ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జబల్పుర్ లో ప్రాచీన సంగ్రామ్ సాగర్ పునరుద్ధరణ కోసం ప్రజలు సాగిస్తున్న ప్రయాసల ను ప్రశంసించినప్ర‌ధాన మంత్రి 

प्रविष्टि तिथि: 24 APR 2023 10:52AM by PIB Hyderabad

జబల్ పుర్ లో ప్రాచీన సంగ్రామ్ సాగర్ ను పునరుద్ధరించే దిశ లో ప్రజలు సాగిస్తున్న ప్రయాసల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు. జబల్ పుర్ లో ప్రాచీన సంగ్రామ్ సాగర్ ను పునరుద్ధరణ నిమిత్తం ప్రజలు శ్రమదానాని కి నడుం బిగించడం అత్యంత ప్రశంసనీయం గా ఉంది అని ఆయన అన్నారు. జబల్ పుర్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాకేశ్ సింహ్ ట్వీట్ లకు శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇచ్చారు. శ్రీ రాకేశ్ సింహ్ తన ట్వీట్ ల లో తాను ప్రజా ప్రతినిధులు, జబల్ పుర్ కలెక్టరు మరియు నగరపాలక సంస్థ యొక్క కమిశనరు ల తో కలసి సంగ్రామ్ సాగర్ పరిసర ప్రాంతాల ను సుందరీకరించేందుకు గాను సంగ్రామ్ సాగర్ ను పరిశీలించినట్లు తెలియ జేశారు.

 

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘జబల్ పుర్ లో ప్రాచీన సంగ్రామ్ సాగర్ ను పునరుద్ధరించే దిశ లో ప్రజల శ్రమదానానికి ముందుకు వచ్చినటువంటి ప్రయాస ఏదైతే ఉందో అది చాలా ప్రశంసనీయమైందిగా ఉంది.’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1919096) आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam