ప్రధాన మంత్రి కార్యాలయం
అనుసంధానంతోనే దేశ సౌభాగ్యం.. మా ప్రాథమ్యాల్లో దానికే అగ్రాసనం: ప్రధానమంత్రి
Posted On:
25 FEB 2023 9:46AM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్లోని ఖజనీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బేల్‌ఘాట్ - సిక్రిగంజ్ మధ్య 8 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు పూర్తికావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్కడి ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ పనులు పూర్తయినట్లు సంత్‌కబీర్ నగర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ శ్రీ ప్రవీణ్ నిషాద్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ- భారతదేశ సౌభాగ్యం అనుసంధానంతోనే ముడిపడి ఉందని, తమ ప్రభుత్వ ప్రాథమ్యాలలో దీనికి పెద్దపీట వేశామని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“అనేకానేక అభినందనలు! మన దేశ సౌభాగ్యం అనుసంధానం మీదనే ఆధారపడింది ఉంది. కాబట్టే మా ప్రభుత్వం ప్రాధాన్యాలలో దానికి అగ్రస్థానమిచ్చాం” అని ప్రధాని వివరించారు.
******
DS/ST
(Release ID: 1902419)
Visitor Counter : 151
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam