సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్‌'పై (పీఎం వికాస్) 11 మార్చి 2023న బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రసంగించనున్న ప్రధాని


బడ్జెట్ ప్రకటనలను అమలు చేయగల ఆలోచనలను ఆహ్వానించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 బడ్జెట్ అనంతర వెబ్‌నార్లలో ఇది ఒకటి

ఎంఎస్‌ఎంఈ రంగం, పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్‌పై చర్చించేలా సెమినార్‌లో 4 సెషన్‌లు ఉంటాయి, కొత్త పథకం రూపకల్పన, నిర్మాణం, అమలుకు సంబంధించిన చర్చలు కొనసాగుతాయి

Posted On: 10 MAR 2023 3:43PM by PIB Hyderabad

‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్‌'పై (పీఎం వికాస్) బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో 11 మార్చి 2023న ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఆలోచనలు, సూచనలను ఆహ్వానించేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 బడ్జెట్ అనంతర వెబ్‌నార్ల శ్రేణిలో ఇది ఒక భాగం. చేతివృత్తులు/కళాకారుల ఉత్పత్తులు/సేవలను దేశీయ, ప్రపంచ విలువ గొలుసులతో ఏకీకృతం చేయడం ద్వారా వాటి నాణ్యత, స్థాయిని పెంచి ప్రజలకు మరింత చేరువ చేయడం  'పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్' లక్ష్యం.

4 సెషన్ల రూపంలో వెబ్‌నార్‌ సాగుతుంది, ఈ కింది అంశాలను చర్చిస్తారు:

1. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు సహా చౌక రుణాలు అందుబాటులోకి తేవడం, సామాజిక భద్రత

2. అధునాతన నైపుణ్య శిక్షణ, ఆధునిక పని పరికరాలు & సాంకేతికతను అందేలా చూడడం

3. దేశీయ, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం కోసం మార్కెటింగ్ మద్దతు

4. పథకం రూపకల్పన, లబ్ధిదారుల గుర్తింపు, అమలు చేసే విధివిధానాలు

సంబంధిత కేంద్ర శాఖల మంత్రులు, కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఎంఎస్‌ఎంఈ, జౌళి మంత్రిత్వ శాఖల అనుబంధ కార్యాలయాల అధికారులు ఈ వెబినార్‌లో పాల్గొంటారు. వీరితో పాటు పరిశ్రమ ప్రతినిధులు, కళాకారులు, ఆర్థిక సంస్థలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సంఘాల ప్రతినిధులు కూడా హాజరవుతారు. బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఆలోచనలు, సూచనలు అందిస్తారు.

 

*******



(Release ID: 1905824) Visitor Counter : 117