ఆర్థిక మంత్రిత్వ శాఖ
3 నెలల సుదీర్ఘ ప్రచారంలో పిఎంజెజెబివై & పిఎంఎస్‌బివై కింద నమోదును ప్రోత్సహించేందుకు ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన డిఎఫ్ఎస్ కార్యదర్శి
Posted On:
11 APR 2023 11:28AM by PIB Hyderabad
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై) వంటి సూక్ష్మమ బీమా పథకాల కవరేజీని గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రోత్సహించి, పెంచేందుకు తీవ్రమైన మూడు నెలల ప్రచారంలోని ముఖ్యాంశాల గురించి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు/ సీనియర్ అధికారులను సున్నితపరిచి, ప్రభావితం చేసేందుకు సోమవారం జరిగిన విసి సమావేశానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్ఎస్) కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషి అధ్యక్షత వహించారు. మూడు నెలల పాటు01.04.2023 నుంచి 30.06.2023 వరకు సాగనున్న ఈ ప్రచారం దేశంలోని అన్ని జిల్లాల్లోను సాగుతుంది.
రాష్ట్రాలలో జనాభా పరిధి, పరిణామం కారణంగా సూక్ష్మ బీమా పథకాల కింద నమోదులను పెంచవలసిందిగా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను ఈ సమావేశం సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతం, పిఎంజెజెబివై కింద జరిగిన క్రియాశీలక నమోదులు 8.3 కోట్లు కాగా పిఎంఎస్‌బివై కింద 23.9 కోట్లు జరిగాయి. ఈ పథకాల కింద రూ. 15,500 కోట్ల క్లెయిములను చెల్లించారు.
ఈ ప్రచారం ప్రభావవంతంగా అమలు చేసేందుకు, పర్యవేక్షించందుకు చురుకైన పాత్ర పోషించడం ద్వారా మద్దతును అందించాలని అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను డాక్టర్ జోషి కోరారు.
పరిమితిని పెంచే దిశలో ఒక అడుగుగా, సంతృప్త స్థాయి ప్రచారం అర్హులైన గరిష్ట లబ్ధిదారులకు చేరేలా చూసేందుకు డిఎఫ్ఎస్ కార్యదర్శి 13 ఏప్రిల్ 2023 న ప్రభుత్వ రంగ బ్యాంకు అధిపతులతో సమావేశాన్ని నిర్వహిస్తారు.
పిఎంజెజెబివై - పిఎంఎస్‌బివై గురించి
సామాజిక భద్రత కవర్‌లో భాగంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు సహా సమాజంలోని పౌరులందరికీ జీవిత, ప్రమాద బీమాను అందించడం లక్ష్యంగా పిఎంజెజెబివై, పిఎంఎస్‌బివై పని చేస్తున్నాయి. ఏ కారణాలతో మరణం సంభవించినా రూ. 2 లక్షల బీమాను పిఎంజెజెబివై అందిస్తుండగా, పిఎంఎస్‌బివై ప్రమాదంలో మరణించిన వారికి లేదా పూర్తి శాశ్వత వైకల్యం పొందినవారికి రూ. 2 బీమాను, పాక్షిక లేదా శాశ్వత వైకల్యాన్ని పొందిన వారికి రూ. 1 లక్ష బీమాను అందిస్తుంది. అటువంటి ఘటనలు జరిగినప్పుడు ఈ పథకాల చందాదారులకు / లేదా వారి కుటుంబాలకు అవసరమైన ఆర్థిక మద్దతును ఈ రెండు పథకాలు అందిస్తాయి.
***
(Release ID: 1915621)
Visitor Counter : 180