ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డీడీ డాక్యుమెంటరీ ‘ధరోహర్‌ భారత్‌కీ’ చూడాలని పౌరులకు ప్ర‌ధాని పిలుపు

प्रविष्टि तिथि: 14 APR 2023 12:04PM by PIB Hyderabad

   దేశ ప్రజలంతా దూరదర్శన్‌ నిర్మించిన ‘ధరోహర్‌ భారత్‌కీ’ (భారతదేశ వారసత్వం) రెండు భాగాల డాక్యుమెంటరీ చిత్రం చూడాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది దూరదర్శన జాతీయ చానెల్‌లో ఏప్రిల్‌ 14, 15 తేదీల్లో రాత్రి 8:00 గంటలకు ప్రసారమవుతుందని ఆయన తెలిపారు.

ఈ మేరకు దూరదర్శన్‌ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“మన వారసత్వానికి, స్వాతంత్ర్య సాధనలో సర్వస్వం త్యాగం చేసిన సమరయోధులకు, యూనిఫారాల్లో మనకు భద్రత కల్పిస్తున్న వారి శౌర్యపరాక్రమాలకు ఈ డాక్యుమెంటరీ ఒక నివాళి. అందుకే ఈ రెండు భాగాల చిత్రాన్ని ఈ నెల 14, 15 తేదీల్లో దూరదర్శన్‌ జాతీయ చానెల్‌ @DDNational లో రాత్రి 8:00 గంటలకు #DharoharBharatKi చూడండి” అని ప్రధానమంత్రి పౌరులకు సూచించారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1916817) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam