ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్య ప్రదేశ్ లోని రీవా లోజరిగిన పంచాయతీరాజ్ జాతీయ దినం వేడుకల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


దాదాపు గా 17,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల కు శంకుస్థాపనచేయడం తో పాటు దేశ ప్రజల కు అంకితం చేశారు

పంచాయతీ స్థాయి లో సార్వజనిక సేకరణకోసం ఉద్దేశించిన ఇ-గ్రామ్ స్వరాజ్ మరియు జిఇఎమ్ ల ఏకీకృత పోర్టల్ ను ఆయనప్రారంభించారు

సుమారు గా 35 లక్షల స్వామిత్వ  సంపత్తి కార్డుల ను లబ్ధిదారుల కు ఇచ్చారు

పిఎమ్ఎవై-జి లో భాగం గా 4 లక్షల మంది కి పైగా లబ్ధిదారుల ‘గృహ ప్రవేశం’ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు

దాదాపు గా 2300 కోట్ల రూపాయల విలువై వివిధ రేల్ వే పథకాల కుశంకుస్థాపన చేయడం తో పాటు దేశ ప్రజల కు అంకితమిచ్చారు.

జల్ జీవన్ మిశన్ లో భాగం గా ఇంచుమించు 7,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల కుశంకుస్థాపన చేశారు

‘‘పంచాయతీ రాజ్ సంస్థ లు ప్రజాస్వామ్య స్ఫూర్తి ని పెంపొందిస్తూనే, మరో ప్రక్క మన పౌరులలోని అభివృద్ధిసంబంధి ఆకాంక్షల ను నెరవేరుస్తున్నాయి’’

‘‘అమృత కాలం లో మేం ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలిఅని కలలు కన్నాం మరి వాటి ని సాధించడం కోసం దివారాత్రాలు శ్రమిస్తున్నాం’’

‘‘2014 వ సంవత్సరం నుండి దేశం పంచాయతీ ల సాధికారిత ఆశయాన్ని చేపట్టింది; మరి దీని తాలూకు ఫలితాలు ప్రస్తుతంకనిపిస్తున్నాయి’’

‘‘డిజిటల్ రివలూశన్ తాలూకు నేటి కాలంలో పంచాయతీల ను కూడా స్మార్ట్ గాతీర్చిదిద్దడం జరుగుతోంది’’

‘‘అభివృద్ధి చెందిన ఒక భారతదేశం ఏర్పడాలిఅంటే ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క ప్రతినిధి, దేశం లోని ప్రతిపౌరుడు/పౌరురాలు ఏకం కావాలి’’

‘‘ప్రాకృతిక వ్యవసాయాని కి సంబంధించినంతవరకు మన పంచాయతీ లు సార్వజనిక చైతన్యంఉద్యమాన్ని నిర్వహించాలి’’

Posted On: 24 APR 2023 2:16PM by PIB Hyderabad

పంచాయతీ రాజ్ జాతీయ దినం సందర్భం లో మధ్య ప్రదేశ్ లోని రీవా లో ఈ రోజు న జరిగిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు గా 17,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేయడం తో పాటుగా వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు కూడాను.

 

విద్యవాసిని మాత కు మరియు ధైర్య సాహసాల గడ్డ కు ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరించి జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన ఇంతకు ముందటి సందర్శనల ను మరియు స్థానిక ప్రజల ఆప్యాయత ను ఆయన స్మరించుకొన్నారు. దేశవ్యాప్తం గా 30 లక్షల కు పైగా పంచాయతీ ప్రతినిధులు వర్చువల్ మాధ్యం ద్వారా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి గమనించి, అది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క ధైర్యయుక్త చిత్రాన్ని ఆవిష్కరించిందన్నారు. ఇక్కడ కు విచ్చేసిన ప్రతి ఒక్క వ్యక్తి తాలూకు పని పరిధి వేరు వేరు గా ఉండవచ్చు గాని ప్రతి ఒక్కరు దేశాని కి సేవలు అందిస్తుంచడం ద్వారా పౌరుల కు సేవ చేయాలనే ఉమ్మడి లక్ష్యం కోసమే పాటుపడుతున్నారని ఆయన అన్నారు. పల్లెల కు మరియు పేదల కు ప్రభుత్వం అమలుజరప తలపెట్టిన పథకాల ను పంచాయతీ లు పూర్తి సమర్పణ భావం తో సాకారం చేస్తుండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

పంచాయతీ స్థాయి లో సార్వజనిక సేకరణ నిమిత్తం ఇ-గ్రామ్ స్వరాజ్, ఇంకా జిఇఎమ్ పోర్టల్ ఏర్పాటు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది పంచాయతీ ల పనితీరు ను సులభతరం చేస్తుందన్నారు. 35 లక్షల స్వామిత్వ సంపత్తి కార్డుల పంపిణీ ని గురించి మరియు మధ్య ప్రదేశ్ అభివృద్ధి కి గాను 17,000 వేల కోట్ల రూపాయల విలువైన రేల్ వే స్, గృహ నిర్మాణం, నీరు మరియు ఉద్యోగ కల్పన సంబంధి పథకాల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

 

స్వాతంత్య్రం తాలూకు అమృత కాలం లో, అభివృద్ధి చెందినటువంటి ఒక భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనే స్వప్నాన్ని సాకారం చేసే దిశ లో ప్రతి ఒక్క పౌరుడు/పౌరురాలు అత్యంత సమర్పణ భావం తో శ్రమిస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు. అభివృద్ధి చెందినటువంటి ఒక దేశాన్ని నిర్మించడం కోసం భారతదేశం లోని గ్రామాల లో సామాజిక వ్యవస్థ ను, ఆర్థిక వ్యవస్థ ను మరియు పంచాయతీ రాజ్ వ్యవస్థ ను అభివృద్ధి పరచడాని కి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసి ఉంటుందని ఆయన నొక్కిచెప్తూ, పంచాయతీ ల పై భేదభావాన్ని ప్రదర్శించిన మునుపటి ప్రభుత్వాల కు భిన్నం గా ఒక బలమైన వ్యవస్థ ను ఏర్పాటు చేయడం తో పాటుగా దాని పరిధి ని విస్తరింప జేయడాని కి కూడానున వర్తమాన ప్రభుత్వం అలుపెరుగక కృషి చేస్తోందన్నారు. 2014 వ సంవత్సరాని కంటే క్రితం ఇదివరకటి ప్రభుత్వాల కృషి లో లోపాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఆర్థిక సంఘం 70,000 కోట్ల కంటే తక్కువ మొత్తాన్ని మంజూరు చేసింది, దేశం యొక్క సువిశాలత్వాన్ని లెక్క లోకి తీసుకొన్నప్పుడు అది చాలా చిన్న మొత్తం, అయితే 2014 వ సంవత్సరం తరువాత ఈ గ్రాంటు ను 2 లక్షల కోట్ల కు పైచిలుకు కు పెంచడం జరిగిందని తెలియ జేశారు. 2014 వ సంవత్సరం కంటే క్రిందటి దశాబ్ద కాలం లో కేవలం 6,000 పంచాయతీ భవనాల ను నిర్మించడం జరగగా, వర్తమాన ప్రభుత్వం గడచిన 8 సంవత్సరాల లో 30,000కు పైగా పంచాయతీ భవనాల ను నిర్మించిందని ఆయన తెలియ జేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత 2 లక్షల కు పైగా గ్రామ పంచాయతీ లకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ లభించిందని, అంతకు పూర్వం ఈ ఆప్టికల్ ఫైబర్ సదుపాయం జతపడ్డ గ్రామ పంచాయతీలు 70 కి లోపే ఉండేవని కూడా ఆయన వెల్లడించారు. భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఇదివరకటి ప్రభుత్వాలు, ప్రస్తుత పంచాయతీ రాజ్ వ్యవస్థ పట్ల విశ్వాస లోపాన్ని కలిగివుండేవని కూడా ఆయన అన్నారు. ‘భారతదేశం పల్లెల లోనే మనుగడ సాగిస్తుంద’ని చెప్పిన గాంధీ మహాత్ముని పలుకుల ను ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ఇదివరకటి హయాం ఆయన ఆదర్శాల పట్ల కనబరచిన శ్రద్ధ ఎంత మాత్రం లెక్క లోకి రాదని, తత్ఫలితం గా పంచాయతీ రాజ్ కొన్ని దశాబ్దుల తరబడి నిర్లక్ష్యాని కి లోనైందన్నారు. ప్రస్తుతం పంచాయతీ లు బారతదేశం యొక్క అభివృద్ధి కి ప్రాణవాయువు గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘పంచాయతీ లు సమర్థం గా కృషి చేయడాని కి గ్రామ పంచాయత్ వికాస్ యోజన తోడ్పడుతోందిని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

గ్రామాల కు మరియు నగరాల కు మధ్య అంతరాన్ని భర్తీ చేయడాని కి ప్రభుత్వం నిర్విరామం గా కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. డిజిటల్ రెవటూశన్ తో ముడిపడ్డ ప్రస్తుత కాలం లో పంచాయతీల ను స్మార్ట్ గా తీర్చిదిద్దడం జరుగుతోంది. పంచాయతీ లు చేపట్టే ప్రాజెక్టుల లో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం జరుగుతోందని ఆయన వివరించారు. అమృత్ సరోవర్ అభియాన్ లో భాగం గా స్థలాల ఎంపిక తో పాటు ప్రాజెక్టు ను పూర్తి చేయడం వంటి అంశాలు అన్నీ కూడా సాంకేతిక విజ్ఞానం యొక్క అండదండల ను తీసుకొని ముందుకు పోతున్న విషయాన్ని ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి పేర్కొన్నారు. పంచాయతీ స్థాయి లో సార్వజనిక సేకరణ నిమిత్తం జిఇఎమ్ (GeM) పోర్టల్ ను ఉపయోగించుకోవడం అనేది పంచాయతీల కు సేకరణ ను సులభం గా మరియు పారదర్శకమైంది గా మార్చివేయనుందని ఆయన అన్నారు. స్థానిక కుటీర పరిశ్రమ లు వాటి అమ్మకాల కు గాను ఒక బలమైన బాట ను కనుగొన గలుగుతాయని ప్రధాన మంత్రి అన్నారు.

 

పిఎమ్ స్వామిత్వ పథకం లో సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రయోజనాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ఈ పథకం పల్లెల లో సంపత్తి హక్కుల రూపురేఖల ను మార్చివేస్తోంది. వివాదాల ను మరియు వ్యాజ్యాల ను తగ్గిస్తోందని ఆయన తెలియ జేశారు. డ్రోన్ సంబంధి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి పక్షపాతాని కి తావు లేని విధం గా సంపత్తి దస్తావేజు పత్రాలు ప్రజల కు లభించే అవకాశం ఏర్పడుతోందని ఆయన అన్నారు. దేశం లోని 75 వేల పల్లెల లో సంపత్తి కార్డు సంబంధిత పనులు పూర్తి అయ్యాయి అని ఆయన తెలియ జేశారు. ఈ దిశ లో మంచి పని ని చేసినందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.

 

ఛింద్ వాడా అభివృద్ధి విషయం లో అలక్ష్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, తప్పు ను కొన్ని రాజకీయ పక్షాల యొక్క ఆలోచన విధానం పై మోపారు. స్వాతంత్య్రం అనంతర కాలం లో గ్రామీణ ప్రాంతాల మౌలిక అవసరాల ను ఉపేక్షించడం ద్వారా పాలక పక్షాలు పల్లెల్లోని పేద ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశాయని ఆయన అన్నారు.

దేశ జనాభాలో సగం మంది నివసిస్తున్న గ్రామాలపై వివక్ష చూపితే దేశం పురోగతి సాధించదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 2014 తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామాల్లో సౌకర్యాలు, గ్రామాల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఉజ్వల, పీఎం ఆవాస్ వంటి పథకాలు గ్రామాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నారు. మొత్తం 4.5 కోట్ల ఇళ్లలో మూడు కోట్ల పి ఎం ఎ వై ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని, అది కూడా మహిళల పేరిటేనని చెప్పారు.

 

పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించే ప్రతి ఇంటి ఖరీదు లక్షకు పైగానే ఉందని, దేశంలోని కోట్లాది మంది మహిళలను 'లఖ్పతి దీదీ' (కోటీశ్వరులు)గా మార్చడం ద్వారా వారి జీవితాలను ప్రభుత్వం మార్చివేసిందని ప్రధానమంత్రి అన్నారు.

ఈ రోజు 4 లక్షలకు పైగా కుటుంబాలు పక్కా ఇళ్లలో గృహప్రవేశం చేశాయని చెబుతూ  ఇప్పుడు ఇంటి యజమానులు గా మారిన సోదరీమణులను ఆయన అభినందించారు. పి ఎం సౌభాగ్య యోజనను  ప్రస్తావిస్తూ, విద్యుత్ ను పొందిన 2.5 కోట్ల గృహాలలో ఎక్కువ ఇళ్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవని, హర్ ఘర్ జల్ యోజన ఫలితంగా 9 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు నీటి కనెక్షన్లు లభించాయని తెలిపారు. మధ్యప్రదేశ్ లో గతంలో 13 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇవ్వగా, ఇప్పుడు 60 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారని గుర్తు చేశారు.

 

బ్యాంకులు, బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండవలసిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, గ్రామీణ జనాభాలో ఎక్కువ మందికి బ్యాంకు ఖాతాలు లేవని, బ్యాంకుల నుంచి ఎలాంటి సేవలు పొందలేదని ప్రధాని పేర్కొన్నారు. ఫలితంగా లబ్ధిదారులకు పంపిన ఆర్థిక సాయం వారికి చేరేలోపే దోపిడీకి గురైందని ప్రధాని అన్నారు. జన్ ధన్ యోజన గురించి ప్రస్తావిస్తూ, గ్రామాలకు చెందిన 40 కోట్లకు పైగా నివాసితులకు బ్యాంకు ఖాతాలు తెరిచామని, ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా బ్యాంకుల పరిధిని విస్తరించామని ప్రధాన మంత్రి తెలియజేశారు. వ్యవసాయం, వ్యాపారం అనే తేడా లేకుండా గ్రామాల ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తున్న బ్యాంకు మిత్రలు, శిక్షణ పొందిన బ్యాంకు సఖీలను కూడా ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.

 

గత ప్రభుత్వాల హయాంలో భారతదేశంలోని గ్రామాలకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ప్రస్తావిస్తూ, తాము గ్రామాలను ఓటు బ్యాంకుగా పరిగణించనందున గ్రామాలపై డబ్బు ఖర్చును నివారించగలిగామని పేర్కొన్నారు.

 

ప్రస్తుత ప్రభుత్వం హర్ ఘర్ జల్ యోజనకు 3.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయడం ద్వారా గ్రామాల అభివృద్ధి తలుపులు తెరిచిందని, పీఎం ఆవాస్ యోజనకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, పీఎం గ్రామీణ సడక్ అభియాన్ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రధాని వివరించారు.

 

పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కూడా, ప్రభుత్వం సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిందని, ఈ పథకంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని 90 లక్షల మంది రైతులకు 18,500 కోట్ల రూపాయలు వచ్చాయని ప్రధాని చెప్పారు.

రేవా రైతులకు కూడా ఈ నిధి నుంచి సుమారు రూ.500 కోట్లు అందాయని తెలిపారు. ఎం ఎస్ పి పెంపుతో పాటు వేల కోట్ల రూపాయలు గ్రామాలకు చేరాయని, కరోనా కాలంలో ప్రభుత్వం గత మూడేళ్లుగా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యయంతో పేదలకు ఉచిత రేషన్ ఇస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

 

ముద్ర యోజన గురించి ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల్లోనే రూ.24 లక్షల కోట్ల సాయాన్ని అందించడం ద్వారా గ్రామాల్లో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని ప్రధాని తెలిపారు. దీని వల్ల గ్రామాల్లో కోట్లాది మంది ఉపాధి పొందుతున్నారని, మహిళలు పెద్ద సంఖ్యలో లబ్దిపొందుతున్నారని ప్రధాని అన్నారు. గత తొమ్మిదేళ్లలో మధ్యప్రదేశ్ కు చెందిన 50 లక్షల మంది మహిళలతో సహా 9 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరారని, ప్రతి స్వయం సహాయక బృందానికి బ్యాంకు గ్యారంటీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాన్ని ప్రభుత్వం అందిస్తోందని శ్రీ మోదీ తెలిపారు."మహిళలు ఇప్పుడు అనేక చిన్నతరహా పరిశ్రమలకు సారధ్యం వహిస్తున్నారు" అని ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'దీదీ కేఫ్'ను ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ మహిళా శక్తిని అభినందిస్తూ, గత పంచాయతీ ఎన్నికల్లో స్వయం సహాయక సంఘాలకు చెందిన 17,000 మంది మహిళలు పంచాయతీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారని శ్రీ మోదీ తెలిపారు.

 

ఈ రోజు ప్రారంభించిన ' సమవేషి అభియాన్' గురించి ప్రస్తావిస్తూ, సబ్ కా వికాస్ ద్వారా వికసిత్ భారత్ ను సాధించడానికి ఇది ఒక బలమైన చొరవ అవుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘అభివృద్ధి చెందిన భారతదేశం కోసం దేశంలోని ప్రతి పంచాయతీ, ప్రతి సంస్థ, ప్రతి ప్రతినిధి, ప్రతి పౌరుడు ఏకం కావాలి. ప్రతి ప్రాథమిక సదుపాయం 100% లబ్ధిదారులకు త్వరితగతిన, ఎటువంటి వివక్ష లేకుండా చేరినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది" అని ఆయన అన్నారు.

 

నూతన వ్యవసాయ విధానాలపై పంచాయితీలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ముఖ్యంగా ప్రకృతి సేద్యాన్ని ప్రచారం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. చిన్న రైతులు, మత్స్యకారులు, పశుపోషణకు ఈ పథకంలో పంచాయతీల పాత్ర ఎంతో ఉందన్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వామ్యం అయినప్పుడే దేశ సమిష్టి కృషి బలోపేతమవుతుందన్నారు. అమృత్ కాల్ లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ఇది శక్తిగా మారుతుంది‘‘ అన్నారు.

 

చింద్వారా-నైన్ పూర్-మాండ్లా ఫోర్ట్ రైలు మార్గాన్ని విద్యుదీకరించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఢిల్లీ-చెన్నై, హౌరా-ముంబై నగరాలకు కనెక్టివిటీని మరింత సులభతరం చేయడంతో పాటు గిరిజన ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

చింద్వారా-నైన్ పూర్ కు ఈ రోజు జెండా ఊపిన కొత్త రైళ్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అనేక పట్టణాలు ,  గ్రామాలను చింద్వారా, సియోనిలోని వారి జిల్లా కేంద్రాలతో నేరుగా అనుసంధానం చేస్తామని, నాగ్ పూర్ , జబల్ పూర్ కు వెళ్లడం కూడా చాలా సులభం అవుతుందని అన్నారు.

 

ఈ ప్రాంతంలో సుసంపన్నమైన వన్యప్రాణులు ఉన్నాయని, కనెక్టివిటీని పెంచడం వల్ల పర్యాటక రంగం కూడా పెరుగుతుందని, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. "ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వ శక్తి" అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఈ ఆదివారంతో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటున్న 'మన్ కీ బాత్' కార్యక్రమం పట్ల చూపిన ప్రేమ, మద్దతుకు గానూ ప్రతి ఒక్కరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

మన్ కీ బాత్ లో మధ్యప్రదేశ్ ప్రజలు సాధించిన వివిధ విజయాలను ప్రస్తావించిన సందర్భాలను  గుర్తు చేస్తూ, 100వ ఎపిసోడ్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని కోరారు.

 

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ ఫగ్గన్ కులస్తే, సాధ్వి నిరంజన్ జ్యోతి, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

 

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామసభలు, పంచాయితీరాజ్ సంస్థలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి పంచాయితీ స్థాయిలో ప్రజా వస్తువుల సేకరణ కోసం ఇంటిగ్రేటెడ్ ఈగ్రామ్ స్వరాజ్  , జి ఇఎమ్ పోర్టల్ ను ప్రారంభించారు. గ్రామపంచాయతీలు తమ వస్తువులు,  సేవలను జి ఇ ఎమ్ ద్వారా పొందడానికి వీలు కల్పించడం, ఈగ్రామ్ స్వరాజ్ ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకోవడం ఇగ్రామ్ స్వరాజ్ - గవర్నమెంట్ ఇమార్కెట్ ప్లేస్ ఇంటిగ్రేషన్ ఉద్దేశ్యం.

 

ప్రభుత్వ పథకాలను సాకారం చేసే దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధాని 'అభివృద్ధి దిశగా భాగస్వామ్య అడుగులు' అనే క్యాంపెయిన్ ను ప్రారంభించారు. చివరి మైలుకు చేరుకోవడంపై దృష్టి సారించి సమ్మిళిత అభివృద్ధి అనే ఇతివృత్తంతో ఈ క్యాంపెయిన్ ఉంటుంది.

 

ప్రధాన మంత్రి సుమారు 35 లక్షల స్వమిత్వ ప్రాపర్టీ కార్డులను  లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఇక్కడ పంపిణీ చేసిన వాటితో సహా దేశంలో స్వమిత్వా పథకం కింద సుమారు 1.25 కోట్ల ప్రాపర్టీ కార్డుల  పంపిణీ జరిగింది. 'అందరికీ ఇళ్లు' సాధించాలనే దార్శనికతను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద 4 లక్షల మందికి పైగా లబ్ధిదారుల 'గృహ ప్రవేశం' కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొన్నారు.

 

సుమారు రూ.2,300 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. మధ్యప్రదేశ్ లో 100 శాతం రైలు విద్యుదీకరణతో పాటు వివిధ డబ్లింగ్, గేజ్ మార్పిడి, విద్యుదీకరణ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. గ్వాలియర్ స్టేషన్ పునర్నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

 

జల్ జీవన్ మిషన్ కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

 

 

***

DS/TS



(Release ID: 1919238) Visitor Counter : 179