ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని సిధీలో బస్సు ప్రమాదం వల్ల ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు..
క్షతగాత్రులకు రూ.50 వేలు వంతున పరిహారం ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2023 3:00PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్‌లోని సిధిలో సంభవించిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి తలా రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50,000 వంతున పరిహారం ప్రకటించారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“మధ్యప్రదేశ్‌లోని సిధీలో బస్సు దుర్ఘటన నన్నెంతో బాధించింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాధితులందరికీ తగిన సహాయం అందిస్తోంది” అని పేర్కొంది.
అలాగే “పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించబడింది” అని ఆ ప్రకటన వివరించింది.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1902420)
సందర్శకుల సూచీ సంఖ్య : : 169
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam