ప్రధాన మంత్రి కార్యాలయం
విపత్తు నష్టం తగ్గింపు జాతీయ వేదిక 3వ సెషన్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి
విపత్తు ప్రభావ తగ్గింపు, నిర్వహణ ప్రధానమంత్రి ఊహించిన విధంగా ఒక ఉద్యమంగా మారుతోంది: పి.కె.మిశ్రా
"ప్రధాన మంత్రి 10-అంశాల ఎజెండా స్థానిక సామర్థ్యాలు, చొరవలను పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది; ముఖ్యంగా విపత్తు ప్రమాద నిర్వహణలో మహిళల నాయకత్వం దిశగా ఆలోచన చేయాలి"
"విపత్తు నష్ట నివారణ వ్యవస్థను ప్రొఫెషనల్‌గా చేయడం, ప్రజల అవసరాలకు ప్రతిస్పందించే కార్యక్రమాలు, జోక్యాలను అభివృద్ధి చేయడం ముందున్న మార్గం"
"అత్యంత దుర్బలమైన వారిని ఆదుకోలేకపోతే, వారి జీవితాలను, జీవనోపాధిని మనం రక్షించలేకపోతే, మన పనికి సార్ధకత ఉండదు "
Posted On:
11 MAR 2023 6:18PM by PIB Hyderabad
విపత్తు ప్రమాదాలు పెరగడమే కాకుండా ప్రమాదాల కొత్త నమూనాలు ఉద్భవిస్తున్న సమయంలో విపత్తు నష్టాల నిర్వహణ ను స్థానికీకరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు స్థానిక సామర్థ్యాలు, చొరవలపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీ పికె మిశ్రా అన్నారు. ఈరోజు ఇక్కడ జరిగిన విపత్తు నష్ట నివారణ జాతీయ వేదిక 3వ సెషన్ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2013 నుండి కూడా ఎన్ పి డి ఆర్ ఆర్ మూడు సెషన్‌లకు హాజరైన శ్రీ మిశ్రా, సంభాషణల విస్తృత పరిధి, లోతైన చర్చల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ వ్యాప్తంగా, విపత్తు ప్రమాద తగ్గింపును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన విధంగా 'జన ఆందోళన్ 'గా ఒక ఉద్యమంగా మారుతోందని అన్నారు.
"మారుతున్న వాతావరణంలో స్థానిక స్థితిస్థాపకతను నిర్మించడం" అనే ఇతివృత్తంతో సాగిన ఈ సెషన్ లో ప్రధాని ముఖ్య కార్యదర్శి దీని ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ముఖ్యంగా విపత్తు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో మహిళల నాయకత్వం అవసరాన్ని నొక్కిచెప్పే ప్రధాన మంత్రి 10-అంశాల ఎజెండాను ప్రస్తావించారు. ఈ సదస్సులో వెల్లడయ్యే అంశాల వల్ల ప్రధానమంత్రి పది పాయింట్ల ఎజెండా, సెండాయ్ ఫ్రేంవర్క్ ను ఆచరణ సాధ్యం చేయవచ్చని ఆయన అన్నారు.
ఈ ఆలోచనా విధానం అందరికీ చేరడానికి రెండు ప్రధానమైన ఇతివృత్తాలను శ్రీ మిశ్రా సూచించారు. మొదటిది, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో విపత్తు నివారణ నిర్వహణ వ్యవస్థలను నైపుణ్యంగా ఉండేలా ప్రొఫెషనల్‌గా చేయడం, రెండవది, ప్రజల అవసరాలకు ప్రతిస్పందించే కార్యక్రమాలు, జోక్యాలను అభివృద్ధి చేయడం.
మొదటి ఇతివృత్తానికి సంబంధించి, ప్రధాని ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ, “జాతీయ, రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిలలో విపత్తు నిర్వహణ విధులకు సంబంధించిన అన్ని అంశాలకు వృత్తిపరంగా శిక్షణ పొందిన సిబ్బంది సహాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆశించిన ప్రయోజనానికి సరితూగేలా, పాలనా మౌలిక సౌకర్యాలు, ఆధునిక కార్యస్థలం, అత్యవసర కార్యకలాపాల కేంద్రాల వంటి అవసరమైన సౌకర్యాలు సమకూర్చాలి. ఈ నైపుణ్యం ద్వారా ఎస్డిఎంఎస్ లు, డిడిఎంఏలు రెండింటినీ కవర్ చేయాలి. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ రాకతో సంభవించిన విపత్తు ప్రతిస్పందన ప్రొఫెషనలైజేషన్ తరహాలో విపత్తు సంసిద్ధత, విపత్తు ఉపశమనాన్ని ప్రొఫెషనల్‌గా మార్చాల్సిన అవసరం ఉంది అని అయన అన్నారు. రాష్ట్రాలకు తగిన వనరులు ఉన్నాయని, వాటికి ఎన్‌డిఎంఎ, ఎన్‌ఐడిఎం, ఎన్‌డిఆర్‌ఎఫ్ సమన్వయంతో మద్దతు ఇస్తాయని ఆయన అన్నారు.
ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ కి సంబంధించిన రెండవ ఇతివృత్తం గురించి శ్రీ మిశ్రా మాట్లాడుతూ అనుకున్న విధానాలు, చేపట్టే కార్యక్రమాలు ఒకదానితో ఒకటి కలిసి ముందుకు వెళ్లాలని అన్నారు. “కార్యక్రమాల అభివృద్ధిలో మనం రంగాల వారీగా పని చేయాలి. దీనికి విపత్తు నిర్వహణ, పర్యావరణం, నీటి వనరులు, విద్య, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, ప్రజారోగ్య రంగాల సంయుక్త కృషి అవసరం” అని ఆయన సూచించారు.
విపత్తు నిర్వహణ కార్యాచరణ మరింత ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రంగాల మధ్య అంతర్గత సమన్వయాన్ని పరిగణలోకి తీసుకునేలా అభివృద్ధి చేయాలనీ ప్రధానమంత్రి ముఖ్యకార్యదర్శి సూచించారు. నష్టాన్ని తగ్గించేందుకు నిత్యం నిర్వహించే కార్యక్రమాలను ఎలా అనుసంధానించాలో తెలియకపోతే అభివృద్ధిలో విపత్తు నష్ట నివారణను ప్రధాన స్రవంతిలోకి తేలేమని ఎన్ డి ఎం ఏ కి ఆయన వివరించారు.
ప్రొఫెషనలైజేషన్, ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్... రెండింటికి వనరుల లభ్యత పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తుఫానులు, విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలు వంటి సంఘటనలలో విపత్తు నిర్వహణ సాధనాలు, అభ్యాసాలను కొత్త సాంకేతికతలు, మరింత ప్రభావవంతంగా చేయగలవని ఆయన తెలిపారు. రాబోయే మూడేళ్లు చాలా కీలకమైనవని, మనం లక్ష్యంపైనే దృష్టిని కేంద్రీకరించి కోనసాగించాలని ఆయన అన్నారు.
సెండాయ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకటించి మరో వారంలో ఎనిమిదేళ్లు అవుతున్నాయని శ్రీ మిశ్రా గుర్తు చేస్తూ, దానిని అమలు పురోగతి నెమ్మదిగా ఉందని వాటాదారులకు అయన హెచ్చరిక చేశారు. “మొత్తం 15 సంవత్సరాల ఫ్రేమ్‌వర్క్‌లో సగానికి పైగా సమయం గడిచిపోయింది, ప్రపంచం సెండాయ్ లక్ష్యాలను చేరుకోలేకపోయింది. సురక్షితమైన దేశం, మరింత స్థితిస్థాపకంగా ఉండే సామజిక వ్యవస్థలతో సురక్షితమైన ప్రపంచం కోసం పనిచేయడానికి మరింత ప్రభావవంతమైన, మరింత ప్రతిస్పందించే విపత్తు నష్ట నివారణ నిర్వహణ వ్యవస్థను రూపొందించడానికి మనం పునరంకితం కావాలి” అని ఆయన అన్నారు.
*****
(Release ID: 1905989)
Visitor Counter : 221
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam