౌరాష్ట్ర ప్రాంత తమిళులు ఒక ప్రత్యేక రైలు లో సోమ్ నాథ్ కు చేరుకొన్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 17 వ తేదీ నాడు మొదలైంది మరి దీని ముగింపు కార్యక్రమాన్ని ఏప్రిల్ 26 వ తేదీ నాడు సోమ్ నాథ్ లో నిర్వహించడం జరుగుతున్నది.

 

***



(Release ID: 1919862) Visitor Counter : 123