ప్రధాన మంత్రి కార్యాలయం
ఏప్రిల్ 12న అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య రాజస్థాన్ తొలి వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఇది ప్రపంచంలో ‘హై-రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ప్రాంతంగుండా
నడిచే తొలి సెమీ- హైస్పీడ్ ప్రయాణికుల రైలు అవుతుంది;
ఈ మార్గంలో నడిచే శతాబ్ది ఎక్స్’ప్రెస్’తో పోలిస్తే వందే భారత్‌తో గంట సమయం ఆదా
Posted On:
10 APR 2023 7:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్ తొలి వందే భారత్ ఎక్స్’ప్రెస్’ను 2023 ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు ప్రారంభోత్సవం రోజున మాత్రం జైపూర్ నుంచి బయల్దేరి ఢిల్లీ కంటోన్మెంట్ వరకూ నడుస్తుంది. అనంతరం 2023 ఏప్రిల్ 13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే వందే భారత్ ఎక్స్’ప్రెస్ అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది. మార్గమధ్యంలో అల్వార్, గుర్‌గ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది.
ఈ కొత్త వందే భారత్ ఎక్స్’ప్రెస్ అజ్మీర్ నుంచి 5 గంటల 15 నిమిషాల్లో ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇదే మార్గంలో ప్రయాణించే వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్’ప్రెస్’ ప్రయాణ సమయం 6 గంటల 15 నిమిషాలు. కాగా, దీనితో పోలిస్తే వందేభారత్ ప్రయాణికులకు గంట సమయం ఆదా అవుతుంది.
అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్’ప్రెస్ ప్రపంచంలోనే ‘హై-రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ప్రాంతం గుండా ప్రయాణించే తొలి సెమీ- హైస్పీడ్ రైలుగా రికార్డులకెక్కుతుంది. ఈ రైలుతో రాజస్థాన్‌లోని పుష్కర్, అజ్మీర్ షరీఫ్ దర్గా తదితర ప్రసిద్ధ ప్రదేశాలు సహా ప్రధాన పర్యాటక ప్రాంతాలకు అనుసంధానం మెరుగవుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.
(Release ID: 1915482)
Visitor Counter : 157
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam