ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2022లో ఉత్క్రుష్ట ఆవిష్కరణలకు గాను ప్రధాన మంత్రి అవార్డు అందుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ కోవిడ్-19 కార్యక్రమం
Posted On:
21 APR 2023 4:44PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమం ఇన్నోవేషన్ కేటగిరీ కింద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2022లో అత్యుత్తమ ప్రదర్శనకు ప్రధానమంత్రి అవార్డును అందుకుంది. ఈరోజు విజ్ఞాన్ భవన్‌లో 16వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నుండి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ ఈ అవార్డును అందుకున్నారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ విజయం సాధించినందుకు దేశాన్ని అభినందించారు. భారతదేశం కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసినందుకు ఆరోగ్య కార్యకర్తలు, సంరక్షకులు, కమ్యూనిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. "ఏక్ హి ప్రాణ హో సబకా టీకాకరణ" అనే మంత్రంతో అవిశ్రాంతంగా పనిచేసిన మొత్తం బృందానికి అభినందనలు," అని కేంద్ర మంత్రి తెలిపారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రణాళిక నాలుగు స్తంభాల ఆధారంగా చాలా ముందుగానే ప్రారంభమైంది: నిర్మాణాత్మక పాలన యంత్రాంగం, ఉత్పత్తిని పెంచడం, లాజిస్టిక్స్, సరఫరా నిర్వహణ, ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సదుపాయాలతో కూడిన సమర్థవంతమైన, వికేంద్రీకృత టీకా నిర్వహణ అమలు వ్యూహాలు.
రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, స్టేట్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, బ్లాక్/అర్బన్ టాస్క్ ఫోర్స్ ద్వారా సంప్రదింపుల విధానం ఆధారంగా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను రెండు-మార్గం ఫీడ్‌బ్యాక్ మెకానిజంతో సత్వర మధ్యంతర దిద్దుబాటు చర్యలను నిర్ధారించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ నిరోధక శక్తి , పరిష్కారాలు, కమ్యూనికేషన్ స్ట్రాటజీ మొదలైన సాంకేతికత గురించి వివరించే కార్యాచరణ మార్గదర్శకాలు తయారు అయ్యాయి. వాటిని అన్ని రాష్ట్రాలు, యూటీలకు తెలియజేసారు.
శాస్త్రీయ ప్రాధాన్యతను అనుసరించి, కార్యక్రమం ప్రారంభంలో 1.04 కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు టీకాలు వేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సుతో హాని కలిగే అవకాశం ఉన్న జనాభాకు వేయడంతో ఆ సంఖ్య దాదాపు 30 కోట్లకు పెరిగింది. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారితో కూడిన 106.02 కోట్ల జనాభా సమూహాన్ని కవర్ చేయడానికి దశలవారీగా మరింత విస్తరించారు. ఈ కార్యక్రమం 16 జనవరి 2021న ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి 825 రోజులు పూర్తి చేసుకుంది.
వ్యాక్సిన్‌ల సురక్షితంగా వేయడంలో నైపుణ్య-సామర్థ్యాలపై దృష్టి పెట్టడం కీలక పాత్ర పోషించింది. వర్చువల్ (మొదటిసారి జిల్లా స్థాయి వరకు) అలాగే తరగతి గది శిక్షణలు (ఉప-జిల్లా స్థాయి), శిక్షణల నాణ్యత కలయిక ద్వారా అందరు భాగస్వాములకు దిగువ వరకు చేరేలా శిక్షణ భారీ స్థాయిలో, రికార్డు సమయంలో, ఒక పక్క కోవిడ్ పెరుగుతున్నప్పటికీ నిర్వహించడం జరిగింది. నిర్దిష్ట ముందస్తు స్థిర సూచికలను ఉపయోగించి పర్యవేక్షించబడింది. దాదాపు 75,000 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్లు/మెడికల్ ఆఫీసర్లు, 7,30,000 మంది ఆరోగ్య కార్యకర్తలు, 1,60,000 మంది అదనపు ఫ్రంట్‌లైన్ వర్కర్లు ప్రైవేట్ సెక్టార్‌లో, ఇతర సంస్థల క్రింద ఆరోగ్య సేవలతో సహా టీకా కార్యక్రమంలోని వివిధ అంశాలపై దృష్టి సారించారు. సుమారు 2.64 లక్షల మంది వ్యాక్సినేటర్లు, 4.76 లక్షల మంది ఇతర టీకా టీం సభ్యులు కోవిడ్ వ్యాక్సినేషన్ ముఖ్య అంశాలపై శిక్షణ పొందారు. 700 పైగా జిల్లాల్లో కో-విన్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడంపై 1,00,000 కంటే ఎక్కువ మంది శిక్షణ పొందారు.
సాఫీగా వ్యాక్సినేషన్ చేసే పనిని సులభతరం చేయడం కోసం కో-విన్ (విన్నింగ్ ఓవర్ కోవిడ్) ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడం కార్యక్రమం విజయంలో కీలకం. ఐటీ ప్లాట్‌ఫారమ్ 5 ప్రధాన సూత్రాలపై ఆధారపడింది అవి… చేరిక, ప్రాప్యత, ఈక్విటీ, పారదర్శకత, కొలమానం (స్కేలబిలిటీ). ఇది టీకా డ్రైవ్ స్థితి, వ్యాక్సిన్ లభ్యత, వినియోగం వాస్తవ స్థితి పర్యవేక్షణను ప్రారంభించింది. ఇది లబ్ధిదారులకు స్వీయ-నమోదు, వ్యాక్సినేషన్ అపాయింట్‌మెంట్‌ల ముందస్తు బుకింగ్, క్యూఆర్ ఆధారిత వ్యక్తిగత డిజిటల్ సర్టిఫికేట్ల లభ్యతను సులభతరం చేసింది. వినూత్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న మార్గదర్శకాలతో సవరించబడింది. రిజిస్ట్రేషన్, టీకా ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా, అవాంతరాలు లేకుండా ఉంటుందని నిర్ధారించుకోవడం జరిగింది.
- ఆన్‌లైన్, ఆన్-సైట్ మోడ్ ద్వారా కో-విన్ పోర్టల్‌లో 100 కోట్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారుల నమోదు.
- భారతదేశం అంతటా 221 కోట్ల (2.21 బిలియన్) వ్యాక్సిన్ మోతాదులు వేసి, వాటిని డిజిటల్‌గా ట్రాక్ కూడా చేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులో 17%, అంటే 13.34 బిలియన్లు.
- భారతదేశంలోని అర్హులైన జనాభాలో 97% మంది (12 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు గలవారు) కనీసం మొదటి డోస్‌తో, 90% మంది రెండు డోస్‌లతో ఉన్నారు.
- దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల వ్యాక్సినేషన్ సెషన్‌లు జరిగాయి
స్థానికంగా వాక్సినేషన్ ఇచ్చిన లెక్కల ప్రకారం (2021 ఏప్రిల్ 1 వరకు డాటాను చుస్తే..)
- పట్టణ - 28% (57,49,02,883)
గ్రామీణ - 72% (1,46,48,49,355)
CVCలు గ్రామీణ లేదా పట్టణంగా ట్యాగ్ చేయబడలేదు - 0.26% (52,69,625)
లింగం వారీగా నిర్వహించబడే మోతాదులు:
పురుషులు - 51% (1,12,15,23,613)
స్త్రీ-49% (1,07,92,86,309)
ఇతరులు- 0.02% (5,31,125)
సీవీసీ వారీగా కవరేజ్:
పబ్లిక్ సీవీసీలు -97.5% (1,98,79,70,097)
ప్రైవేట్ సీవీసీ -2.5% (5,03,85,412)
గర్భిణీ స్త్రీలు, ట్రాన్స్‌జెండర్లు, నిరుపేదలు, ఉపేక్షితులు, మానసిక ఆరోగ్య సంస్థలు, జైలు ఖైదీలు మొదలైన వారితో సహా ప్రత్యేక సెషన్ల ద్వారా 74 కోట్ల డోస్‌లను అందించారు.
10 రోజులలో 1 కోటి కంటే ఎక్కువ మోతాదులను అందించారు
క్రమ సంఖ్య
|
తేదీ
|
వేసిన డోస్ ల సంఖ్య
|
వ్యాక్సినేటర్ల సంఖ్య
|
క్రియాశీలక సీవీసీల సంఖ్య
|
1
|
27/8/2021
|
1.09 కోట్లు
|
56,035
|
57,399
|
2
|
31/8/2021
|
1.42 కోట్లు
|
68,273
|
70,017
|
3
|
6/9/2021
|
1.21 కోట్లు
|
65,589
|
67,183
|
4
|
17/9/2021
|
2.51 కోట్లు
|
98,184
|
1,01,164
|
5
|
20/9/2021
|
1.01 కోట్లు
|
63,763
|
65,590
|
6
|
27/9/2021
|
1.08 కోట్లు
|
69,876
|
71,519
|
7
|
4/12/2021
|
1.12 కోట్లు
|
83,017
|
85,058
|
8
|
3/1/2022
|
1.07 కోట్లు
|
92,546
|
95,128
|
9
|
4/1/2022
|
1.03 కోట్లు
|
87,956
|
90,335
|
10
|
6/1/2022
|
1.01 కోట్లు
|
89,338
|
91,330
|
- 1 లక్ష కంటే ఎక్కువ సీవీసీల ద్వారా ఒకే రోజులో 2.51 కోట్ల డోస్‌లు వేయడం జరిగింది
మొదటి 100 కోట్ల డోసులు (1 బిలియన్ డోస్‌లు) 9 నెలల్లో అందించారు, తదుపరి 100 కోట్ల డోస్‌లు (2 బిలియన్ డోస్ ల్యాండ్‌మార్క్) తదుపరి 9 నెలల్లో అందించారు.

మిషన్ ఇంద్రధనుష్ నుండి ప్రేరణ పొంది, ప్రచార పద్ధతిలో లబ్ధిదారులను కవర్ చేయడానికి రెండు రౌండ్ల ‘హర్ ఘర్ దస్తక్’ టీకాకరణ్ అభియాన్ నిర్వహించింది. "కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్' అనేది సుస్థిరమైన వేగంలో కొనసాగించిన మరొక ప్రచారం. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల మార్గాలు, మతపరమైన యాత్రలు, పారిశ్రామిక సంస్థలు, మొదలైన వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన శిబిరాల ద్వారా కొత్త కేసులు మరింత పెరగకుండా నిరోధించడంలో సహాయపడింది.
****
(Release ID: 1918681)