ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త కమాండర్ల సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి
Posted On:
01 APR 2023 8:36PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త సైనిక కమాండర్ల సదస్సుకు హాజరయ్యారు. “సంసిద్ధ-సముద్ధరిత-సముచిత” సాయుధ బలగాలు ఇతివృత్తంగా మూడు రోజులపాటు ఈ సమావేశం నిర్వహించబడింది. జాతీయ భద్రత, భవిష్యత్తు కోసం సంయుక్త సైనిక బలగాల దృక్పథం రూపకల్పనసహా వివిధ రకాల అంశాలపై ఈ సందర్భంగా చర్చలు సాగాయి. అదేవిధంగా ‘స్వయం సమృద్ధి’ సాధనసహా సాయుధ బలగాల సన్నద్ధత, రక్షణ పర్యావరణ వ్యవస్థలో పురోగతిని కూడా సమీక్షించారు.
ఈ సదస్సులో త్రివిధ సాయుధ బలగాల కమాండర్లు, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆర్మీ, నేవీ, వైమానిక దళాల సైనికులు, నావికులు, ఎయిర్‌మెన్ తదితర సిబ్బంది మధ్య అనధికారిక పరస్పర సంభాషణ గోష్ఠి కూడా జరిగింది.
ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:
“ఇవాళ ఉదయం భోపాల్‌లో జరిగిన సంయుక్త సాయుధ బలగాల కమాండర్ల సదస్సులో పాల్గొన్నాను. ఇందులో భాగంగా భారత భద్రత వ్యవస్థను పటిష్ఠం చేసే అనేక మార్గాలపై మేం విస్తృతంగా చర్చించాం” అని పేర్కొన్నారు.
More details at https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1912891
***
DS/TS
(Release ID: 1913085)
Visitor Counter : 265
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam