వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన కోటి మందికి పైగా రైతులు
కనీస మద్దతు ధరగా 146,960 కోట్ల రూపాయలు చెల్లించి మొత్తం 713 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
Posted On:
03 MAR 2023 10:31AM by PIB Hyderabad
ఖరీఫ్ పంట కాలం 2022-23 (ఖరీఫ్ పంట)లో జరిగిన ధాన్యం సేకరణ వల్ల దేశంలో కోటి మందికి పైగా రైతులు ప్రయోజనం పొందారు. 01.03.2023 వరకు సుమారు 713 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం 146960 కోట్ల రూపాయలను కనీస మద్దతు ధర రూపంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లకు జరిగేలా చూసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. సేకరించిన ధాన్యానికి సంబంధించి బియ్యం పంపిణీ కూడా పురోగతిలో ఉంది, సేకరించిన 713 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గాను 01.03.2023 వరకు సెంట్రల్ పూల్ లో 246 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు చేరాయి. ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలు సెంట్రల్ పూల్ లో అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుత 2022-23 ఖరీఫ్ పంట పంట కాలంలో సుమారు 766 ఎల్ఎంటి ధాన్యం (బియ్యం పరంగా 514 ఎల్ఎంటి) ధాన్యం సేకరణ జరుగుతుందని అంచనా. ఖరీఫ్ పంట కాలంలో జరిగిన సేకరణకు 2022-23 రబీ పంట కాలంలో జరిగిన 158 ఎల్ఎంటి ధాన్యం (బియ్యం పరంగా106 ఎల్ఎంటి) సేకరణను కలిపితే 2022-23 ఖరీఫ్ పంట కాలంలో మొత్తం ధాన్యం సేకరణ సుమారు 900 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు
***
(Release ID: 1903902)
Visitor Counter : 253