ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డిజిటల్ హెల్త్ 'చివరి పౌరుడికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణని అందించడం' ఇతివృత్తంపై ప్రపంచ సదస్సు లో డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రసంగించారు
“ఆరోగ్య సంరక్షణను అందించే వ్యవస్థ లలో డిజిటల్ పరిష్కారాలు విప్లవాత్మకమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గౌరవ ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, భారతదేశం డిజిటల్ ఆరోగ్యంపై ఒక సంస్థాగత ఫ్రేమ్‌వర్క్ తో ప్రపంచవ్యాప్త చొరవను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది"
వసుధైవ కుటుంబం యొక్క తత్వానికి అనుగుణంగా, భారతదేశం కో-విన్, ఇ-సంజీవని మరియు ఆరోగ్య సేతులను డిజిటల్ ప్రజోపయోగ సేవగా అందించింది, ఇది ప్రపంచ ఆరోగ్యం పట్ల మా నిబద్ధతను మరియు క్లిష్టమైన ఆరోగ్య పరిష్కారాలకు లభ్యత ప్రాప్యతను సమత ను అందించడంలో మా పాత్రను ఉదహరిస్తుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవ్య
"టెక్నాలజీల అనుకూలీకరణ మరియు ప్రజాస్వామ్యీకరణ ద్వారా సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ లక్ష్యాలను సాధించడంలో కీలకమైన సాధనం గా డిజిటల్ ప్రజోపయోగ సేవ ప్రయత్నాలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి భారతదేశం ప్రయత్నిస్తుంది"
మొత్తం సార్వత్రిక ఆరోగ్య కవరేజీ లక్ష్యాలకు మద్దతివ్వగల ఆరోగ్య సంరక్షణ సేవలను సామర్థ్యంతో అందించడంలో డిజిటల్ ఆరోగ్యం గొప్ప సాధనం: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
"మెరుగైన కవరేజ్ మరియు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యత
Posted On:
20 MAR 2023 1:50PM by PIB Hyderabad
“ఆరోగ్య సంరక్షణను అందించే వ్యవస్థ లలో డిజిటల్ పరిష్కారాలు విప్లవాత్మకమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గౌరవ ప్రధాన మంత్రి యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, భారతదేశం డిజిటల్ ఆరోగ్యంపై ఒక సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌గా ప్రపంచవ్యాప్త చొరవను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్రేమ్‌వర్క్ డిజిటల్ ఆరోగ్యం కోసం ప్రపంచ ప్రయత్నాలను ఏకం చేయడం మరియు అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడంతో డిజిటల్ పరిష్కారాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. మెరుగైన కవరేజ్ మరియు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యత కోసం అన్ని దేశాల సహకారంతో 'సిలోస్' నుండి సిస్టమ్స్‌కు మారాల్సిన సమయం ఇది. భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ లో భాగంగా భారత ప్రభుత్వ ఆరోగ్య మరియూ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డబ్లూ హెచ్ ఓ సౌత్-ఈస్ట్ ఆసియా ప్రాంతం సహకారంతో నిర్వహించిన సహ-బ్రాండెడ్ ఈవెంట్ జీ20 ప్రెసిడెన్సీ“డిజిటల్ హెల్త్ 'చివరి పౌరుడికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణని అందించడం' ఇతివృత్తంపై ప్రపంచ సదస్సు”లో ప్రసంగిస్తూ కేంద్ర ఆరోగ్య మరియూ కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు.
డిజిటల్ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, డాక్టర్ మాండవియ "ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో డిజిటల్ ఆరోగ్యం గొప్ప సాధనం. మొత్తం సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ లక్ష్యాలకు మద్దతునిచ్చే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది" అని పేర్కొన్నారు. ఆరోగ్య సేవల లభ్యత, చేరువ, స్థోమత మరియు సమత ను నిర్ధారిస్తూ వివిధ నవ్య డిజిటల్ ఆరోగ్య పథకాలకు జాతీయ ఆరోగ్య విధానాలు కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు.
ఈ చొరవ ద్వారా, "సాంకేతికత యొక్క అనుకూలీకరణ మరియు ప్రజాస్వామ్యీకరణ ద్వారా సార్వత్రిక ఆరోగ్య కవరేజీ లక్ష్యాలను సాధించడంలో కీలకమైన సాధనం గా డిజిటల్ పబ్లిక్ గూడ్స్ ప్రచారంపై మేము ఏకాభిప్రాయాన్ని నిర్మిస్తున్నాము" అని డాక్టర్ మాండవ్య వివరించారు.
డిజిటల్ ఆరోగ్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో సవాళ్లను ప్రస్తావిస్తూ, ఆరోగ్య మంత్రి “వసుధైవ కుటుంబం యొక్క తత్వానికి అనుగుణంగా, ఇ-సంజీవని, మరియు ఆరోగ్య సేతు అప్లికేషన్‌లు డిజిటల్ పబ్లిక్ గూడ్స్‌గా ప్రపంచ ఆరోగ్య సంరక్షణ పట్ల మా నిబద్ధతను మరియు క్లిష్టమైన ఆరోగ్య పరిష్కారాలకు సమానమైన ప్రాప్యతను అందించడంలో మా పాత్రను ఉదహరిస్తాయి.
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణని అందించడం పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఆరోగ్య మంత్రి పునరుత్పత్తి పిల్లల ఆరోగ్య సంరక్షణ, ని-క్షయ్, టీ బీ నియంత్రణ కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్, హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి అనేక కీలకమైన ఆరోగ్య కార్యక్రమాలకు డిజిటల్ జోక్యాలు పునాదులుగా మారాయని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలకు ఆరోగ్య సంరక్షణ సేవలకు సమానమైన చేరువ లభ్యత ప్రాప్యతను ప్రారంభించడంలో సవాళ్లను ప్రస్తావిస్తూ,మహమ్మారి ప్రారంభం నుండి భారతదేశం డిజిటల్ ఆరోగ్యాన్ని కీలకమైన జోక్యంగా స్వీకరించడం ఒక నిర్దిష్ట దశగా మారిందని, ఇది ఆరోగ్య సంరక్షణ సేవలకు విస్తృత శ్రేణి సేవలకు దేశంలోని అత్యంత దూర ప్రాంతాలకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పించిందని ఆయన అన్నారు. 100 మిలియన్ల టెలికన్సల్టేషన్‌లను దాటిన టెలి-కన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్ ఇ-సంజీవిని , వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ డ్రైవ్ 2.2 బిలియన్ల కంటే ఎక్కువ మోతాదుల పంపిణీ ని సాధించింది. 500 మిలియన్ల పౌరులకు ఆరోగ్య బీమాను అందించే ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన (PMJAY) నగదు రహిత మరియు కాగిత రహిత పద్ధతిలో ఉచితంగా అందించడం వంటి ఉదాహరణలను ఉటంకిస్తూ "డిజిటల్ టెక్నాలజీ అమలు ఆరోగ్య సంరక్షణ బట్వాడా యొక్క గతిశీలతను ఎప్పటికీ మార్చింది" అని డాక్టర్ మాండవ్య నొక్కిచెప్పారు.
"ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి సాంకేతికతను విజయవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇప్పటికే గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, స్థిరమైన మరియు వేగంగా అభివృద్ధి ఫలితాలను సాధించడానికి ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది. భారతదేశం జీ 20 ప్రెసిడెన్సీ క్రింద తన హెల్త్ వర్కింగ్ గ్రూప్‌లో నిర్దిష్ట ప్రాధాన్యతగా డిజిటల్ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చింది. ఇది యూనివర్సల్ హెల్త్ కవరేజీకి “యూ హెచ్ సీ కి సహాయం చేయడానికి మరియు అరోగ్య రక్షణను మెరుగుపరచడానికి, సహాయం చేయడానికి , పెట్టుబడులను సేకరించడం, మద్దతు ఇవ్వడం, అనుసంధానం , డిజిటల్ పబ్లిక్ హెల్త్ గూడ్స్ ప్రయత్నాల భావనను ప్రోత్సహించడం డిజిటల్ అరోగ్య ఆవిష్కరణ మరియు పరిష్కారాలు లక్ష్యంగా పెట్టుకుంది” అని ఆయన అన్నారు.
మహమ్మారి సమయంలో భారతదేశం అవలంబించిన ఆరోగ్య సేతు, ఇ-సంజీవని, ఐగాట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ మరియు కో-విన్ వంటి వివిధ డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ వివరించారు. డిజిటల్ ఆరోగ్యం దాని పరివర్తన సామర్థ్యంతో సేవా డెలివరీని మెరుగుపరచడమే కాకుండా పౌరుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌ను సృష్టించడం ద్వారా ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ స్థాయిలలో సంరక్షణ కొనసాగింపుకు సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. "డిజిటల్ ఆరోగ్య జోక్యాలు ఆరోగ్య పరివర్తన యొక్క త్వరణానికి మద్దతు ఇస్తున్నాయి మరియు యూనివర్సల్ ఆరోగ్య కవరేజ్ (UHC)కి మద్దతు ఇవ్వడానికి భారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆరోగ్యంలో డిజిటల్ టెక్నాలజీలను సమర్థవంతంగా అమలు చేయడం సమర్థవంతమైన, బాగా పనిచేసే ఆరోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేయడం మరియు రోగులకు సాధికారత కల్పించడంలో తోడ్పడుతుంది” అని ఆయన చెప్పారు.
ప్రపంచ డిజిటల్ ఆరోగ్యం ఎజెండాలో భారతదేశం యొక్క పాత్రను నొక్కిచెప్పిన శ్రీ లవ్ అగర్వాల్, జెనీవాలో జరిగిన 71వ సెషన్‌లో భారతదేశం డిజిటల్ ఆరోగ్యంపై ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ లో తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని, దీనిని దేశాలు విజయవంతంగా ఆమోదించాయని మరియు డిజిటల్ ఆరోగ్యం ఎజెండాపై ప్రపంచ చర్యను ప్రోత్సహించాయని అదనపు కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ తెలియజేశారు. డబ్ల్యూహెచ్‌ఓలో డిజిటల్ ఆరోగ్యం & ఇన్నోవేషన్ డిపార్ట్‌మెంట్‌ను రూపొందించిన తర్వాత, సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాకు అనుగుణంగా డిజిటల్ ఆరోగ్యం 2020-25పై ప్రపంచ వ్యూహం కూడా అభివృద్ధి చేయబడిందని ఆయన తెలియజేశారు.
డబ్ల్యు హెచ్ ఓ - ఎస్ ఈ ఏ ఆర్ ఒ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ భారతదేశం యొక్క ఈ-సంజీవని, డిజిటల్ హెల్త్ సొల్యూషన్‌ను 100 మిలియన్లకు పైగా టెలికన్సల్టేషన్‌లకు సహాయపడింది. డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ పేద మరియు మధ్య ఆదాయ దేశాలపై (LMICs) నిర్దిష్ట దృష్టితో ఆరోగ్య సేవలు ఆవిష్కరణల ప్రజాస్వామ్యీకరణను నిర్ధారిస్తాయి అని ఆమె అన్నారు. డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, సంస్థాగత ప్లాట్‌ఫారమ్ మరియు పౌరులచే నడిచే డిజిటల్ ఆరోగ్య సంరక్షణ ఆవరణాన్ని నిర్మించాలని కూడా ఆమె సూచించారు.
ప్రొఫెసర్ అలైన్ లాబ్రిక్, డిజిటల్ హెల్త్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, డబ్ల్యు హెచ్ ఓ అట్టడుగు సమాజం, డిజిటల్ విభజన, సమత సమ్మిళిత ప్రజానుకూల డిజిటల్ పరిష్కారాల అవసరంపై దృష్టి సారించారు.
ప్రపంచ నాయకులు మరియు ఆరోగ్య అభివృద్ధి భాగస్వాములు, ఆరోగ్య విధాన రూపకర్తలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కర్తలు మరియు ప్రభావశీలులు, విద్యావేత్తలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వాటాదారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1908985)
Visitor Counter : 187