ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మనవైన విశిష్ట సాంస్కృతిక అంశాలను ప్రదర్శించే ఉజ్వల వేడుకలకు నిలయం భారతదేశం: ప్రధానమంత్రి

Posted On: 01 APR 2023 9:19AM by PIB Hyderabad

   న విశిష్ట సాంస్కృతిక అంశాలను ప్రదర్శించే అనేక ఉజ్వల వేడుకలకు భారతదేశం నిలయమని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు మాధవ్‌పూర్ మేళాను  గుజరాత్-ఈశాన్య ప్రాంతాలను కూడా కలిపే అసాధారణ వేడుకగా శ్రీ మోదీ పేర్కొన్నారు.

కేంద్ర చట్ట-న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు  ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:

“భారతీయులకు ప్రత్యేకమైన సాంస్కృతికాంశాలను ప్రదర్శించే అనేక ఉజ్వల వేడుకలకు  నిలయం భారతదేశం. అందులో భాగమైన మాధవపూర్ మేళా అటువంటి అసాధారణ వేడుక. ఇది గుజరాత్-ఈశాన్య ప్రాంతాలను కూడా కలుపుతుంది. నేను #MannKiBaat ఎపిసోడ్‌లో కూడా దీనిగురించి సవివరంగా మాట్లాడాను. youtu.be/ZGZeyNlodoo” అని పేర్కొన్నారు.

****

DS/ST


(Release ID: 1912845) Visitor Counter : 156