ప్రధాన మంత్రి కార్యాలయం

ధార్వాడ్లోని ఎలక్ట్రానిక్ తయారీ సముదాయంతో ధార్వాడ్.. పరిసర ప్రాంతాల ప్రజలకు ఎనలేని ప్రయోజనం: ప్రధానమంత్రి

Posted On: 25 MAR 2023 11:17AM by PIB Hyderabad

   ధార్వాడ్‌లోని ఎలక్ట్రానిక్ తయారీ సముదాయంతో ఆ నగరంసహా పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. తయారీ- ఆవిష్కరణల ప్రపంచంలో కర్ణాటక పురోగమనాన్ని ఇది నిర్దేశించగలదని కూడా ఆయన పేర్కొన్నారు.

   అంతకుముందు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఒక ట్వీట్‌ ద్వారా కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు ఎలక్ట్రానిక్ తయారీ సముదాయం మంజూరైనట్లు తెలిపారు. చేశారు. ఈ సముదాయం ఏర్పాటుతో రాష్ట్రానికి రూ.1,500 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. ఈ పరిశ్రమలలో 18 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, తద్వారా జిల్లాతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టం కాగలదని వివరించారు.

కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి ట్వీట్లపై ప్ర‌ధానమంత్రి ఒక ట్వీట్‌ ద్వారా స్పందిస్తూ;

“ఈ సముదాయం ధార్వాడ్‌, ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎనలేని ప్రయోజనం కలుగుతుంది. అలాగే తయారీ-ఆవిష్కరణల ప్రపంచంలో కర్ణాటక పురోగతిని కూడా నిర్దేశిస్తుంది” అని పేర్కొన్నారు.



(Release ID: 1910914) Visitor Counter : 128