ప్రధాన మంత్రి కార్యాలయం
రక్షణ ఎగుమతులలో కొత్త రికార్డు నమోదుపై ప్రధాని ప్రశంస
प्रविष्टि तिथि:
01 APR 2023 9:10AM by PIB Hyderabad
భారత రక్షణ ఎగుమతులు 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఎన్నడూలేని రీతిలో రూ. 15,920 కోట్ల గరిష్ఠ స్థాయికి చేరి కొత్త రికార్డు నమోదు కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
దీనిపై రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనకు స్పందనగా ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇదెంతో అద్భుతం! భారత్‌లో తయారీ (మేక్ ఇన్ ఇండియా) కార్యక్రమ విజయంలో భారతదేశ ప్రతిభ, ఉత్సాహాలకు నిదర్శనం. ఈ రంగంలో సంస్కరణలు కొన్నేళ్లుగా సత్ఫలితాస్తున్నాయని కూడా ఈ వాస్తవం రుజువు చేస్తోంది. భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తుల కూడలిగా మార్చే కృషికి చేయూతను మా ప్రభుత్వం సదా కొనసాగిస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1912840)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam