పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఇంటర్ నేశనల్ సివిల్ ఏవియేశన్ (శికాగోకన్ వెన్శన్), 1944 లో సవరణల కు సంబంధించిన ఆర్టికల్ 3 బిఐఎస్, ఆర్టికల్ 50 (ఎ) మరియు ఆర్టికల్ 56 లతోముడిపడ్డ మూడు ప్రోటోకాల్స్ ను ధ్రువపరచడానికి ఆమోదాన్ని తెలియజేసిన మంత్రిమండలి
Posted On:
22 FEB 2023 12:45PM by PIB Hyderabad
ఇంటర్ నేశనల్ సివిల్ ఏవియేశన్ (శికాగో కన్ వెన్శన్), 1944 లో సవరణల కు సంబంధించినటువంటి ఆర్టికల్ 3 బిఐఎస్, ఆర్టికల్ 50 (ఎ) మరియు ఆర్టికల్ 56 లతో ముడిపడ్డ మూడు ప్రోటోకాల్స్ ను ధ్రువపరచడానికి గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది.
శికాగో కన్ వెన్శన్ లోని ఆర్టికల్స్ ఒప్పందాల ను కుదుర్చుకునేటటువంటి అన్ని దేశాల యొక్క విశేష అధికారాల ను మరియు కర్తవ్యాల ను నిశ్చయపరచడం తో పాటు అంతర్జాతీయ ఐసిఎఒ స్టాండర్డ్ స్ ఎండ్ రెకమండెడ్ ప్రాక్టీసెస్ (ఎస్ఎఆర్ పి స్) ను అవలంభించేందుకు సైతం ప్రోత్సహిస్తాయి.
గడచిన 78 సంవత్సరాల కాలం లో, శికాగో కన్ వెన్శన్ లో కొన్ని సవరణ లు జరిగాయి. ఆయా సవరణల కు భారతదేశం ఎప్పటికప్పుడు అనుమోదాన్ని తెలియజేస్తూ వచ్చింది. ఇంటర్ నేశనల్ సివిల్ ఏవియేశన్ ‘‘శికాగో కన్ వెన్శన్’, 1944 లో సవరణల కు సంబంధించి ఈ క్రింద ప్రస్తావించినటువంటి మూడు ప్రోటోకాల్స్ ను ధ్రువపరచేందుకు కు ఆమోదాన్ని ఇవ్వడమైంది:
i. శికాగో కన్ వెన్శన్, 1944 లో ఆర్టికల్ 3 బిఐఎస్ ను ప్రవేశపెట్టడాని కి సంబంధించిన ప్రోటోకాల్.. ఇది నింగి లో విహరిస్తున్నటువంటి పౌర విమానాల కు వ్యతిరేకం గా ఆయుధాల ప్రయోగాని కి పాల్పడకుండా సభ్యత్వ దేశాల ను అడ్డుకోవడానికి లక్షించింది. (ప్రోటోకాల్ పై 1984 మే నెల లో సంతకం చేయడమైంది);
i. శికాగో కన్ వెన్శన్ 1944 లో గల ఆర్టికల్ 50 (ఎ) ను సవరించడాని కి ఉద్దేశించినటువంటి ప్రోటోకాల్.. ఇది ఐసిఎఒ కౌన్సిల్ యొక్క శక్తి ని 36 నుండి 40 కి పెంచేందుకు తోడ్పడుతుంది; (ప్రోటోకాల్ పై 2016 అక్టోబరు లో సంతకం చేయడమైంది); మరియు
ii. శికాగో కన్ వెన్శన్ 1944 లో గల ఆర్టికల్ 56 ను సవరించడాని కి సంబంధించిన ప్రోటోకాల్.. ఇది ఎయర్ నేవిగేశన్ కమిశన్ యొక్క శక్తి ని 18 నుండి 21 కి పెంచేందుకు ఉద్దేశించినటువంటిది. (ప్రోటోకాల్ పై 2016 అక్టోబరు లో సంతకం చేయడమైంది).
ఈ ధ్రువపరచడం అనేది కన్ వెన్శన్ ఆన్ ఇంటర్ నేశనల్ సివిల్ ఏవియేశన్ లో నిహితమైనటువంటి సిద్ధాంతాల కు భారతదేశం కట్టుబడి ఉంటుంది అని పునరుద్ఘాటిస్తుంది. అంతేకాకుండా, ఈ అనుమోదం భారతదేశాని కి అంతర్జాతీయ పౌర విమానయానాని కి సంబంధించిన వ్యవహారాల లో మరింత మహత్వపూర్ణమైనటువంటి భూమిక ను నిర్వహించడం కోసం మెరుగైన సంభావనల ను మరియు అవకాశాల ను అందిస్తుంది.
***
(Release ID: 1901467)
Visitor Counter : 162