ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశవిదేశాల్లో అత్యంత నాణ్యమైన ‘శ్రీ అన్న’ ఉత్పత్తులకు ప్రోత్సాహం దిశగా కీలక చర్యలపై ప్రధాని అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2023 10:36AM by PIB Hyderabad

   దేశవిదేశాల్లో అత్యంత నాణ్యమైన ‘శ్రీ అన్న’ ఉత్పత్తులకు ప్రోత్సాహం దిశగా కీలక చర్యలు తీసుకోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చిరుధాన్యాల లభ్యతకు భరోసా ఇస్తూ భారత ఆహార భద్రత-ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) 15 రకాల చిరుధాన్యాలకు 8 రకాల నాణ్యత పారామితులతో ప్రమాణాన్ని రూపొందించిందని మంత్రి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చేసిన ట్వీట్‌పై శ్రీ మోదీ స్పందించారు.

ఈ మేరకు ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ అత్యుత్తమ నాణ్యతగల ‘శ్రీ అన్న’ ఉత్పత్తులకు ప్రోత్సాహం దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.” అని అందులో పేర్కొన్నారు.

****

DS/ST


(రిలీజ్ ఐడి: 1902539) సందర్శకుల సూచీ సంఖ్య : : 247