ప్రధాన మంత్రి కార్యాలయం

మన విలువైన వారసత్వ సంపద ను స్వదేశాని కి తిరిగి రప్పించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాం: ప్రధాన మంత్రి

Posted On: 25 APR 2023 9:30AM by PIB Hyderabad

విదేశాల నుండి మన జాతీయ వారసత్వ సంపదను తిరిగి రప్పించడానికి ప్రభుత్వం నిబద్ధతతో చేస్తున్న కృషి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అరియలూరు జిల్లా పొట్టవేలి వెల్లూరు లోని శ్రీ వరదరాజ పెరుమాళ్ విష్ణు దేవాలయం లో చోరీకి గురి అయిన చోళుల కాలం (14వ-15వ శతాబ్దం) నాటి భగవాన్ హనుమాన్ విగ్రహం ఆస్ట్రేలియా లోని భారత రాయబార కార్యాలయాని కి అప్పగించడం జరిగిందని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

ఇప్పటి వరకు వివిధ దేశాల నుండి 251 పురాతన వస్తువులు స్వదేశానికి తిరిగి తీసుకు రావడం జరిగిందని, వాటిలో 238 వారసత్వ వస్తువులు 2014 వ సంవత్సరం నుండి తిరిగి మన దేశానికి రప్పించడం జరిగింది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘మన విలువైన వారసత్వ సంపద ను తిరిగి స్వదేశాని కి రప్పించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1919423) Visitor Counter : 161