ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఫిబ్రవరి 2023లో రూ.1,49,577 కోట్ల స్థూల జీఎస్టీ రాబడి; గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ ఆదాయం కంటే 12% ఎక్కువ


వరుసగా 12 నెలల పాటు నెలవారీ జీఎస్టీ ద్వారా రూ. 1.4 లక్షల కోట్లను దాటిన ఆదాయం

వస్తువుల దిగుమతి నుండి ఆదాయాలు 6% ఎక్కువ, దేశీయ లావాదేవీలు (సేవల దిగుమతితో సహా) 15% ఎక్కువ

Posted On: 01 MAR 2023 2:36PM by PIB Hyderabad

ఫిబ్రవరి 2023 నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,49,577 కోట్లు. అందులో సి జీఎస్టీ రూ.27,662 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.34,915 కోట్లు, ఐజీఎస్టీ రూ.75,069 కోట్లు ( వస్తువుల దిగుమతులపై సేకరించిన రూ.35,689 కోట్లతో సహా). దీనితో పాటు సేకరించిన సుంకం రూ.11,931 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన ₹792 కోట్లతో సహా).

ఐజీఎస్టీ నుండి సిజీఎస్టీకి రూ.34,770 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ.29,054 కోట్లు సాధారణ సెటిల్‌మెంట్‌గా ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఫిబ్రవరి 2023 నెలలో సాధారణ సెటిల్‌మెంట్ల తర్వాత కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సిజీఎస్టీకి రూ.62,432 కోట్లు, ఎస్జీఎస్టీ కి రూ.63,969 కోట్లు. అదనంగా, జూన్ 2022 నెలకు రూ.16,982 కోట్లు, మునుపటి కాలానికి ఏజీ ధృవీకరించబడిన గణాంకాలను పంపిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.16,524 కోట్ల జీఎస్‌టీ పరిహారాన్ని కేంద్రం విడుదల చేసింది.

2023 ఫిబ్రవరి నెల ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే 12% ఎక్కువ, ఇది రూ. 1,33,026 కోట్లు. నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 6% ఎక్కువగా ఉన్నాయి మరియు దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు (సేవల దిగుమతితో సహా) గత సంవత్సరం ఇదే నెలలో ఈ మూలాధారాల నుండి వచ్చిన ఆదాయం కంటే 15% ఎక్కువగా ఉన్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుండి ఈ నెలలో అత్యధికంగా రూ.11,931 కోట్ల సెస్ వసూలు జరిగింది. సాధారణంగా, ఫిబ్రవరి నెల 28 రోజులలో ఉండటం వలన, రాబడి తక్కువగా ఉంటుంది.

దిగువ చార్ట్ ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ ఆదాయాల ట్రెండ్‌లను చూపుతుంది. ఫిబ్రవరి 2022తో పోలిస్తే ఫిబ్రవరి 2023 నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించబడిన జీఎస్టీ   రాష్ట్రాల వారీ గణాంకాలను ఈ పట్టిక వివరిస్తుంది. 

 

 

 

 

ఫిబ్రవరి 2023లో రాష్ట్రాల వారీగా GST రాబడి వృద్ధి

రాష్ట్రం 

ఫిబ్రవరి-22

ఫిబ్రవరి-23

వృద్ధి 

జమ్మూ కాశ్మీర్ 

326

434

33%

హిమాచల్ ప్రదేశ్ 

657

691

5%

పంజాబ్ 

1,480

1,651

12%

చండీగఢ్ 

178

188

5%

ఉత్తరాఖండ్ 

1,176

1,405

20%

హర్యానా 

5,928

7,310

23%

ఢిల్లీ 

3,922

4,769

22%

రాజస్థాన్ 

3,469

3,941

14%

ఉత్తరప్రదేశ్ 

6,519

7,431

14%

బీహార్ 

1,206

1,499

24%

సిక్కిం 

222

265

19%

అరుణాచల్ ప్రదేశ్ 

56

78

39%

నాగాలాండ్ 

33

54

64%

మణిపూర్ 

39

64

64%

మిజోరాం 

24

58

138%

త్రిపుర 

66

79

20%

మేఘాలయ 

201

189

-6%

అస్సాం 

1,008

1,111

10%

పశ్చిమ బెంగాల్ 

4,414

4,955

12%

ఝార్ఖండ్ 

2,536

2,962

17%

ఒడిశా 

4,101

4,519

10%

ఛత్తీస్గఢ్ 

2,783

3,009

8%

మధ్యప్రదేశ్ 

2,853

3,235

13%

గుజరాత్ 

8,873

9,574

8%

దాద్రా నాగర్ హవేలీ 

260

283

9%

మహారాష్ట్ర 

19,423

22,349

15%

కర్ణాటక 

9,176

10,809

18%

గోవా 

364

493

35%

లక్షద్వీప్ 

1

3

274%

కేరళ 

2,074

2,326

12%

తమిళనాడు 

7,393

8,774

19%

పుదుచ్చేరి

178

188

5%

అండమాన్ నికోబర్ 

22

31

40%

తెలంగాణ 

4,113

4,424

8%

ఆంధ్రప్రదేశ్ 

3,157

3,557

13%

లడఖ్ 

16

24

56%

ఇతర ప్రాంతాలు 

136

211

55%

కేంద్ర పరిధి 

167

154

-8%

మొత్తం 

98,550

1,13,096

15%

****(Release ID: 1903600) Visitor Counter : 189