ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒకనాడు దిగ్బంధాలు.. హింసకు ఆలవాలమైన ఈశాన్య ప్రాంతం ఇవాళ అభివృద్ధికి ఆదర్శంగా ముందడుగు వేస్తోంది: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 MAR 2023 10:47AM by PIB Hyderabad

   శాన్యం ప్రాంతం ఒకప్పుడు దిగ్బంధాలకు, హింసకు ఆలవాలమై ఉండేదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోద అన్నారు. అయితే, సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా వివిధ అభివృద్ధి పనులు సాగుతున్న నేపథ్యంలో నేడు ఇదే ప్రాంతం ప్రగతికి మారుపేరుగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

   లోగడ ‘ఎఎఫ్‌ఎస్‌పిఎ’ కింద నాగాలాండ్‌, అస్సాం, మణిపూర్‌ రాష్ట్రాల్లో కల్లోలితమైనవిగా ప్రకటించిన ప్రాంతాల సంఖ్యను మరోసారి కుదిస్తూ ప్రధాని నరే్ంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈశాన్య భారతంలో భద్రత గణనీయంగా మెరుగుపడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

   ఈ మేరకు అమిత్‌ షా ట్వీట్‌పై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:

“ఈశాన్య భారతం నేడు సర్వతోముఖాభివృద్ధికి ప్రసిద్ధి చెందింది. నిలుస్తోంది. ఒకప్పుడు దిగ్బంధాలకు, హింసకు నిలయంగా పేరుపడిన ఈ ప్రాంతం ఇవాళ ప్రగతికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తో్ంది” అని హర్షం వ్యక్తం చేశారు.


****

DS/ST


(रिलीज़ आईडी: 1910958) आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam