ప్రధాన మంత్రి కార్యాలయం

‘పట్టణ ప్రాంతాల కు సంబంధించిన ప్రణాళిక రచన, అభివృద్ధి మరియు పారిశుధ్యం’ అనే అంశం పై బడ్జెటు అనంతరం ఏర్పాటైనవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ఇరవై ఒకటో శతాబ్ది లో భారతదేశం లో శరవేగం గా మారుతున్న వాతావరణం లో చక్కనిప్రణాళిక కలిగిన నగరాల ఏర్పాటు అనేది తక్షణావసరం కానుంది’’

‘‘క్రొత్త నగరాల అభివృద్ధి మరియు ఇప్పటికే ఉన్న నగరాల లో సేవల ఆధునికీకరణ.. ఈ రెండూ పట్టణాభివృద్ధి తాలూకు ప్రధానమైన అంశాలు అని చెప్పాలి’’


‘‘పట్టణ ప్రాంతాల ప్రణాళిక రచన అనేది అమృత కాలం లో మన నగరాల భవిష్యత్తు ను  నిర్ధారిస్తుంది;  మరి చక్కని ప్రణాళిక కలిగిన నగరాలేభారతదేశం యొక్క భవిష్యత్తు ను నిర్ధారిస్తాయి’’


‘‘మెట్రో నెట్ వర్క్ కనెక్టివిటీ పరం గా చూసినప్పుడు భారతదేశం అనేక దేశాల ను వెనుకపట్టునవదలివేసింది’’

‘‘2014 వ సంవత్సరం లో 14 నుండి 15 శాతం వ్యర్థాల ను మాత్రమే శుద్ధిపరచడం జరగ గా, దీనితో పోలిస్తే ప్రస్తుతం 75 శాతం వ్యర్థాల ను శుద్ధి పరచడం జరుగుతున్నది’’

‘‘మన క్రొత్త నగరాల లో చెత్త అనేదే ఉండకూడదు, అంతేకాకుండా మన క్రొత్త నగరాలు జల సురక్ష  ను కలిగి ఉండడంతోపాటు శీతోష్ణస్థితి తాలూకు ఆటుపోటుల ను తట్టుకో గలిగేటట్టు ఉండాలి’’

‘‘ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు మరియు ప్రణాళిక లు నగరాల ప్రజల జీవనాన్ని సరళతరం చేయాలి; అంతే కాక వారి స్వీయ

Posted On: 01 MAR 2023 11:29AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పట్టణ ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రణాళిక రచన లో శ్రద్ధఅనే అంశం పై బడ్జెటు అనంతర కాలం లో ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ ఆరో వెబినార్ గా ఉంది.

వెబినార్ లో పాలుపంచుకొన్న వారిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, స్వాతంత్య్రం అనంతరం దేశం లో ఇంతవరకు ప్రణాళిక యుక్తమైన నగరాలు ఒకటో లేదా రెండో మాత్రమే ఉండడం విచారకరం అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 75 సంవత్సరాల లో 75 ప్రణాళిక యుక్త నగరాల ను అభివృద్ధి పరచడం అంటూ జరిగి ఉండి ఉంటే, ప్రపంచం లో భారతదేశం యొక్క స్థానం పూర్తి భిన్నం గా ఉండేది అని ఆయన అన్నారు. 21 వ శతాబ్దం లో భారతదేశం లో శరవేగం గా మారుతున్నటువంటి వాతావరణం లో చక్కని ప్రణాళిక తో కూడిన నగరాలు ఏర్పడడం తక్షణావసరం అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. క్రొత్త నగరాల అభివృద్ధి మరియు ఇప్పటికే ఉన్న నగరాల లో సేవల ను ఆధునికీకరించడం అనేవి రెండూ పట్టణ ప్రాంతాల అభివృద్ధి లో ప్రధానమైన విషయాలు అని ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, దేశం లో ప్రతి ఒక్క బడ్జెటు లో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కి ప్రాధాన్యాన్ని కట్టబెట్టడమైంది అని ప్రముఖం గా ప్రస్తావించారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధి కి సంబంధించినటువంటి ప్రమాణాల కు గాను ఈ సంవత్సరం బడ్జెటు లో 15,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించిన సంగతి ని ఆయన తెలియజేస్తూ, దీనివల్ల ప్రణాళిక యుక్త పట్టణీకరణ జోరు అందుకొంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పట్టణ ప్రాంతాల అభివృద్ధి లో ప్రణాళిక రచన కు మరియు పరిపాలన కు ఉన్నటువంటి ప్రముఖ పాత్ర ను గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. నగరాల కు సంబంధించినంత వరకు పేలవమైన రీతి లో ప్రణాళిక రచన గాని, లేదా ప్రణాళికలు సిద్ధం అయినప్పటికీ అమలు లో సరి అయిన జాగ్రత్తలు లోపించినా గాని భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర లో పెను సవాళ్ళు ఎదురుకావచ్చని ఆయన అన్నారు. స్థలపరమైన ప్రణాళిక రచన, రవాణా పరమైన ప్రణాళిక రచన, ఇంకా పట్టణ ప్రాంతాల లో మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల లో తదేక శ్రద్ధ తో పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాల లో అర్బన్ ప్లానింగు కు సంబంధించినటువంటి ఇకో-సిస్టమ్ ను ఏ విధం గా బలపరచాలి, ప్రైవేటు రంగం లో అందుబాటు లో ఉన్న ప్రావీణ్యాన్ని ఏ విధం గా అర్బన్ ప్లానింగు లో సరి అయిన రీతి లో ఉపయోగించుకోవాలి అనే విషయాల తో పాటు ఒక కొత్త స్థాయి కి అర్బన్ ప్లానింగు ను తీసుకు పోయేటట్లు గా ఒక ఉత్కృష్టత కేంద్రాన్ని ఏ విధం గా అభివృద్ధి చేయాలి అనే మూడు ప్రధానమైన ప్రశ్నల పైన దృష్టి ని సారించవలసింది గా వెబినార్ లో పాలుపంచుకొన్న వారి కి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మరియు పట్టణాల స్థానిక సంస్థ లు ప్రణాళిక యుక్తమైనటువంటి పట్టణ ప్రాంతాల ను తయారు చేయగలిగినప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన దేశం కోసం అవి వాటి వంతు తోడ్పాటుల ను అందించగలుగుతాయి అని ఆయన అన్నారు. ‘‘పట్టణ ప్రాంత సంబంధి ప్రణాళిక రచన అనేది అమృత కాలం లో మన నగరాల భవిష్యత్తు ను నిర్ధారిస్తుంది; మరి చక్కని ప్రణాళిక తో కూడిన నగరాలు మాత్రమే భారతదేశం యొక్క భవిష్యత్తు ను ఖాయం చేయగలుగుతాయి’’అని ప్రధాన మంత్రి అన్నారు. ఒక మెరుగైన ప్రణాళిక రచన ఉన్నప్పుడే మన నగరాలు శీతోష్ణ స్థితి సంబంధి ఆటుపోటుల ను తట్టుకొనే విధం గాను, నీటి విషయం లో సురక్షితం గాను ఉండగలుగుతాయి అని కూడా ఆయన అన్నారు.

జిఐఎస్ అండ గా ఉండేటటువంటి మాస్టర్ ప్లానింగ్, వేరు వేరు రకాల తో కూడినటువంటి ప్రణాళిక రచన ఉపకరణాల ను అభివృద్ధిపరచడం, నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులు మరియు సామర్థ్యాల పెంపుదల వంటి రంగాల లో నిపుణులు వారు పోషించగలిగినటువంటి భూమిక ఏమిటి అనే దానితో పాటు సరిక్రొత్త ఆలోచనల తో ముందుకు రావాలని ప్రధాన మంత్రి అభ్యర్థించారు. నిపుణుల యొక్క ప్రావీణ్యం పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థల కు ఎంతో అవసరం, మరి ఈ విధం గా అనేక అవకాశాలు అందివస్తాయి అని ఆయన అన్నారు.

నగరాల అభివృద్ధి లో రవాణా సంబంధి ప్రణాళిక రచన అనేది ఒక ముఖ్యమైన అంశం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మన నగరాల లో గతిశీలత అనేది ఎటువంటి అంతరాయాల కు తావు లేనటువంటిది గా ఉండాలి అని ఆయన అన్నారు. 2014 వ సంవత్సరాని కి పూర్వ కాలం లో దేశం లో మెట్రో కనెక్టివిటీ ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఇప్పుడున్న ప్రభుత్వం అనేక నగరాల లో మెట్రో రైల్ సదుపాయాన్ని అందించే విషయం లో కృషి చేసిందని, మరి మెట్రో నెట్ వర్క్ కనెక్టివిటీ పరం గా చూసినప్పుడు అనేక దేశాల ను అధిగమించిందని పేర్కొన్నారు. మెట్రో నెట్ వర్కు ను పటిష్ట పరచవలసిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటిస్తూ, సంధాన సదుపాయాన్ని ప్రజలందరి కీ సమకూర్చాలి అన్నారు. నగరాల లో రహదారుల విస్తరణ, గ్రీన్ మొబిలిటీ, ఎత్తు గా నిర్మించినటువంటి రహదారులు మరియు చౌరస్తా ల మెరుగుదల వంటి చర్యల ను రవాణా సంబంధి ప్రణాళిక రచన లో ఒక భాగం గా తప్పక చేర్చవలసింది అని కూడా ఆయన అన్నారు.

‘‘భారతదేశం తన చక్రీయ ఆర్థిక వ్యవస్థ ను పట్టణ ప్రాంతాల అభివృద్ధి కి ఒక మూలాధారం గా తీర్చిదిద్దుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మన దేశం లో నిత్యం బ్యాటరీ సంబంధి వ్యర్థ పదార్థాలు, విద్యుత్తు సంబంధి వ్యర్థ పదార్థాలు, వాహనాల కు సంబంధించిన వ్యర్థ పదార్థాలు, వాహనాల చక్రాలు మరియు పచ్చిఎరువు కు సంబంధించిన వ్యర్థాలు వంటి పట్టణ ప్రాంతాల లో ఉత్పన్నం అవుతున్న వ్యర్థ పదార్థాలు వేల టన్నుల కొద్దీ ఉంటున్నాయి అని వివరించారు. 2014 వ సంవత్సరం లో 14 నుండి 15 శాతం చెత్త ను మాత్రమే శుద్ధి చేయడం తో పోల్చి చూస్తే ప్రస్తుతం 75 శాతం వ్యర్థాల ను శుద్ధి చేయడం జరుగుతోంది అని ఆయన తెలియ జేశారు. ఈ విధమైనటువంటి చర్య ను ఇదివరకు తీసుకొని ఉండి ఉంటే గనుక భారతదేశం లోని నగరాల అంచు ప్రాంతాల లో చెత్త చెదారం గుట్టలు గుట్టలు గా పేరుకుపోయి ఉండేది కాదు అని ఆయన అన్నారు. వ్యర్థ పదార్థాల శుద్ధి ప్రక్రియ ద్వారా నగరాల కు చెత్త కుప్పల బారి నుండి విముక్తి ని కల్పించే కృషి సాగుతోంది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఇది అనేక పరిశ్రమల కు రీసైకిలింగ్ మరియు సర్క్యులారిటీ సంబంధి అవకాశాల ను విస్తారం గా అందించనుందన్నారు. ఈ రంగం లో విశేషం గా పాటుపడుతున్నటువంటి స్టార్ట్-అప్స్ కు సమర్ధన ను అందించవలసింది గా ప్రతి ఒక్కరి కీ ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యర్థాల నిర్వహణ తాలూకు స్తోమత ను వీలైనంత ఎక్కువ స్థాయి కి పరిశ్రమలు తీసుకు పోవాలి అని ఆయన నొక్కిచెప్పారు. అమృత్ పథకం సఫలం కావడం తో నగరాల లో స్వచ్ఛమైన త్రాగునీటి ని సరఫరా చేయడం కోసం అమృత్ 2.0 ను ప్రవేశపెట్టడం జరిగింది అని ఆయన వెల్లడించారు. జలం మరియు మురుగునీటి కి సంబంధించినంత వరకు సాంప్రదాయక నమూనా కంటే ఒక అడుగు ముందుకు వేసి తగిన ప్రణాళికల ను రచించడం ముఖ్యం అని కూడా ప్రధాన మంత్రి చెప్పారు. ఒకసారి ఉపయోగించిన నీటి ని శుద్ధి పరచి కొన్ని నగరాల లో పారిశ్రామిక ఉపయోగం కోసం పంపడం జరుగుతోంది అని ఆయన అన్నారు.

రెండో అంచె నగరాల లో మరియు మూడో అంచె నగరాల లో అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ప్లానింగ్ లలో పెట్టుబడి ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఆర్కిటెక్చర్ కావచ్చు, జీరో డిశ్చార్జి మాడల్ కావచ్చు, ఎనర్జీ తాలూకు నెట్ పాజిటివిటి కావచ్చు, భూమి ని వినియోగించుకోవడం లో దక్షత కావచ్చు, ట్రాంజిట్ కారిడోర్స్ కావచ్చు లేదా సార్వజనిక సేవల లో ఎఐ ని ఉపయోగించడం వంటి ప్రమాణాలు కలిగి ఉండే విధం గా మన భావి నగరాల కోసం కొత్త పారామీటర్స్ ను ఏర్పరచాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఆట స్థలాలు, బాలల కు సైకిల్ నడిపేందుకు ప్రత్యేకమైన మార్గాల వంటి అవసరాల ను తీర్చడం అనేది పట్టణ ప్రాంత ప్రణాళిక రచన లో భాగం కావాలి అని కూడా ఆయన అన్నారు.

‘‘ప్రభుత్వం అమలుపరుస్తున్న విధానాలు మరియు ప్రణాళికలు నగర ప్రాంతాల ప్రజల జీవనాన్ని సరళతరం చేయాలి; అంతే కాకుండా, వారు స్వీయ పురోగతి ని సాధించేందుకు కూడాను అవి సాయపడాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంవత్సరం బడ్జెటు లో పిఎమ్-ఆవాస్ యోజన కోసం దాదాపు గా 80,000 కోట్ల రూపాయల ను ఖర్చు చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకొన్న సంగతి ని గురించి ఆయన తెలియజేస్తూ, ఒక ఇంటి నిర్మాణం కొనసాగుతున్నప్పుడల్లా సిమెంటు, ఉక్కు, రంగులు మరియు గృహోపకరణాల కు సంబంధించిన పరిశ్రమలు ఉత్తేజాన్ని అందుకొంటాయన్నారు. పట్టణాభివృద్ధి రంగం లో భావికాల పు సాంకేతిక విజ్ఞానం యొక్క పాత్ర అంతకంతకు పెరుగుతూ పోతున్న అంశం గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఈ దిశ లో ఆలోచనల ను చేస్తూ సత్వర కార్యాచరణ కు నడుం బిగించవలసిందిగా స్టార్ట్-అప్స్ కు, పరిశ్రమ కు విజ్ఞప్తి శారు. ‘‘అందుబాటు లో ఉన్న అవకాశాల తాలూకు ప్రయోజనాల ను సద్వినియోగ పరచుకోవడం తో పాటు కొత్త అవకాశాల కు ఆస్కారాన్ని కల్పించేటటువంటి వాటిని కూడా పూర్తి గా వినియోగించుకోవాలి. దీర్ఘకాలం పాటు చెక్కుచెదరక నిలచి ఉండేటటువంటి గృహాల ను రూపుదిద్దడం కోసం అనుసరించదగిన సాంకేతిక విజ్ఞానం మొదలుకొని ఏకం గా ఆ తరహా నగరాల ను నిర్మించడం వరకు కొత్త కొత్త పరిష్కార మార్గాల ను మనం కనుగొనవలసి ఉంది’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

***

DS/TS



(Release ID: 1903427) Visitor Counter : 221