ఆర్థిక మంత్రిత్వ శాఖ
2019లో ఎస్ డబ్ల్యూ ఏ ఎం ఐ హెచ్ ఫండ్ ప్రారంభించినప్పటి నుండి 20,557 గృహాలను పూర్తి చేసింది
30 టైర్ 1 మరియు 2 నగరాల్లో వచ్చే 3 సంవత్సరాల్లో 81,000 గృహాలను పూర్తి చేయాలని ఫండ్ లక్ష్యాలు
ఫండ్ 26 ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. రూ. 35,000 కోట్లు కంటే ఎక్కువ ఆస్తుల నిర్మాణం చేస్తుంది
Posted On:
04 MAR 2023 1:32PM by PIB Hyderabad
అందుబాటు ధర గృహల మరియు మధ్యతరగతి గృహాల కోసం (SWAMIH) ప్రత్యేక విండో పెట్టుబడి నిధి I అనేది ఆర్థిక దివాళా తో కూడిన మరియు నిలిచిపోయిన నివాస ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన భారతదేశంలో అతిపెద్ద సామాజిక ప్రభావ నిధి.
ఈ ఫండ్ ను భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తుంది మరియు స్టేట్ బ్యాంక్ గ్రూప్ కంపెనీ అయిన ఎస్ బీ ఐ కాప్ వెంచర్స్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. భారతదేశంలో లేదా ప్రపంచ మార్కెట్లలో ఈ ఫండ్‌కు గతంలో గానీ ఇప్పుడు గానీ పోల్చదగిన ఫండ్ లేదు.
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) రిజిస్టర్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను సరసమైన, మధ్య-ఆదాయ గృహాల కేటగిరీలో దివాళా తీసిన లేదా నిలిచిపోయిన గృనిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రాధాన్యతా రుణ ఫైనాన్సింగ్‌ను అందించే లక్ష్యంతో ఇప్పటివరకు 15,530 కోట్లను సేకరించింది.
దాదాపు 130 ప్రాజెక్టులకు 12,000 కోట్లకు పైగా ఎస్ డబ్ల్యూ ఏ ఎం ఐ హెచ్ ఫండ్ ఇప్పటివరకు తుది ఆమోదం తెలిపింది. 2019లో ప్రారంభించబడిన ఈ ఫండ్, ఈ మూడు సంవత్సరాలలో, ఫండ్ 20,557 గృహాలను పూర్తి చేసింది మరియు 30 టైర్ 1 మరియు 2 నగరాల్లో వచ్చే మూడేళ్లలో 81,000 గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఫండ్ మొదటిసారి నిర్మాణ రంగ ప్రవేశం చేసిన డెవలపర్‌లు, సమస్యాత్మక ప్రాజెక్ట్‌లతో స్థాపించబడిన డెవలపర్‌లు, ఆగిపోయిన ప్రాజెక్ట్‌ల పేలవమైన ట్రాక్ రికార్డ్ ఉన్న డెవలపర్‌లు, కస్టమర్ ఫిర్యాదులు మరియు ఎన్ పీ ఏ ఖాతాలు, వ్యాజ్య సమస్యలు ఉన్న ప్రాజెక్ట్‌లను కూడా పరిగణిస్తుంది కాబట్టి, ఇది కష్టాల్లో ఉన్న ప్రాజెక్ట్‌లకు రుణదాతగా పరిగణించబడుతుంది.
ప్రాజెక్ట్ వ్యయాలపై దృఢమైన పర్యవేక్షణ మరియు నియంత్రణ ఎస్ డబ్ల్యూ ఏ ఎం ఐ హెచ్ యొక్క పెట్టుబడి ప్రక్రియలో ప్రధానమైనవి, అదే విధంగా వేగంగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి వీలు కల్పిస్తాయి. తరచుగా సంవత్సరాల తరబడి ఆలస్యమైన ప్రాజెక్ట్‌లలో ఫండ్ మెరుగైన వసూళ్ళు మరియు విక్రయాలకు కూడా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
ప్రమోటర్ల ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ బలమైనప్రాజెక్ట్ నియంత్రణలతో ఫండ్ 26 ప్రాజెక్ట్‌లలో నిర్మాణాన్ని పూర్తి చేయగలిగింది మరియు దాని పెట్టుబడిదారులకు రాబడిని అందించగలిగింది.
రూ. 35,000 కోట్లు కంటే ఎక్కువ గా విలువను లిక్విడిటీని విజయవంతంగా విడుదల చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అనేక అనుబంధ పరిశ్రమల వృద్ధిలో కూడా ఫండ్ కీలక పాత్ర పోషించింది.
***
(Release ID: 1904313)
Visitor Counter : 197