విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

భారత్ అధ్యక్షతన 100 వ జీ-20 సమావేశం

Posted On: 17 APR 2023 10:19AM by PIB Hyderabad

జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం ముఖ్యమైన మైలురాయి దాటింది. భారతదేశం అధ్యక్షతన 100వ జీ-20 సమావేశం జరిగింది. వారణాసిలో (MACS) సమావేశం జరిగింది. మరో రెండు జీ-20 సమావేశాలు కూడా ఈ రోజు జరిగాయి. .ఆరోగ్య సేవలపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం గోవాలో, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం హైదరాబాద్‌లో జరిగాయి.

2022 నవంబర్ 16న బాలిలో జరిగిన సదస్సులో జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అప్పగించారు. ఏడాది పాటు భారతదేశం జీ-20 అధ్యక్ష హోదాలో కొనసాగుతుంది. 2022 డిసెంబర్ 1న జీ-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. 2023 నవంబర్ 30 వరకు భారతదేశం జీ-20 అధ్యక్ష హోదాలో విధులు నిర్వర్తిస్తుంది. “వసుధైక కుటుంబకం”-“ఒక భూమి ఒకే కుటుంబం.ఒకే భవిష్యత్తు” నినాదంతో భారతదేశం జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. భారతదేశ జాతీయ జెండాలో ఉన్న మూడు రంగులతో జీ-20 లోగో రూపొందింది. సవాళ్ల మధ్య పర్యావరణ హిత అభివృద్ధి సాధన అంశాన్ని లోగో సూచిస్తుంది.

జీ-20 లో 19 దేశాలు (అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా) సభ్యత్వం కల్గి ఉన్నాయి. ప్రపంచ జీడీపీ లో 85% కలిగి ఉన్న జీ-20 దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 75% పైగా వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది జీ-20 దేశాల్లో నివసిస్తున్నారు. ఉన్నారు.సభ్యత్వం కలిగి ఉన్నాయి.

భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న జీ-20 సమావేశాల్లో ప్రతినిధులు వ్యక్తిగతంగా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇంతవరకు జరిగిన జీ-20 సమావేశాల్లో 110 దేశాలకు చెందిన దాదాపు 12,300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. జీ-20 సభ్య దేశాలు, 9 ఆహ్వానిత దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొన్నారు. ఇంతవరకు జరిగిన 100 జీ-20 సమావేశాలు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 41 నగరాల్లో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో దేశవ్యాప్తంగా జీ-20 సమావేశాలు విజయవంతంగా జరిగాయి. జీ-20 అధ్యక్ష హోదాలో దేశంలో దాదాపు 60 నగరాల్లో విదేశీ ప్రతినిధులు పాల్గొనే 200 కి పైగా జీ-20 సంబంధిత సమావేశాలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. భౌగోళిక పరంగా ఇంతవరకు ఇంత భారీ విస్తీర్ణంలో గతంలో జీ-20 సమావేశాలు జరగలేదు.విస్తృత స్థాయిలో చర్చలు జరిగేలా చూసేందుకు మొత్తం 13 షెర్పా ట్రాక్ వర్కింగ్ గ్రూపులు, 8 ఫైనాన్స్ ట్రాక్ వర్క్ స్ట్రీమ్‌లు, 11 ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌లు, 4ఇనిషియేటివ్‌లు ఏర్పాటయ్యాయి. అధ్యక్ష హోదాలో భారతదేశం జీ-20 లో తొలిసారిగా విపత్తు ప్రమాద తగ్గింపు పై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటయింది. స్టార్ట్ అప్ 20 వర్కింగ్ గ్రూప్ తో సహా ముఖ్య శాస్త్రవేత్తల రౌండ్ టేబుల్ కూడా తొలిసారిగా ఏర్పాటయ్యాయి. ప్రైవేటు రంగం, విద్యా రంగం, ప్రజలు, యువత, మహిళల మధ్య చర్చలు జరగడానికి వీలు కల్పించే 11 ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌ సమావేశాల్లో పార్లమెంట్ సభ్యులు,ఆడిట్ అధికారులు, స్థానిక పట్టణ సంస్థల అధికారులు పాల్గొంటారు.

ఇంతవరకు మూడు మంత్రుల స్థాయి సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశం 2023 ఫిబ్రవరి 24-25 తేదీల్లో బెంగుళూరు లో జరిగింది.జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం 2023 మార్చి 1-2 న న్యూఢిల్లీలో జరిగింది. ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల రెండవ సమావేశం 2023 ఏప్రిల్ 12,13 తేదీల్లో వాషింగ్టన్ లో జరిగింది. రెండు షెర్పా సమావేశాలు ఉదయపూర్ ( 2022 డిసెంబర్ 4-7 తేదీలు ), కుమారకోమ్ (30 మార్చి – 2 ఏప్రిల్ 2023) లో జరిగాయి. ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు, విదేశాంగ మంత్రుల సమావేశం, షెర్పా సమావేశాలకు సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలకు చెందిన ప్రతినిధులు రికార్డు స్థాయిలో హాజరయ్యారు. 28 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ( 18 జీ-20 సభ్య దేశాలు, 9 అతిథి దేశాలు, ఏయూ చాయ్ -కొమొరోస్), రెండు దేశాలకు చెందిన విదేశీ వ్యవహారాల డిప్యూటీ/ సహాయ మంత్రులు ( జపాన్, రిపబ్లిక్ అఫ్ కొరియా) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. జీ-20 దేశాలు గుర్తించిన ప్రాధాన్యతా అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపిన విదేశాంగ మంత్రుల సమావేశం ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఎమ్ బి డి సంస్కరణల అమలు, మొదటి ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో రుణ అంశాలు, బహుళ స్థాయి సంస్కరణలు, అభివృద్ధి సహకారం,ఆహారం, ఇంధన భద్రత, తీవ్రవాద నిరోధం,కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి, విపత్తు ప్రమాద తీవ్రత తగ్గింపు అంశంపై విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆమోదించిన అంశాలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

దక్షిణ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ప్రధానమంత్రి అధ్యక్షతన భారతదేశం 2023 జనవరి నెలలో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు నిర్వహించింది. దీనిలో 125 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 18 దేశాలకు చెందిన అధిపతులు/ మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. ఆఫ్రికా దేశాలకు జీ-20 లో భారతదేశం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తోంది.దక్షిణాఫ్రికా( జీ-20 సభ్య దేశం) మారిషస్, ఈజిప్ట్, నైజీరియా, ఏయూ చైర్- కొమరోస్, ఏయూడిఏ-ఎన్ఈపిఏడి ఆఫ్రికా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

భారతదేశం ఆతిధ్యం ఇస్తున్న సమావేశాలకు హాజరవుతున్న విదేశీ ప్రతినిధులు భారతదేశ వైవిధ్యం, సమ్మిళిత సంప్రదాయాలు,సాంస్కృతిక గొప్పతనాన్ని తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిరు ధాన్యాలతో చేసిన వంటకాలను ప్రతినిధులు రుచి చూస్తున్నారు. అనేక రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, విహారయాత్రలు ప్రతినిధులను అలరిస్తున్నాయి. సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన 150కి పైగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న 7,000 మందికి పైగా కళాకారులు స్థానిక, జాతీయ కళారూపాలను ప్రదర్శించారు. ప్రజల భాగస్వామ్యంతో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. సంపూర్ణ ప్రభుత్వం, సమాజ సహకారం స్పూర్తితో సమావేశాలు నిర్వహిస్తున్న భారతదేశం జీ-20 ని ప్రజల జీ-20 గా మార్చేందుకు కృషి చేస్తోంది. జీ-20 సమావేశాల సందర్భంగా పాఠశాలలు/కళాశాలలు/విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. స్థానికంగా జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో జీ-20 ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వం క్విజ్ పోటీలు, సెల్ఫీ పోటీలు, # జీ-20 ఇండియా కధల పోటీలు, జీ-20 ఇతివృత్తంతో అనేక కార్యక్రమాలు నిర్వహించింది.

సంపూర్ణ సమగ్ర అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి, హరిత అభివృద్ధి, పర్యావరణహిత జీవన శైలి, సాంకేతిక మార్పు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత, ప్రపంచ శాంతి అంశాలపై దృష్టి సారించి పనిచేయాలని భారతదేశం నిర్ణయించింది.

భారతదేశం ప్రతిపాదించిన సంపూర్ణ సమగ్ర అభివృద్ధి, కార్యాచరణ ప్రణాళిక కు జీ-20 సభ్య దేశాలు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయి. జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం అనుసరిస్తున్న విధానాలు, సభ్య దేశాల నుంచి అందుతున్న సహకారంతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో జీ-20 కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

 

 

****

 

 



(Release ID: 1917191) Visitor Counter : 1024