ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఒక ఆరోగ్యం: సమీకృత ఆరోగ్యానికి సమగ్ర, సహకార మరియు బహుళ రంగాల విధానం’ అనే అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, సీ ఐ ఐ భాగస్వామ్య సదస్సు 2023లో ‘ ప్రసంగించారు.
"భారతదేశం "ఒకే భూమి, ఒకే ఆరోగ్యం"వసుధైవ కుటుంబం దార్శనికత సంపూర్ణ మరియు సమగ్ర పర్యావరణ మరియు ప్రకృతి అనుకూలమైన విధాన రూపకల్పన మరియు ప్రపంచ ఆరోగ్యం మరియు శ్రేయస్సు అనే మన తాత్వక దృక్పథం లో ప్రతిఫలిస్తుంది"
దేశాలు తమ గురించి సంకుచితంగా మాత్రమే ఆలోచించకుండా, సామూహిక ప్రపంచ ఫలితాల గురించి యోచిస్తూ చురుకైన ప్రపంచ సహకారంతో మాత్రమే "ఒక భూమి, ఒక ఆరోగ్యం" దృష్టి సాకారం అవుతుంది- డాక్టర్ మన్సుఖ్ మాండవియా
"సార్వత్రిక ఆమోదయోగ్యతతో వాణిజ్యపరంగా లాభసాటిగా ఉండే వినూత్న పరిశోధన మరియు సాంకేతిక మద్దతు పరిష్కారాలలో భారతదేశం ముందుంది"
Posted On:
15 MAR 2023 2:33PM by PIB Hyderabad
“ఒకే భూమి, ఒకే ఆరోగ్యం” అనే దార్శనికతను సంపూర్ణమైన మరియు సమగ్రమైన పర్యావరణ మరియు ప్రకృతి అనుకూలమైన విధాన నిర్ణేత వాతావరణంతో సాకారం చేయడంలో భారతదేశం ముందంజ వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం మన వసుధైవ కుటుంబం భావన తో దానిని సంధానం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నాయకత్వంలో, విశ్వవ్యాప్త ఆమోదయోగ్యతతో వాణిజ్యపరంగా లాభసాటిగా ఉండే వినూత్న పరిశోధన మరియు సాంకేతిక మద్దతుతో కూడిన పరిష్కారాలలో నాయకత్వం వహించడానికి భారతదేశానికి బలమైన రాజకీయ సంకల్పం ఉంది”. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) భాగస్వామ్య సదస్సు 2023లో 'ఒక ఆరోగ్యం: సమీకృత ఆరోగ్యానికి సమగ్ర, సహకార మరియు బహుళ రంగాల విధానం’ అనే అంశంపై నేడు ప్రసంగిస్తూ కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు.
"ఒకే భూమి, ఒక ఆరోగ్యం దృష్టి చురుకైన ప్రపంచ సహకారంతో మాత్రమే వాస్తవమవుతుంది, ఇక్కడ దేశాలు తమ గురించి మాత్రమే ఆలోచించకుండా, సామూహిక ప్రపంచ ఫలితాల గురించి ఆలోచించాలి." డాక్టర్ మాండవ్య చెప్తూ “ఒక దేశం యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సు మరొక దేశంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఆరోగ్య రంగాన్ని ఒక దేశానికి పరిమితం చేయలేము. మనం ఒకరి తో మరొకరు ఆధారపడే పరస్పర ఆధారిత ప్రపంచంలో జీవిస్తున్నాము, దీనిలో కేవలం దేశాలు మాత్రమే కాకుండా మానవ ఆరోగ్యం సమానంగా ప్రభావితమవుతుంది. అలాగే చుట్టుపక్కల పర్యావరణం మరియు జంతువుల ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. ప్రపంచ మహమ్మారి తో ఏ దేశం ప్రతికూల పరిణామాల నుండి మరే దేశం రోగనిరోధక శక్తిని కలిగి ఉండజాలదని మన చర్యలు మన పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయని నిరూపించింది. అందువల్ల మనల్ని మనం రక్షించుకోవడం మాత్రమే కాకుండా, మన చర్యల ఫలితంగా మనం సహజీవనం చేసే పర్యావరణాన్ని రక్షించే విధంగా చూసుకోవడం మానవ జాతిగా మన సమిష్టి బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు. "ఒకే భూమి, ఒకే ఆరోగ్యం" యొక్క దార్శనికత తో మన చర్యలు మరియు పర్యావరణ అనుకూల విధానాల యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా దృష్టికి తీసుకువస్తుంది, అని ఆయన వివరించారు.
దేశీయ పరిశోధనలు మరియు సాంప్రదాయ చికిత్సల సంపదలో భారతదేశం యొక్క ప్రముఖ పాత్రను ప్రశంసిస్తూ, డాక్టర్ మాండవియ ప్రతి దేశం "ఒకే భూమి, ఒకే ఆరోగ్యం" అనే స్పూర్తి తో తనదైన స్వంత నమూనాను కలిగి ఉండవచ్చని హైలైట్ చేశారు. అయితే మన నమూనాలను మెరుగుపరచుకోవడం మరియు మన సమిష్టి చర్యలు మనం నివసించే వర్తమాన ప్రపంచం కంటే ఆరోగ్యకరమైన భావి ప్రపంచాన్ని సృష్టించేందుకు ఒకరితో ఒకరు సమన్వయంతో పనిచేయడం కోసం ఒకరి ఉత్తమ అభ్యాసాల నుండి మరొకరు నేర్చుకోవడం చాలా ముఖ్యం, అని ఆయన అన్నారు. . ఇంకా, ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ "సమగ్ర వైద్యం అనే భారతదేశ నమూనా దీనికి ఒక ఉదాహరణ, ఇక్కడ భారతదేశంలో అంతర్లీనంగా ఉన్న ఆయుర్వేదం యొక్క సాంప్రదాయిక సూత్రాలను కలుపుకొని స్వస్థత పై దృష్టి సారించి ఆధునిక వైద్యాన్ని సమీకృతం చేస్తుంది."
ఆయుష్మాన్ భారత్ పథకం వంటి కార్యక్రమాల పురోగతిని మరియు ఇప్పుడు పబ్లిక్ డిజిటల్ గుడ్‌గా భాగస్వామ్యం చేయబడిన కో-విన్ ప్లాట్‌ఫారమ్ విజయాన్ని ప్రశంసిస్తూ, ఆరోగ్యాన్ని ‘సేవ’ అంటే ఇతరులకు చేసే సేవ అని డాక్టర్ మాండవ్య నొక్కిచెప్పారు. ఆరోగ్య మంత్రి కూడా దేశంలోని పరిశోధనా సంస్థలపై తనకున్న విశ్వాసాన్ని ధృవీకరిస్తూ, పరిశోధనకు దోహదపడేలా విద్యాసంస్థలు, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యం మరియు ప్రమేయాన్ని చొరవను కోరారు.
జన్ ఔషధి కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్ గొడుగు ద్వారా యూ హెచ్ సీ మరియు వైద్య కళాశాలలోనే నర్సింగ్ కళాశాలల సహస్థానం ద్వారా అందుబాటులో ఉన్న వనరుల లభ్యత వినియోగం మరియు శ్రేణిని మెరుగుపరుస్తుంది, ఉదాహరణకు రోగి పడక వద్దే బోధించే అవకాశాలు, మరియు భారతదేశంలోని నర్సింగ్ కమ్యూనిటీకి ప్రోత్సాహాన్ని అందించడం, సరసమైన మందులను అందించడం వంటి వివిధ కార్యక్రమాల ద్వారా దేశంలో ఆరోగ్య సంరక్షణను పెంపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి మరియు కార్యక్రమాలను ప్యానలిస్టులు ప్రశంసించారు. ప్యానలిస్ట్‌లు 'ఒక భూమి, ఒకే ఆరోగ్యం' యొక్క దార్శనికతను మార్గనిర్దేశకంగా ప్రశంసించారు, ఇది జ్ఞానం మరియు జవాబుదారీతనం యొక్క వివేకాన్ని మిళితం చేస్తుంది, దీనిలో ఆర్ అండ్ డి మరియు తయారీ వైద్య ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలోని ప్రతి లబ్దిదారు వారి ఫలితాలకు బాధ్యత వహిస్తారు. దేశం యొక్క శాస్త్రీయ జ్ఞానం మరియు సామర్థ్యాలపై ప్రభుత్వానికి ఉన్న విశ్వాసాన్ని కూడా వారు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్ ట్రెహన్, సీ ఐ ఐ హెల్త్‌కేర్ కౌన్సిల్, ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియా, డా. రాజేష్ జైన్, & మేనేజింగ్ డైరెక్టర్, సీ ఐ ఐ నేషనల్ కమిటీ ఆన్ బయోటెక్నాలజీ, పెనేసియా బయోటెక్ లిమిటెడ్ మరియుడాక్టర్ సుచిత్రా ఎల్లా, సీ ఐ ఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్, భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు మరియూ ఎం డీ ప్యానలిస్టులుగా పాల్గొన్నారు.
***
(Release ID: 1907253)
Visitor Counter : 135