ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేశనల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యొక్క మూడో సదస్సు నుమార్చి నెల 10 వ తేదీ న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ఈ సదస్సు కు ‘‘బిల్డింగ్ లోకల్ రిజిలియన్స్ ఇన్ ఎ చేంజింగ్ క్లయిమేట్ ’’ ఇతివృత్తం గా ఉంది

Posted On: 09 MAR 2023 4:05PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి నెల 10వ తేదీ న సాయంత్రం పూట 4 గంటల 30 నిమిషాల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో నేశనల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్ పిడిఆర్ఆర్) యొక్క మూడో సదస్సు ను ప్రారంభించనున్నారు. ‘‘బిల్డింగ్ లోకల్ రిజిలియన్స్ ఇన్ ఎ చేంజింగ్ క్లయిమేట్ ’’ (మారుతున్న శీతోష్ణస్థితి లో స్థానికం గా ఆటుపోటుల కు తట్టుకొని నిలబడే సామర్థ్యాన్ని ఏర్పరచడం) అనేది ఈ ప్లాట్ ఫార్మ్ యొక్క మూడో సదస్సు తాలూకు ప్రధాన ఇతివృత్తం గా ఉంది.

 

ఈ కార్యక్రమం లో, సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ గ్రహీతల ను ప్రధాన మంత్రి అభినందించనున్నారు. 2023 వ సంవత్సరం పురస్కార విజేతలు గా ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనిజ్ మెంట్ ఆథారిటి (ఒఎస్ డిఎమ్ఎ) మరియు మిజోరమ్ కు చెందిన లుంగ్ లేయి ఫైర్ స్టేశన్ లు నిలచాయి. వైపరీత్య సంబంధి నష్ట భయాన్ని తగ్గించే రంగం లో కొత్త కొత్త ఆలోచన లు, కార్యక్రమాలు, పరికరాలు మరియు సాంకేతికత ను కళ్ళ కు కట్టేటటువంటి ఒక ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

 

వైపరీత్యాల సంబంధి నష్టభయాన్ని తగ్గించే రంగం లో పరస్పరం సంభాషణలకు మార్గాన్ని సుగమం చేయడం, అనుభవాల ను, ఉద్దేశాల ను, ఆలోచనల ను వెల్లడించుకోవడం తో పాటు గా కార్యాచరణ ప్రధానమైనటువంటి పరిశోధన మరియు అవకాశాల అన్వేషణ ల కోసం భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక బహుళ భాగస్వాముల తో కూడిన ఒక సంస్థ యే ఎన్ పిడిఆర్ఆర్.

 

***


(Release ID: 1905362) Visitor Counter : 255